వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

పాలమూరులో .. టెన్షన్‌..‌టెన్షన్‌

December 7, 2019

‌దిశ నిందితుల మృతదేహాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ‌బృందం విచారణ
‌దిశ నిందితుల మృతదేహాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ‌బృందం విచారణ

దిశ నిందితుల మృతదేహాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ‌బృందం విచారణదేశ వ్యాప్తంగా సంచలనం రేపినటువంటి దిశ కేసుకు సంబందించిన నిందితుల మృతదేహాలపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ‌బృందం మహబూబ్‌నగర్‌ ‌ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం విచారణ చేపట్టింది. జతీయ మావహ హక్కుల కమిషన్‌ ‌రాకతో పాలమూరులో హై టెన్షన్‌ ‌వాతావరణం నెలకొంది. ప్రభుత్వ ఆస్పత్రి వద్ద మూడంచల భద్రతలో పోలీసుల నిఘాలో జాతీయ మానవ హక్కుల బృందం విచారణ కొనసాగింది. ప్రభుత్వ ఆస్పత్రి లోపలికి మీడియాను అనుమతించలేదు. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ‌బృందం దాదాపు మూడ గంటలపైన కేసుపై దర్యాప్తు చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ ఆస్పత్రి ఎదుట ప్రజలు ఒక్కసారిగా నిందితుల మృతదేహాలపై జాతీయ కమిషన్‌ ‌సభ్యులు విచారణతో అవాక్కై నివ్వెరపోయారు. దిశ కేసుకు సంబంధించి సరైన న్యాయం జరిగిందని ఓ పక్క యావత్‌ ‌భారతదేశ ప్రజలంతా అనుకుంటున్నా.. తిరిగి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ఈ ‌కేసుకు సంబందించి విచారణ చేపట్టడంతో ప్రజలు అయోమయంలో పడ్డారు. ఒ పక్క తెలంగాణ పోలీసు శాఖ దమ్మున్న పోలీస్‌ అని, ప్రజలు నిందితులపై ఎన్‌కౌంటర్‌ ‌జరిపిన అనంతరం పోలీసుశాఖపై ప్రశంశల వర్షం కురిపించారు. కానీ హైకోర్టు మృతదేహాలను 9వ తేది వరకు వారి కుటుంబ సభ్యులకు అప్పగించరాదని, అంత్యక్రియలు జరపరాదని తెలపడంతో పాటు శనివారం జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ‌బృందం రాకతో దిశ సంబంధించిన కేసు ఎటు వెళ్తుందో అని, ప్రజలు చర్చించుకుంటున్నారు. మహబూబ్‌నగర్‌ ‌పట్టణంలో ఎక్కడ చూసినా.. దిశ కేసుకు సంబందించిన చర్చే కొనసాగుతుంది. జాతీయ మానవ హక్కుల కమిషన్‌ ‌సభ్యులు ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్నటువంటి నిందితుల మృతదేహాలను పరిశీలించారని, అందుకు సంబంధించిన వివరాలను లోతుగా విచారణ చేపట్టినట్లుగా చర్చించుకుంటున్నారు.