వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

పైప్‌ ‌లైన్ల ద్వారా … వంటింటికే గ్యాస్‌ .

September 3, 2019

-ఎల్‌పీజీ పంపిణీ – చురుగ్గా సాగుతున్న పనులు.
-కేజీ బేసిన్‌ ‌గుజరాత్‌ ‌పైప్‌ ‌లైన్‌  ‌ద్వారా సరఫరా.
-సిలిండర్‌తో పోలిస్తే ధర తక్కువ.
-ఉమ్మడి మెదక్‌ ‌జిల్లాలో 3 లక్షల కనెక్షన్లు.
-పరిశ్రమలు, వాహనాలకు, వాణిజ్య అవసరాలకూ పైప్‌లైన్‌ ‌ద్వారానే.

ఫోటో: పటాన్‌చెరు మండలం ఇంద్రేశం గ్రామంలో కొనసాగుతున్న గ్యాస్‌ ‌పైప్‌లైన్‌ ‌నిర్మాణ పనులు.

ఇక సమీప భవిష్యత్తులో సిలిండర్ల ద్వారా వంట గ్యాస్‌ ‌సరఫరా విధానం కనుమరుగు కాబోతుంది. దాని స్థానంలో భూగర్భంలో వేసిన ప్రత్యేక పైపులైన్ల ద్వారా నేరుగా మన వంటగదికి గ్యాస్‌ ‌ను సరఫరా చేసే పథకం రూపుదిద్దుకోబోతోంది. ఇదంతా ఏదో పెద్ద పెద్ద నగరాల్లోనే అనుకుంటే మీరు పొరబడినట్లే, మన ప్రాంతంలోని పట్టణాలతో పాటు గ్రామాలకు కూడా పథకాన్ని విస్తరించేందుకు చురుగ్గా పనులు సాగుతున్నాయి. సంగారెడ్డి, మెదక్‌, ‌సిద్దిపేట జిల్లాలోని పట్టణాలు మారుమూల గ్రామాలకు త్వరలోనే ఈ సౌకర్యం అందుబాటులోకి రాబోతోంది. భవిష్యత్తులో గ్యాస్‌ ‌బండ కోసం బుక్‌ ‌చేయడం, డీలర్ల ద్వారా  ఆటోలో ఇంటింటికి  సరఫరా చేసే ప్రస్తుత పద్ధతికి స్వస్తిపలికే రోజులు రానున్నాయి. పటాన్‌చెరు  నియోజకవర్గం పరిధిలోని గ్రామాలకు పట్టణాలకు త్వరలోనే పైప్‌లైన్‌ ‌ద్వారా నేరుగా వంటగది•శీ గ్యాస్‌ ‌సరఫరా కానుంది. ఇంద్రేశం, ఐనోల్‌, ‌చిన్న కంచర్ల, పెద్దకంజర్ల, పోచారం, బచ్చు గూడెం, కృష్ణ రెడ్డిపేట, సుల్తాన్‌పూర్‌, ‌బొల్లారం, పటాన్‌చెరు, రామచంద్రపురంకు పైపులైన్ల పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఉమ్మడి మెదక్‌ ‌జిల్లా పరిధిలో సుమారు 3 లక్షల ఇండ్లకు మొదటి విడతలో గ్యాస్‌ ‌కనెక్షన్లను ఇచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.

కాకినాడ బారుచ్‌ ‌లైన్లకు అనుసంధానంగా గ్రిడ్‌  కృష్ణా గోదావరి బేసిన్‌ ‌చమురు నిక్షేపాల నుంచి సహజ వాయువును తరలించేందుకు కాకినాడ నుంచి గుజరాత్‌ ‌బరుచ్‌ ‌వరకు 1440 కిలోమీటర్ల మేర ఈస్ట్ ‌వెస్ట్ ‌పైపులైన్లను పేరుతో గతంలో రిలయన్స్ ‌సంస్థ పైపులైన్‌ ‌వేసింది. ఆ పైపు లైన్‌ ‌ద్వారా నిత్యం గ్యాస్‌ ‌గుజరాత్‌కు ప్రవహిస్తూనే ఉంది. అదే గ్యాస్‌ అక్కడ సిలిండర్లలో నింపి దేశం మొత్తం సరఫరా చేస్తున్నారు. ఈ పద్ధతికి స్వస్తి పలికి పైపు లైన్‌ ‌ద్వారా ఆయా ప్రాంతాలలో ప్రత్యేక గ్రిడ్లను ఏర్పాటు చేసి పట్టణాలు గ్రామాల్లో ఇళ్ళకు వంట గ్యాస్‌ ‌సరఫరా చేసేందుకు గతంలోనే ప్రణాళిక సిద్ధం చేశారు. ఈ విషయమైన కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు రెగ్యులేటరీ అథారిటీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదింపులు జరిపింది. సిటీ గ్యాస్‌ ‌డిస్ట్రిబ్యూషన్‌ (‌సీజీడి) పథకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రూపకల్పన చేశాయి. సుమారు 600కోట్లతో తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి, మెదక్‌, ‌ఖమ్మం, నల్లగొండ జిల్లాలకు పైపులైన్‌ ‌ద్వారా నేరుగా వంటగదికే గ్యాస్‌ ‌సరఫరా చేసే మహాత్తర పథకాన్ని రూపొందించారు.

వాణిజ్య అవసరాలకూ పైప్‌లైన్‌ ‌ద్వారానే.. 

పైప్‌లైన్ల ద్వారా గ్యాసును కేవలం గృహ అవసరాలకే కాకుండా పరిశ్రమలు, వాణిజ్య అవసరాలకు కూడా సరఫరా చేయనున్నారు. ముఖ్యంగా మెదక్‌ ‌జిల్లాలోని పారిశ్రామిక వాడల్లో పెద్ద ఎత్తున పరిశ్రమలకు పైప్‌ ‌లైన్లను  విస్తరించబోతున్నారు. హోటళ్లు, రెస్టారెంట్లు, చిన్నచిన్న టిఫిన్‌ ‌సెంటర్లకు సైతం వాణిజ్య కనెక్షన్లు ఇచ్చేందుకు పైప్‌లైన్ల ద్వారా విస్తరణ సాగుతుంది. ఇప్పటికే హైదరాబాద్‌ ‌నగరంలో 26 సీఎన్‌జీ స్టేషన్లకు పైపులైన్ల ద్వారా గ్యాస్‌ ‌సరఫరా  జరుగుతుంది. పటాన్‌చెరు ప్రాంతంలో పైప్‌లైన్లను విస్తరించే కాంట్రాక్టు పనులు చేపట్టిన టోరెంట్‌ ‌సంస్థ చురుగ్గా పైప్‌లైన్ల  నిర్మాణ పనులు పనులు సాగిస్తున్నారు. ప్రస్తుత సిలిండర్‌ ‌ధరతో పోలిస్తే పైపులైన్‌ ‌ద్వారా తక్కువ ధరకు లభిస్తుందని ఆధికారులు తెలుపుతున్నారు. పైపులైను గ్యాస్‌ అం‌దుబాటులోకి వస్తే ఇక గ్యాస్‌ ఏజెన్సీలు మూతపడడం ఖాయంగా కనిపిస్తుంది. సిలిండర్‌ ‌కనుమరగయ్యే సమయం ఎంతో దూరంలో లేదని అంటున్నారు.