Take a fresh look at your lifestyle.

పేదల అభ్యున్నతికి ఎపి సర్కార్‌ ‌మరో పథకం

  • జగనన్న చేదోడు పథకాన్ని ప్రారంభించిన జగన్‌
  • ‌నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్ల అకౌంట్లలోకి నేరుగా పదివేల జమ
  • కరోనా కష్టకాలంలో ఆదుకున్నారన్న ఆయా వర్గాలు

అమరావతి,జూన్‌ 10 : ‌పేదల అభ్యున్నతి కోసం వరుసగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి మరో పథకానికి శ్రీకారం చుట్టారు. జగనన్న చేదోడు పథకాన్ని బుధవారం ప్రారంభించారు. క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో కంప్యూటర్‌ ‌బటన్‌ ‌నొక్కి లబ్దిదారుల బ్యాంకు ఖాతాల్లో రూ.10,000 చొప్పున నగదు జమ చేశారు. ఈ పథకం ద్వారా మొత్తం 2.47 లక్షల మంది లబ్దిదారుల ఖాతాల్లో.. రూ.247.04 కోట్లు జమ చేయనున్నారు. ’జగనన్న చేదోడు’ ద్వారా నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందుతుంది. రాజకీయాలు, పార్టీలకతీతంగా.. గ్రామ, వార్డు వలంటీర్ల ద్వారా లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేసి ప్రభుత్వం సహాయం అందిస్తోంది. లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోవడంతో ఈ పథకం వారికి వరంగా మారింది. తమ శ్రమను మాత్రమే నమ్ముకుని పనిచేస్తున్న గొప్ప మనుషుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించినట్టు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌ అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం అర్హులైన నాయీ బ్రాహ్మణులు, రజకులు, టైలర్లకు ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నామని చెప్పారు. సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా అర్హులను ఎంపిక చేశామని.. ఇంకా అర్హులెవరైనా ఉంటే గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరికి చేయూత అందించడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందాలని సీఎం జగన్‌ ‌స్పష్టం చేశారు. కులాలు, మతాలు, రాజకీయాలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. 3.58 కోట్ల మంది పేదలకు సంక్షేమ పథకాలు అందించామని వెల్లడించారు.

అమ్మఒడి, విద్యా దీవెన, వసతి దీవెన, వాహనమిత్ర, నేతన్న నేస్తం, జగనన్న చేదోడు, ఆరోగ్యశ్రీ, సున్నా వడ్డీ వంటి ఎన్నో పథకాలు చేపట్టామన్నారు. పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పాదయాత్రలో చెప్పిన ప్రతి మాటను నెరవేర్చ గలిగానని సీఎం జగన్‌ అన్నారు. కరోనా కష్ట కాలంలో ప్రభుత్వం చూపిన చొరవకు లబ్దిదారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా లబ్దిదారులు మాట్లాడుతూ.. ప్రతి పేద కుటుంబం సీఎం జగన్‌కు రుణపడి ఉంటుందన్నారు. నవరత్నాలు పేదల అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి. గవర్నమెంట్‌ ఉద్యోగులకు ఇచ్చినట్టుగా పెన్షన్లు ఇస్తున్నారు. ఇంక్రిమెంట్‌ ‌పెరిగినట్టుగా పెన్షన్‌ ‌పెంచుతున్నారు, అవ్వతాతలు మిమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు. పేదోళ్ల గుండెల్లో రు దేవుడిగా నిలిచిపోతారు. నేనున్నానని చెప్పిన విధంగానే మాకు కు సాయపడుతున్నారు. కరోనా సమయంలో బయటకు వెళ్లి పనిచేసే పరిస్థితి లేకపోవడంతో రు అందించిన సాయం ఎంతగానే అక్కరకొచ్చింది. రాబోయే తరంలోనూ రే ముఖ్యమంత్రిగా ఉండాలంటూ దీవించారు. అమ్మఒడి పథకం ద్వారా మా పిల్లలకు చేయూత ఇచ్చారు. సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ పేదలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. పేదలకు ఏ పథకం రావాలో వాలంటీర్లు నేరుగా ఇంటికొచ్చి చెప్తున్నారు. మా గురించి ఇంతగా ఆలోచించిన పాలకులు ఎవరూ లేరు. ఐదేళ్లలో చేయాల్సిన పనులను ఏడాదిలోనే చేసి చూపించారని పలువురు అన్నారు. 30 ఏళ్లుగా ఇలాంటి స్కీమ్‌ ‌చూడలేదు. లబ్దిదారుల్లో మా పేరు ఉండటం సంతోషాన్ని కలిగించింది. నాయీ బ్రాహ్మణులు కు రుణపడి ఉన్నారన్నారు. జగనన్న చోదోడుతో కరోనా సమయంలో లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపారు. మరో 50 ఏళ్లు జగన్‌ ‌సీఎంగా ఉండాలి. గ్రామ సచివాలయాలు నిర్మించి ఎంతో మంచిపని చేశారు. గ్రామస్వరాజ్యాన్ని నిజం చేసిన నాయకుడు వైఎస్‌ ‌జగన్‌. ‌రు ధన్యులు సార్‌, ‌మా గుండెల్లో చిరస్థాయిగా నిలిపోతారని పలువురు వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply