Take a fresh look at your lifestyle.

పాఠశాల వాహనం బోల్తా ముగ్గురు విద్యార్థులు దుర్మరణం

సంఘటన వివరాలు ఆరా తీసిన మంత్రి ఈటల

ఫోటో:మృతి చెందిన విద్యార్ధినులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ పట్టణంలోని ఒక ప్రైవేట్‌  ‌పాఠశాల వ్యాన్‌ ‌సిరిసిల్ల- వేములవాడ రోడ్డులో వేములవాడ బస్‌డిపో సమీపంలో బోల్తా పడటంతో దానిలో ప్రయానిస్తున్న ముగ్గురు విద్యార్థులు దుర్మరణం చెందారు.దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.వేములవాడ పట్టణంలోని వాగీశ్వరీ స్కూల్‌లో చదువుతున్న కొంత మంది విద్యార్థులు అదే పాఠశాల నిర్వాహకుడి అధ్వర్యంలో ఉన్న హాస్టల్‌లో ఉంటున్నారు. యథావిధిగా  బస్‌ ‌డిపో సమీపంలోని వారి హాస్టల్‌ ‌నుండి బుధవారం  ఉదయం పాఠశాలకు వెళ్లిన విద్యార్ధులు అదే వాహనంలో మధ్యాహ్న భోజనానికి వస్తుండగా వ్యాన్‌ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొనడంతో దానిలో ఉన్న ముగ్గురు విద్యార్థులు ఎగిరి కిందపడగా వ్యాన్‌ ‌బోల్తా పడి వారిపైన పడటంతో మణిచందన (వట్టెంల)అనే పదవ తరగతి విద్యార్థిని,దీక్షిత ( మానాల) అనే రెండవ తరగతి విద్యార్థిని అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.రిషి ( మానాల) అనే 4వ తరగతి విద్యార్థిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ప్రమాదం జరిగిన వెంటనే గమనించిన వారు వ్యాన్‌ ‌వద్దకు చేరుకుని బోల్తా పడిన వ్యాన్‌ను లేపి దానిలో ప్రయానిస్తున్న మిగతా విద్యార్థులను బయటకు తీశారు.వారందరు స్వల్ప గాయాలతో బయట పడ్డారు.డ్రైవర్‌ ‌రఫిక్‌ను అక్కడకు చేరిన వారందరు చితకబాది పోలీసులకు అప్పగించారు.
ఈ ప్రమాద వార్త విని జిల్లా ఎస్పీ రాహుల్‌ ‌హెగ్డే, డిఆర్‌ఓ ‌ఖీమ్యానాయక్‌, ‌డిఇఓ  రాధాకిషన్‌, ‌వేము)వాడ డిఎస్పీ వెంకటరమణలు అక్కడకు చేరుకుని వివరాలు సేకరించగా సిఐ వెంకటస్వామి కేసు నమోదు చేసుకుని దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్‌ ‌నాయకులు ఆది శ్రీనివాస్‌,‌వట్టెంల ఎంపిటిసి సభ్యుడు,మాజీ ఎంపిపి రంగు వెంకటేశ్‌గౌడ్‌లు తమ అనుచరులతో అక్కడకు చేరుకుని ధర్నా నిర్వహిస్తూ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని,మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ ‌చేశారు.ఇదే సమయంలో రాష్ట్ర ఆరోగ్య,వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ,‌రాజన్న సిరిసిల్ల జడ్పీ చైర్‌ ‌పర్సన్‌ ‌న్యాలకొండ అరుణ సంఘటన స్థలాన్ని పరిశీలించి,ప్రమాద వివరాలను

తెలుసుకున్నారు.ధర్నా చేస్తున్న వారందరిని బస్‌ ‌డిపోలోకి ఆహ్వానించి,వారితో చర్చలు జరిపి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని,మృతి చెందినవారి కుటుంబాలకు పాఠశాల యాజమాన్యంతో నష్టపరిహారంచెల్లించేట్లుగా చేస్తామని,సంఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశిస్తున్నట్లు చెప్పడంతో నాయకులు శాంతించారు.దీనితో సంఘటన స్థలంలోని విద్యార్థుల మృతి దేహాలను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాద వార్త తెలుసుకున్న కరీంనగర్‌ ఎం‌పి బండి సంజయ్‌,‌రాజన్న సిరిసిల్ల జిల్లా బిజెపి అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణలు సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివారాలను తెలుసుకున్నారు. కాగా మేన్‌ ‌రోడ్డుపై ఈ సంఘటన చోటు చేసుకోవడంతో వాహనాల రాకపోకలను పోలీసులు వెంటనే నియంత్రించి,ప్రమాదానికి సంబంధించిన వ్యాన్‌ను అక్కడనుండి తరలించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy