Take a fresh look at your lifestyle.

పీహెచ్‌సీని తనిఖీ చేసిన జగిత్యా కలెక్టర్‌

జగిత్యాల అర్భన్‌లోని మోతె వాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని గురువారం జిల్లా కలెక్టర్‌ డా.ఏ.శరత్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆసుపత్రికి వచ్చిన పోచమ్మ వాడకు చెందిన రాజవ్వ, హన్మాన్‌వాడకు చెందిన గుండేటి రాజేశ్వరి తో కలెక్టర్‌ మాట్లాడుతూ గర్భిణీ సమయంలో ప్రభుత్వ ఆసుపత్రిలో పరిక్షలు చేయించుకోవాల ని సూచించారు. సాధారణ ప్రసవాలు వల న తల్లి బిడ్డు ఆరోగ్యవంతంగా ఉంటారని, పాతకాలం లో సాధారణ ప్రసవాలు మాత్రమే జరిగేవని, ఈ రోజుల్లో ఆపరేషన్‌ వైపు చాలా మంది మొగ్గు చూపుతున్నారని ఆపరేషన్‌ ద్వారా జరిగే ప్రసవాలు వల న ఆరోగ్యం క్షిణిస్తుందని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులో అనేక సౌకర్యాలు కల్పించడం వల న ఎక్కువగా సాధారణ ప్రసవాలు చేస్తున్నారని పేర్కొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy