Take a fresh look at your lifestyle.

పెట్రో ధరలను తక్షణమే తగ్గించాలి

ఖమ్మం నగరంలో శనివారం కాంగ్రెస్‌ ‌పార్టీ విన్నూత్న నిరసన నిర్వహించి అందర్నీ ఆకట్టుకుంది. కేంద్రం ప్రభుత్వం పెట్రోల్‌,‌డీజిల్‌ ‌ధరల ప్రతి రోజు పెంచటాన్ని నిరసిస్తూ వారు తమ మోటారువాహనాలను జిల్లా  కాంగ్రెస్‌ ‌పార్టీ కార్యాలయం నుండి ఖమ్మం నగర మున్సిపల్‌ ‌కార్యాలయం వరకు తోసుకుంటూ  వెళ్లారు. అనంతరం మున్సిపల్‌ ‌కమీషనర్‌కు వినతిపత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం కాంగ్రెస్‌ ‌పార్టీ నగర అధ్యక్షులు ఎండి జావీద్‌, ‌నగర కాంగ్రెస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌,‌కార్పోరేటర్‌ ‌నాగండ్ల దీపక్‌చౌదరి, ఐఎన్‌టియుసి నగర అధ్యక్షులు ఎండి యాకూబ్‌పాషా,  సిటి కాంగ్రెస్‌ ‌మైనార్టీ అధ్యక్షులు ఇసాక్‌, ‌రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి రబ్బాని,  ఎన్‌ఎస్‌యుఐ ఉదయ్‌కుమార్‌, ‌సీనియర్‌ ‌నాయకులు మిక్కిలినేని  నరేంద్రలు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌ ‌డీజిల్‌ ‌ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ ‌చేసారు. ఎండి ఇసాక్‌, ఎం‌డి యాకూబ్‌పాషా, షరీఫ్‌ ‌ఖాద్రి, నరాల నరేష్‌, ఎస్‌కె రజి, ఉమార్‌ ‌ఫారూఖ్‌, ‌రవికుమార్‌,‌పేరం మల్లయ్య, శంకర్‌నాయక్‌, ‌తలారి నాగభూషణం, ఎస్‌కె జాని, బాలగంగాధర తిలక్‌, ‌సంపటం నరసింహారావు, ఎస్‌డి  మహమ్మద్‌, ‌కోణంగి కనకరాజు, నాగటి చంద్రశేఖర్‌, ఎం‌డి సర్వర్‌, ‌సిహెచ్‌ ‌వెంకటేష్‌, ‌రవికుమార్‌, ఎం‌డి సర్వర్‌, ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

error: Content is protected !!