వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాం -కేంద్ర హోమ్ మంత్రి రాజనాథ్ సింగ్

April 2, 2019

‌టిఅర్‌ఎస్‌ ‌గత ఎన్నికలలో ప్రజలు గెలిపించారు.. ఈ విషయం లో మాకు బాధ లేదు. మోదీ ప్రభుత్వ పాలనను మీరు చూశారు. అది చూసి బిజెపి కి ఓటేయండనీ కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్‌ ‌రాజనాధ్‌ ‌సింగ్‌ ‌కోరారు. నిజామాబాద్‌ ‌పాలిటెక్నిక్‌ ‌కళాశాల మైదానంలో విజయసంకల్ప సభకు హాజరై మాట్లాడారు. మోదీ ప్రభుత్వం వచ్చాక అంతర్జాతీయంగా భారతదేశ ప్రతిష్ఠ పెరిగిందన్నారు. ఈ విషయాన్ని విదేశాలలో ఉన్న భారతీయులను అడగండినీ ప్రశ్నించారు. పని చేసే విధానం లో తేడాను ప్రజలు గమనించాలన్నారు. ఐదు సంవత్సరాలలలొ 25 లక్షల ఇండ్లు కాంగ్రెస్‌ ‌కట్టిస్తే కోటి 30 లక్షల ఇండ్లు మోదీ ప్రభుత్వం కట్టించింది.. 2022 వరకు ఒక్క పేద కూడా సొంత ఇళ్ళు లేకుండా ఉండబోరన్నారు. ఏ ఒక్క కుటుంబం కూడా వంట గ్యాస్‌ ‌లేకుండా ఉండదన్నారు. ఇక్కడ బిజెపి ప్రభుత్వం ఉంటే బిజెపి పాలిత రాష్ట్రాలలో లాగా గ్యాస్‌ ‌సిలిండర్లు అందరికీ ఉండేవనీ, దేశంలో 7 కోట్లు గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌లు ఇస్తే రాష్త్రం లో ఇవ్వలేదన్నారు. నిజామాబాద్‌ ‌లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ ‌ను గెలిపిస్తే గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌లు వస్తాయనీ వెల్లడించారు. బిజెపి వచ్చాక నిత్యావసర ధరలు పెరగలేదనీ తెలిపారు. ఆర్థిక వ్యవస్త బలపడిందనీ, రాష్త్రంలో రైతుల పరిస్తితులు బాగాలేవఅన్నారు. పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు..