Take a fresh look at your lifestyle.

పార్టీల భవిష్యత్‌ ‌తేలేది నేడే

దేశప్రజలు ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు రానేవచ్చింది. సుదీర్ఘ విరామం తర్వాత మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవిష్యత్‌ ‌తేలబోతోంది. ఉదయం ఎనిమిది గంటలనుండి ప్రారంభంకానున్న వోట్ల లెక్కింపుతో మధ్యాహ్నంలోగా పార్టీల పరిస్థితిని అంచనా వేసుకునే అవకాశం ఏర్పడనుంది. కాగా, ఏడు విడుతల ఎన్నికలు ముగిసిన మరుక్షణం నుండే ప్రారంభమైన ఎగ్జిట్‌పోల్స్ ‌కొందరికి ఆనందాన్ని, మరికొందరికి దిగులును పంచాయి. ఎగ్జిట్‌పోల్‌ ‌లెక్కలను బయటపెట్టిన సంస్థలు ఎక్కువ శాతం తిరిగి ఎన్డీయేనే అధికారంలోకి వస్తుందని చెప్పా యి. దీంతో ఆపార్టీలో ఉత్సాహం ఉరకలు వేస్తున్నది. ఒకటి అర కాకుండా దాదాపు అన్ని సర్వేసంస్థలు తమ విజయాన్ని సూచించడంతో భారతీయ జనతాపార్టీ అప్పుడే తన వ్యూహరచన ప్రారంభించింది. ప్రధానంగా రెండు రోజుల కిందనే ఎన్డీయే మిత్రపక్షాలందరిని విందుకు ఆహ్వానించి, భవిష్యత•పై మంతనాలు ప్రారంభించింది. బీహార్‌ ‌ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌, ‌తమిళనాడు సిఎం ఫళనిస్వామి, పన్నీరు సెల్వం, శివసేన అధినేత ఉద్దవ్‌ ‌ఠాక్రే,, అకాలిదళ్‌ ‌నేత ప్రకాశ్‌సింగ్‌ ‌బాదల్‌ ‌లాంటి వారితోపాటుగా తమ మంత్రివర్గం, ఇతర ప్రముఖ నాయకులు ఆ విందులో పాల్గొని భవిష్యత్‌ ‌ప్రణా ళికపై తీవ్రంగా చర్చించారు. ఎగ్జిట్‌పోల్స్ ‌చెబుతున్న ప్రకారం ఎట్టిపరిస్థితి లోనూ 282 నుండి 365వరకు రావచ్చని తెలుస్తున్నది. ఒక వేళ రానిపక్షంలో తీసుకోవాల్సిన చర్యలపైనే వారీ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తున్నది. అలాంటప్పుడు ఎన్డీయేతర, యూపియేతర తటస్థ పార్టీలను కలుపుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడుతుంది. అయితే తమకు అందివచ్చే పార్టీలేవీ, వేటితో పొత్తుపెట్టుకుంటే బాగుంటు ందన్న విషయంలో నేతల సూచనలను అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉంటే ఫలితాలు వెల్లడికాగానే అన్ని రాష్ట్రాల్లో విజయోత్స వాలను నిర్వహించాలని కూడా బిజెపి నిర్ణయించింది.

ఎగ్జిట్‌పోల్‌ ‌ఫలితాలు చాలా వరకు కాంగ్రెస్‌కు అనుకూలంగా లేకపోయినా, అసలైన ఫలితాలు వెలువడేవరకు ఏమాత్రం అధైర్య పడవద్దని ఆ పార్టీనేతలు తమ క్యాడర్‌కు ధైర్యం చెబుతున్నారు. తమకు మ్యాజిక్‌ ‌ఫిగర్‌ ‌రాకపోయినప్పటికీ మోదీని ఎట్టిపరిస్థితిలో తిరిగి గద్దెపై కూర్చోనిచ్చే దేలేదంటున్నది కాంగ్రెస్‌. ఈ ‌విషయంలో అవసర మైతే తమ పార్టీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని త్యాగం చేయడానికైన సిద్ధంగా ఉందన్న సంకేతాలను మిత్రపక్షాలకు పంపిస్తున్నది. ఎగ్జిట్‌ ‌పోల్‌ ‌ఫలితాలు ఎన్డీయేకు అనుకూలంగా రావడంతో మిత్రపక్షాలు, భావసారూప్యత గల పార్టీలు చేయ్యిజారిపోకుండా కాంగ్రెస్‌ ‌ముందస్తు వ్యూహరచనకు ఉపక్రమించింది. అందులో భాగంగానే ఫలితాలు వెలువడనున్న మే 23న యుపిఏ మిత్రపక్షాలు, తటస్థ పార్టీ నేతలతో సమావేశాన్ని ఏర్పాటుచేస్తూ, ఆ పార్టీలకు ఎన్డీఏ చైర్‌పర్సన్‌ ‌సోనియాగాంధీ ఇప్పటికే ఆహ్వానాలను పంపించారు. మోదీని గద్దెదించడమే ధ్యేయంగా జాతీయస్థాయిలో చక్రం తిప్పుతున్న ఏపి సిఎం చంద్రబాబు నాయుడు ఎన్డీయేతర పార్టీలను ఒకటిచేసే ప్రయత్నాలను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా సోనియా, రాహుల్‌గాంధీ, శరద్‌పవార్‌, ‌సీతారాం ఏచూరి, అరవింద్‌ ‌కేజ్రీవాల్‌తోపాటు అఖిలేష్‌, ‌మాయావతి, మమతతో మంతనాలు జరిపే కార్యక్రమాన్ని ముమ్మరం చేశారు. ఆయన మోదీపట్ల ఎంత వ్యతిరేకతతో ఉన్నాడంటే అవసరమైతే తాను శత్రువులుగా భావిస్తున్న తెలంగాణరాష్ట్ర సిఎం కెసిఆర్‌, ‌వైఎస్‌ఆర్‌పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ఈ కూటమిలోకి ఆహ్వానించినా తనకు అభ్యంతరంలేదని చెబుతున్నాడు. కాగా వీరిద్దరితోపాటు బిజెడి మద్దతును కూడా కూడగట్టుకునేందుకు కూడా కాంగ్రెస్‌ ‌ప్రయత్నిస్తోంది. వీరితో చర్చించే బాధ్యతను కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకుడు, మద్య ప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌కు కాంగ్రెస్‌పార్టీ అప్పగించింది. తటస్థంగా ఉన్న అఖిలేష్‌, ‌మాయావతి కలిస్తే సుమారు 70 సీట్లు కూటమికి కలిసి వచ్చేవిగా ఉన్నందున వారితో మరింత లోతుగా చర్చించేందుకు కూటిమి నాయకులు సిద్ధపడుతున్నారు. ఇదిలా ఉంటే ఈవిఎంల అంశంపై చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మంగళ వారం నిర్వహించిన విపక్షాల సమావేశంలో విపక్ష పార్టీల ప్రధాన నాయకులెవరూ హాజరుకా• •పోవడం పలు అనుమానాలకు తావిస్తున్నదంటున్నారు పరిశీలకులు. మాజిక్‌ ‌ఫిగర్‌కు ఏ జాతీయ పార్టీ దగ్గరగా ఉంటే వీరిలో కొందరు అటువైపు జారే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏపిలో జగన్‌ అప్పుడే ముఖ్యమంత్రి అయిపోయినంత హడావిడి చేస్తున్నాడు. ఏపి శాసనసభ ఎన్నికలపై వచ్చిన ఎగ్జిట్‌పోల్స్ ‌దాదాపుగా అన్నీ వైఎస్‌ఆర్‌ ‌పార్టీవైపే మొగ్గు చూపాయి. ఇది ఆపార్టీ నాయకులకు, క్యాడర్‌కు పట్టపగ్గాలులేకుండా చేస్తోంది. మరికొన్ని గంటల్లో ఫలితాలు వెల్లడికానుండడంతో జగన్‌ అమరావతికి చేరుకుని పరిస్థితిని అంచనావేసుకునే పనిలో పడ్డాడు. మరోవైపు కెసిఆర్‌ ‌తన ఫెడరల్‌ ‌ఫ్రంట్‌ ఆశను చంపుకోలేదు. వేచిచూసే ధోరణిని అవలంబిస్తున్నారు. కాంగ్రెస్‌, ‌బిజెపియేతర తటస్థ పార్టీలు కనీసం వంద స్థానాలను సంపాదించుకోగలిగితే తాము కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుందన్న ఆలోచనలో ఉన్నాడు. ఇలా గంటలు గడుస్తున్నకొద్ది దేశ, రాష్ట్రాల రాజకీయ ముఖచిత్రాల్లో అనేక మార్పులు సంభవిస్తూనే ఉన్నాయి.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!