Take a fresh look at your lifestyle.

పారదర్శకంగా పదో తరగతి పరీక్షలు : కలెక్టర్‌

‌జిల్లాలో జూన్‌ 6 ‌నుండి జూలై7వరకు నిర్వహించే 10వ తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించా లని జిల్లా విద్యాశాఖ అధికారులను జిల్లా కలెక్టర్‌ ‌టి. వినయ్‌ ‌కృష్ణారెడ్డి ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్‌ ‌కార్యాలయంలో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతు 334 ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌పాఠశాలలు, వసతి గృహాలు, మోడల్‌ ‌పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీలు 6384, విద్యార్థులు 6651 మొత్తం 13035మంది పరీక్షలు రాసేందుకు జిల్లాలో 129పరీక్ష కేంద్రాలను  ఏర్పాటుచేశామని స్పష్టం చేశారు. కరోనా వైరస్‌ ‌నేపధ్యంలో ప్రతి పరీక్ష కేంద్రంలో మాస్క్‌లు, శానిటైజర్లు, సామాజిక దూరం పాటించేలా చర్యలు తప్పనిసరిగా తీసుకో వాలని సూచించారు. పరీక్ష కేంద్రాలను, కేంద్రా ల్లోని ఫర్నీచర్స్‌ను హైడ్రోక్లోరైడ్‌ ‌ద్రావణం పిచి కారి చేయాలని , పిల్లలు తీసుకోవాల్సిన జాగ్రత్తల ను తెలియజేయాలని కోరారు.

ఆయ పరిధిలో ఉన్న మున్సిపల్‌ ‌కమిషనర్లు, ఎంపిడిఓలు, డిపిఓ లు పరీక్ష కేంద్రాలను ముందస్తుగా పరిశీలించి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అలాగే ప్రతి పరీక్ష కేంద్రంలో మౌలిక వసతులను ఏర్పాటు చేయాలని, ఒక థర్మల్‌ ‌స్కాన్‌తోపాటు ఏఎన్‌ఎం ‌ను అందుబాటులో ఉంచి సేవలను సద్వినియో గం చేసుకోవాలని అన్నారు. విద్యార్థులకు ఎలాం టి ఇబ్బందులు కల్గకుండా ఆయా ప్రదేశాల్లో వెళ్లే ఆర్టిసీ బస్సులు సమయపాలన పాటించాలని తెలిపారు. అలాగే పరీక్ష కేంద్రాల వద్ద 144సెక్షన్‌ అమలులో ఉంటుందని, ఆయా పరిధిలో ఉన్న జీరాక్స్ ‌షాపులు మూసివేయాలని అన్నారు. ఈ సమావేశంలో ఆర్డిఓ మోహన్‌రావు, అడిషనల్‌ ‌కలెక్టర్‌ ‌డి. సంజీవరెడ్డి, సంక్షేమ అధికారులు జ్యోతి, దయానంద రాణి, శిరీష పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply

error: Content is protected !!