Take a fresh look at your lifestyle.

పిల్లల ప్రాణాలు కాపాడిన జర్నలిస్టు..

ఫోటో:  ‌జర్నలిస్టు సుధాకర్‌ ‌ను సన్మానిస్తున్న ఐజేయూ అధ్యక్షులు దేవులపల్లి అమర్‌, ‌టీయూడబ్ల్యూజే సలహాదారు కే. శ్రీనివాస్‌ ‌రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, కార్యదర్శులు నగునూరి శేఖర్‌, ‌కే. విరాహత్‌ అలీ తదితరులు.
ఫోటో: ‌జర్నలిస్టు సుధాకర్‌ ‌ను సన్మానిస్తున్న ఐజేయూ అధ్యక్షులు దేవులపల్లి అమర్‌, ‌టీయూడబ్ల్యూజే సలహాదారు కే. శ్రీనివాస్‌ ‌రెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్ష, కార్యదర్శులు నగునూరి శేఖర్‌, ‌కే. విరాహత్‌ అలీ తదితరులు.

సుధాకర్‌… ‌నీకు హ్యాట్సాఫ్‌..!
‌మానవతావిలువలకు స్ఫూర్తిగా నిలిచాడు
ఇండియన్‌ ‌జర్నలిస్ట్ ‌యూనియన్‌(ఐజేయూ) అధ్యక్షులు దేవులపల్లి అమర్‌.అం‌దరి కంటే ముందు సమాచారాన్ని సేకరించాలని తాపత్రయంతో విజువల్స్ ‌కోసం ఫోటోల కోసం హంగామా సృష్టించే నేటి పోటీ ప్రపంచంలో అందుకు భిన్నంగా మనుషుల ప్రాణాలు కాపాడటమే లక్ష్యంగా సాహసాన్ని ప్రదర్శించిన పలువురు విద్యార్థుల ప్రాణాలను రక్షించి మానవత్వాన్ని చాటుకున్న ఆదర్శ జర్నలిస్టు సుధాకర్‌ అని పలువురు వక్తలు కొనియాడారు. మానవత్వం మాయం అవుతున్న నేపథ్యంలో అది సజీవంగానే ఉంది అని నిరూపించాడు అని వారు అన్నారు. వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రమాదంలో ప్రాణాలు కాపాడే వృత్తికే వన్నె తెచ్చారని వారు అభినందించారు. శనివారం బషీర్‌ ‌బాగ్‌ ‌ప్రెస్‌ ‌క్లబ్‌ ‌లో టీయూడబ్ల్యూజే ఉత్తమ వీడియో జర్నలిస్టు సుధాకర్‌ అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐజేయూ అధ్యక్షులు దేవులపల్లి అమర్‌ ‌మాట్లాడుతూ జర్నలిస్టులు మంచిచెడులను కూడా ఎదుర్కోవలసి ఉంటుందని, రిపోర్టు ముఖ్యం కాదని బాధ్యతలను గుర్తు పెట్టుకోవాలని సూచించారు. సుధాకర్‌ ‌జర్నలిస్టులకు ఒక స్ఫూర్తిగా నిలిచాడని కొనియాడారు. జర్నలిజం అనేది మానవతా విలువలను కాపాడుకునే విధంగా ఉండాలని ఆయన అన్నారు. పోటీపడి స్పందించకూడదని, బాధ్యతలను విస్మరించకూడదని సూచించారు. సుధాకర్‌ ‌చేసింది మంచిపని అని అభినందించారు. టీయూడబ్ల్యూజే ముఖ్య సలహాదారులు శ్రీనివాస్‌ ‌రెడ్డి మాట్లాడుతూ వసతి గృహంలో అగ్నిప్రమాదం సంభవించి బాలికల ప్రాణానికి ముప్పు వాటిల్లిన నేపథ్యంలో వారిని రక్షించడానికి సుధాకర్‌ ‌చేసిన కృషి అభినందనీయమని ఇలాంటి సంఘటనలు చాలా అరుదు అని ఆయన అన్నారు. మానవత్వం నశించిపోతున్న నేటి సమాజంలో గతంలో ఏపి రాష్ట్రం ప్రకాశం జిల్లా కలెక్టర్‌ ‌కార్యాలయం ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటుండగా ఫోటోలు, వీడియోలు తీయడానికి జర్నలిస్టులు పోటీ పడ్డారే కానీ అది ఆపే ప్రయత్నం చేయలేదని, ఇలాంటి సంఘటనలు ఆవేదనను కలిగిస్తాయని ఆయన అన్నారు. కేవలం వార్తలకు ప్రాధాన్యత ఇస్తే మానవత్వం అనిపించుకోదని, అలాకాకుండా సుధాకర్‌ ‌పిల్లల ప్రాణాలు కాపాడి సమాజానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. జర్నలిస్టులు జీవితంలో అన్ని విధాలుగా ఇబ్బందులు పడుతున్నారని, భౌతిక దాడులకు కూడా గురవుతున్నారని, ఇలాంటి తరుణంలో జర్నలిస్టులు తమ వృత్తి ధర్మాన్ని కాపాడుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు నగునూరి శేఖర్‌ ‌మాట్లాడుతూ మానవత్వం మాయమైపోతున్న తరుణంలో మంచితనం బ్రతికే ఉంది అని సుధాకర్‌ ‌నిరూపించారని అన్నారు. వృత్తి పరమైన ఇబ్బందులు ఉన్నప్పటికీ బాలికలు ఆపదలో ఉన్నప్పుడు మానవత్వంతో స్పందించి మంచితనం నిలబెట్టుకున్నారని ఆయన అన్నారు. ప్రమాదంలో ఉన్న వారిని రక్షించి జర్నలిజానికి వన్నె తెచ్చారని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రెస్‌ ‌కౌన్సిల్‌ ‌మాజీ సభ్యులు అమర్నాథ్‌, ఐజేయూ కార్యదర్శి వై నరేందర్‌ ‌రెడ్డి, టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి కే. విరాహత్‌ అలీ, డిప్యూటీ జనరల్‌ ‌సెక్రెటరీ శ్రీకాంత్‌, ఉపాధ్యక్షుడు రాంనారాయణ, 99 టీవీ ప్రతినిధి శ్రీనివాస్‌, ‌కే. సత్యనారాయణ, వర్కాల యాదగిరి, ఏ.రాజేష్‌, ‌హెచ్‌.‌యూ.జె ప్రధాన కార్యదర్శి శిగ శంకర్‌ ‌గౌడ్‌, ‌తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy