వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

పేదల ఎజెండానే… టిఆర్‌ఎస్‌ ఎజెండా

April 1, 2019

అభివృద్ధి.. సంక్షేమంలో కలసి పనిచేద్దాం
టిఆర్‌ఎస్‌లో చేరిన సిపిఎం, సిఐటియు నాయకులు

పేదల ఎజెండానే…టిఆర్‌ఎస్‌ ‌పార్టీ జెండా, ఎజెండానే అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. శనివారం సిద్ధిపేటలో హరీష్‌ ‌సమక్షంలో సిపిఎం, సిఐటియు పార్టీలకు చెందిన గ్యాదరి జగన్‌, ‌నాగరాజుతో పాటు పలువురు కార్యకర్తలు టిఆర్‌ఎస్‌లో చేరారు. టిఆర్‌ఎస్‌లో చేరిన వారికి హరీష్‌రావు గులాబీ కండువాను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ…అందరం కలిసి పనిచేయడం ద్వారా నిజమైన నిరుపేదలకు న్యాయం జరుగుతుందనీ, పేదల ఎజెండానే మన ఎజెండాగా కలిసి పనిచేద్దామన్నారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో సిపిఎం పార్టీ కనుమరుగయ్యిందన్నారు. గత ఎన్నికల్లో సిపిఎం నుండి ఒక్క ఎమ్మెల్యే ఉండగా…ప్రస్తుతం ఒక్కరంటే ఒక ఎమ్మెల్యే కూడా ఆ పార్టీకి లేకుండా ప్రజలు తీర్పునిచ్చారన్నారు. తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీ రోజురోజుకు బలపడుతుం దన్నారు. పేదలకు సేవ చేయడంలో..సంక్షేమ ఫలాలు అందించే విషయంలో కలిసి పని చేయాలన్నారు. అభివృద్ధిలో సిద్దిపేట ముందుంది. అభివృద్ధికి టిఆర్‌ఎస్‌ ‌పార్టీ చేస్తున్న కృషికి పేదల సంక్షేమానికి అకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టిఆర్‌ఎస్‌ ‌పార్టీలో చేరుతున్నారున్నారు. పార్టీలో చేరిన వారందరికి సముచితమైన స్థానాన్ని కల్పిస్తామంటూ… జరగబోయే పార్లమెంటు ఎన్నికలలో మెదక్‌ ‌టిఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎంపి అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డికి భారీ మెజారిటీ కొరకు అందరమూ కలిసి కట్టుగా కష్టపడుదామన్నారు. అలాగే, పోలింగ్‌ ‌శాతాన్ని పెంచేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎంపి కొత్త ప్రభారక్‌ ‌రెడ్డి మాట్లాడుతూ.. సిద్దిపేట అంటే అభివృద్ధికి కేరాఫ్‌ అ‌డ్రస్‌ అని.. ఇంకా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉందనీ, మరోసారి నాకు ఎంపీగా అవకాశం వచ్చిందనీ, నన్ను ఆశీర్వదించి గెలుపుకు కృషి చేయాలనీ కోరారు.

అభివృద్ధి నాయకునికి ఆకర్షితులమై…
అభివృద్ధిలో సిద్ధిపేట దేశంలో ఆదర్శంగా మారిందనీ… మెజారిటీలో కూడా ఆదర్శం చేసుకుందామనీ, అభివృద్ధి నాయకుడైన హరీష్‌రావు చేస్తున్న పనులకు ఆకర్షితులమై టిఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు నాయకులు గ్యాదరి జగన్‌, ‌నాగరాజు అన్నారు. సిద్దిపేట అభివృద్ధి రాష్టంలోనే ఆదర్శం అని.. గత ఎన్నికల్లో మెజారిటీలో దేశ స్థాయి సిద్దిపేట పేరు నిలిచింది అని కేవలం హరీష్‌తోనే సాధ్యమైందన్నారు. అభివృద్ధి నాయకునితో కల్సి పని చేయాలని పార్టీలోకి వచ్చామన్నారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్‌ ‌ఛైర్మన్‌ ‌కడవేర్గు రాజనర్సు, మోహన్‌లాల్‌ ‌తదితరులు పాల్గొన్నారు.