Take a fresh look at your lifestyle.

పెనం నుంచి పొయ్యిలోకి ..!

గ్లోబరీనాకు తోడు డాటాటెక్‌ ‌మెథడిక్స్
‌వివాదాల్లో కూరుకున్న సంస్థకే మళ్లీ ఇంటర్‌ ‌బాధ్యతలు?
తమిళనాడులో టీచర్ల రిక్రూట్‌మెంట్‌లో సంస్థ గోల్‌ ‌మాల్‌
అరెస్టులు, న్యాయస్థానాల మొట్టికాయలు…
ప్రముఖ ఆంగ్ల పత్రికలైన ది హిందూ, డెక్కన్‌ ‌క్రానికల్‌, ‌ది ఇండియన్‌ ఎక్స్ ‌ప్రెస్‌ ‌సైతం సంస్థ చేసిన నిర్వాకాన్ని వెలుగులోకి తెచ్చాయి. సంస్థ ప్రతినిధులను సైతం అరెస్టులు చేసారు. ఏకంగా రిక్రూట్‌మెంటును నిలిపివెయ్యాలని న్యాయస్థానాలు సూచించాయి. కాగా తమ సంస్థకు సంబంధంలేదని కేవలం సంస్థలో పనిచేసే ఉద్యోగస్తుల నిర్వాకమేనని డాటాటెక్‌ ‌మెథడిక్స్ ‌సంస్థ ప్రకటించుకొని చేతులు దులుపుకొంది. ఇంత తతంగం వున్న డాటాటెక్‌ ‌మెథడిక్స్ ‌సంస్థకు తెలంగాణ విద్యార్థుల జీవితాలను అప్పగించడమంటే పెనం నుంచి పొయ్యిలపడ్డ చందమే..!
జి. సంపత్‌ ‌కుమార్‌ (‌సీనియర్‌ ‌జర్నలిస్టు- ప్రజాతంత్ర పరిశోధన)
ఇంటర్‌ ‌విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడిన గ్లోబరీనా సంస్ధతో పాటు మరో సంస్ధను చేర్చి పెనం నుంచి పొయ్యిలపడ్డచందంగా చేస్తున్నారు బోర్డు అధికారులు. గ్లోబరీనా కంటే అసమర్థ మరియు వివాదాల్లో ఇరుకొక్నన్న సంస్థ డాటాటెక్‌ ‌మెథడిక్స్. ‌గ్లోబరీనా గతంలో జేఎన్‌టీయూను మోసం చేసి వివాదాల్లో చిక్కుకొని, మళ్ళీ తెలంగాణ ఇంటర్‌ ‌ఫలితాల్లో అదే వివాదంలో ఇరుక్కుంది. ఇదిలావుంటే డాటాటెక్‌ ‌మెథడిక్స్ ‌సంస్థ ఏమన్నా సొక్కం పూసనా అంటే అదీలేదు. మన నిపుణుల కమిటీ వారిని చేర్చమని ఎందుకు సూచించిందో తెలియదు కాని, డాటాటెక్‌ ‌మెథడిక్స్ ‌కూడా పలు వివాదాల్లో చిక్కుకొని కోర్టుల్లో కేసులను కూడా ఎదుర్కొంటున్నది. తమిళనాడులో టీచర్స్ ‌రిక్రూట్‌ ‌మెంట్‌ ‌బోర్డ్ ‌డాటాటెక్‌ ‌మెథడిక్స్ ‌సంస్థకు బాధ్యతలను అప్పగిస్తే ఏకంగా ఒరిజినల్‌ ఓఎంఆర్‌ ‌షీట్లనే తారుమారు చేసి, స్కానింగ్‌లతో స్కాములకు పాల్పడింది. 196 అనర్హులను అర్హులగా చేసింది. ఒక కాల్‌ ‌టాక్సీ డ్రైవర్‌ను ఏజెంట్‌గా పెట్టుకొని తంతంగాన్ని నడిపింది. 2017-18 టీచర్స్ ‌రిక్రూట్‌ ‌మెంట్‌ ‌లో అక్రమాలకు పాల్పడి కోర్టు మెట్లను ఎక్కాల్సి వచ్చింది. అటు చెన్నై కోర్టు అటు మధురై కోర్టు సంస్థకు మొట్టికాయలు ఇచ్చింది. డాటాటెక్‌ ‌మెథడిక్స్ ‌సంస్థ బాగోతం అంతా జాతీయ మీడియాలో బట్టబయలైంది. ప్రముఖ ఆంగ్ల పత్రికలైన ది హిందూ, డెక్కన్‌ ‌క్రానికల్‌, ‌ది ఇండియన్‌ ఎక్స్ ‌ప్రెస్‌ ‌సైతం సంస్థ చేసిన నిర్వాకాన్ని వెలుగులోకి తెచ్చాయి. సంస్థ ప్రతినిధులను సైతం అరెస్టులు చేసారు. ఏకంగా రిక్రూట్‌మెంటును నిలిపివెయ్యాలని న్యాయస్థానాలు సూచించాయి. కాగా తమ సంస్థకు సంబంధంలేదని కేవలం సంస్థలో పనిచేసే ఉద్యోగస్తుల నిర్వాకమేనని డాటాటెక్‌ ‌మెథడిక్‌ ‌సంస్థ ప్రకటించుకొని చేతులు దులుపుకొంది. ఇంత తతంగం వున్న డాటాటెక్‌ ‌మెథడిక్స్ ‌సంస్థకు తెలంగాణ విద్యార్థుల జీవితాలను అప్పగించడమంటే పెనం నుంచి పొయ్యిలపడ్డ చందమే..! అటు గ్లోబరీనా, ఇటు డాటాటెక్‌ ‌మెథడిక్స్ ‌సంస్థల మధ్య తెలంగాణ విద్యార్థులకు న్యాయం జరుగుతుందా అనేది ప్రశ్నార్థకమే… ఇంటర్మీడియట్‌ను ఇంటర్‌ ఈడియట్లకు అప్పగించారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటి వరకు ముక్కుపచ్చలారని ఇంటర్‌ ‌విద్యర్థులు చనిపోతే నిపుణులు ఏంతేల్చారో కూడా అర్థం కాని పరిస్థితి. తెలంగాణలో ఇంత జరుగుతున్నా కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీ ఇప్పటికే రంగంలోకి దిగాలి. కాని అది ఎప్పుడు వస్తదో కూడూ తెలియని దుస్థితి. ఇదే ఇలావుంటే మొదటి సంవత్సరం విద్యార్ధుల పరిస్థితి ఏంటి? 50 నుంచి 70 మార్కులకు పారదర్శకత ఏంటి? విద్యా శాఖా మంత్రి జగదీశ్వర్‌ ‌రెడ్డి ఇప్పటి వరకు నోరు విప్పక పోవడాన్ని బట్టి చూస్తే ఏదో జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసిఆర్‌ ‌మాత్రం అంతా జరిగిపోయిన తర్వాత ఆదేశాలు ఇచ్చారు. ఇంటర్‌ ‌విద్యార్థుల ఆందోళనను పక్కదారి పట్టించేందుకే ఇతర రాష్ట్రాల పర్యటనలా అనేది చర్చనీయాంశంగా మారింది. ఇక ఇంటర్‌ ‌బోర్డు కార్యదర్శి మాత్రం తమ తప్పేమీ లేదనట్లు అంతా విద్యార్థులదేనన్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అసలు దొంగలు ఎవరు..వారిపేరేంటి అన్న ఆటలాగా ఇంటర్‌ ‌విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నట్లుగా కనిపిస్తున్నది. ఇంతకీ నడిపిస్తున్నది ఎవరు..పాలనలో పెద్దతలకాయాలా..?

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!