వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

పాక్‌ ఎఫ్‌16‌ను భారత్‌ ‌కూల్చలేదు!

April 5, 2019

వెల్లడించిన అమెరికా
‌పాకిస్థాన్‌ ‌వైమానిక దళానికి చెందిన ఎఫ్‌-16 ‌యుద్ధ విమానాన్ని భారత్‌ ‌కూల్చలేదని అమెరికా నిర్దారించిందని అమెరికాకు చెందిన ఫారిన్‌ ‌పాలసీ పత్రిక కొత్త విషయాన్ని వెల్లడించింది. ఇటీవల పాక్‌ ఎఫ్‌ 16 ‌విమానాన్ని భారత వింగ్‌ ‌కమాండర్‌ అభినందన్‌ ‌వర్ధమాన్‌ ‌నేలకూల్చిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 27వ తేదీన ఈ ఘటన జరిగింది. అయితే ఆమ్రమ్‌ ‌మిస్సైల్‌ ‌శిథిలాలు భారత అధికారులకు చిక్కడంతో ఈ విషయం స్పష్టమైంది. కానీ పాకిస్థాన్‌ ‌మాత్రం ఎఫ్‌-16 ‌యుద్ధ విమానాన్ని వాడలేదని చెప్పిన విషయం కూడా తెలిసిందే. అయితే ఇప్పుడు అమెరికాకు చెందిన ఫారిన్‌ ‌పాలసీ పత్రిక కొత్త విషయాన్ని వెల్లడించింది. ఫిబ్రవరి 27వ తేదీన జరిగిన డాగ్‌ఫైట్‌లో ఎఫ్‌-16 ‌యుద్ధ విమానం కూలలేదని అమెరికా రిపోర్ట్ ‌పేర్కొన్నది. పాక్‌ ‌వద్ద ఎఫ్‌-16‌ల సంఖ్య సరిగ్గానే ఉందని అమెరికా రిపోర్ట్ ‌వెల్లడించింది. ఎఫ్‌16 ‌కూలినట్లు రిపోర్ట్ ‌రావడంతో అమెరికా అధికారులు పాక్‌కు వెళ్లి వాటి సంఖ్యను లెక్కపెట్టారు. అయితే తాము పాక్‌కు ఇచ్చిన విమానాల సంఖ్యతో సరిచూస్తే లెక్క తేలినట్లు అధికారులు చెప్పారు. నిజానికి పైలట్‌ ‌వర్ధమాన్‌.. ఎఫ్‌16‌ని కూల్చినట్లు మనకు తెలుసు. అయితే అదే డాగ్‌ప్లైట్‌లో వర్ధమాన్‌ ‌నడుపుతున్న మిగ్‌ ‌బైసన్‌ ‌విమానం నేలకూలింది. ఆ సమయంలో ప్యారాచూట్‌ ‌సాయంతో పైలట్‌ ‌వర్ధమాన్‌ ‌పాక్‌లో దిగాడు. రెండురోజుల తర్వాత వర్ధమాన్‌ను పాక్‌ ‌వదిలేసింది. అమెరికా ఫారిన్‌ ‌పాలసీ మ్యాగ్జిన్‌ ఇచ్చిన తాజా రిపోర్ట్.. ‌పాకిస్థాన్‌ను సమర్థిస్తున్నట్లుగా ఉంది. పాక్‌ ‌వాడుతున్న ఎఫ్‌-16 ‌ఫ్లీట్‌లో సంఖ్య తగ్గలేదని అమెరికా చెబుతున్నది. మరి భారత్‌ ‌వద్ద ఉన్న ఆమ్రమ్‌ ‌మిస్సైల్‌ ‌శిథిలాలు ఎవరియో తెలియాల్సి ఉంది. ఎందుకంటే ఒక్క ఎఫ్‌-16 ‌యుద్ద విమానంలో మాత్రమే ఆమ్రమ్‌ ‌మిస్సైల్‌ ‌సెట్‌ అవుతుంది. భారత్‌లో జాతీయ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో అమెరికా ఇచ్చిన రిపోర్ట్ ‌కొంత అస్పష్టతను కలిగిస్తున్నది. ఇదిలాఉంటే భారత్‌ ‌వాదనకు ఇది భిన్నంగా ఉంది.