Take a fresh look at your lifestyle.

పిల్లలలో రోగనిరోధక శక్తిని పెంపొందించండి

వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది నిత్యం గ్రామాలలో సందర్శించి చిన్న పిల్లల దగ్గర నుండి 16 సంవ త్సరాల వయస్సు లోపు వారిలో రోగనిరోధక శక్తిని పెంపొం దించాలని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి డాక్టర్‌ ‌నాగేంద్ర ప్రసాద్‌ అన్నారు. బుధవారం సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన ఆయన  టీకాలు వేయు విధానం పై  ఆరోగ్యశాఖ సిబ్బందికి అవగాహన కల్పించారు. అలాగే సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని బట్టి గూడెం గ్రామాన్ని సందర్శించి గ్రామంలోని ప్రజలకు ధనుర్వాతం పట్ల, కోరింత దగ్గు, కంఠసర్పి, నిమోనియా తదితర వ్యాధులు పుట్టిన పిల్లల నుండి 16 సంవత్సరాల లోపు వారికి వచ్చే అవకాశం ఉంటుందని, అటువంటి రోగాల పట్ల ముందుగానే జాగ్రత్తలు తీసుకొని టీకాలు వేయించుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. వర్షాకాలం సీజన్‌ ‌దృష్ట్యా అటవీ గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండి రోగాలు దరిచేరనీయకుండా చూసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిపిఎంఓ చింతా  సత్యనారాయణ, సత్యనారాయణపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యురాలు డాక్టర్‌ ‌మౌనిక, పి హెచ్‌ ఎన్‌ ‌పద్మావతి, ఏఎన్‌ఎం‌లు రాజ్యలక్ష్మి, విజయలక్ష్మి, ఆశా వర్కర్‌ ఉమాదేవి, తల్లులు,  పిల్లలు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply