Take a fresh look at your lifestyle.

పవన్‌ ‌కల్యాణ్‌ ‌లాంగ్‌ ‌మార్చ్ ‌ముఖ్యోద్దేశ్యం..

తమ గుట్టుమట్లు ఎక్కడ బయటపడతాయోనని ఈ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు, నాయకులే ఈ కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు విశాఖలో జనసేన లాంగ్‌ ‌మార్చ్ ఏర్పాటు చేయించినట్టు వచ్చిన ఆరోపణలు సహేతుకంగానే ఉన్నాయి. తెలుగుదేశం పన్నిన వలలో పవన్‌ ‌కల్యాణ్‌ ‌పడ్డారు. నిజానికి ఈ ఇసుక దోపిడి పూర్వాపరాలు ఆయనకు తెలియవు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివేస్తున్నారు అంతే. ఆయన ఏదో విధంగా ప్రజల్లోకి తిరిగి రావాలి.అందుకు ఇది ఉపయోగపడుతుందని భావించి ఉండవచ్చు. తీరా వచ్చి ఇందులో ఇరుకు్క పోయారు. దీని వల్ల ఆయనకున్న ఇమేజ్‌ ‌దెబ్బతింది.సినీనటుడు, జనసేనాని పవన్‌ ‌కల్యాణ్‌ ‌విశాఖలో లాంగ్‌ ‌మార్చ్ ‌పేరిట ఏర్పాటు చేసిన సభ ముఖ్యోద్దేశ్యం ఇప్పుడు జనానికి అర్థం అయింది. ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో ఓటమి తర్వాత ప్రజల వద్దకు వెళ్ళడానికి ఆయనకు ఓ అంశం కావాలి, ఇసుక కొరత రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమంటూ అంతకుముందే తెలుగుదేశం అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రచారం ప్రారంభించడంతో అది ఉపయోగ పడుతుందని పవన్‌ అనుకున్నారు. నిజానికి ఇసుక తాత్కాలిక సమస్య. ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో వర్షాలు కురవడం, కృష్ణా గోదావరి నదులకు వరుసగా వరదలు రావడంతో ఇసుక సేకరణ జరగలేదు.అదేదో ప్రభుత్వ వైఫల్యంగా చిత్రించేందుకుచంద్రబాబునాయుడు,ఆయన పరివారం ఎంతో కష్టపడ్డారు.ఇప్పటికీ పడుతున్నారు. ఆయన పాలన ఐదేళ్ళలో తెలుగుదేశం నాయకులు, శ్రేణులు ఇసుక అమ్ముకుని కోట్లు గడించినట్టు వైసీపీ నాయకులే కాకుండా బీజేపీ నాయకులు ఆరోపించేవారు. నిజానికి ఇసుక అమ్మకాల్లో ఆరితేరిన వారు తెలుగుదేశం వారే. ఇప్పటికీ ఇసుక బ్లాక్‌ ‌మార్కెట్‌ ‌జరుగుతోందంటే అది తెలుగుదేశం వారు దాచి పెట్టిన నిల్వల నుంచే. ఎందుకంటే చాలా ఇసుక రీచ్‌ ‌లు ఇప్పటికీ నీటి మడుగులో ఉన్నాయి. ఇలాంటి సందర్భాల్లో తవ్వకాలు జరపడం ప్రాణాంతకం. అంతేకాక, ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్మోహన్‌ ‌ర్డ్డె పారదర్సకమైన ఇసుక విధానాన్ని రూపొందించారు. ఇసుక గిడ్డంగులపై దాడులు జరిపించారు. జరిపిస్తున్నారు. దీని వల్ల ఇబ్బందులకు గురి అవుతుండటం వల్లనే తెలుగుదేశం వారు ఇసుక పై గగ్గోలు పెడతున్నారు.అంతేకాక, ఇసుక సమస్య కృష్ణా, గోదావరి జిల్లాల్లో ఉంటే పవన్‌ ‌కల్యాణ్‌ ‌విశాఖలో లాంగ్‌ ‌మార్చ్ ‌జరపడం ఏమిటా అని ప్రజలు విస్తు పోతున్నారు. ఆయన తెలుగుదేశం నాయకుల వలలో పడ్డారు.విశాఖను లాంగ్‌ ‌మార్చ్ ‌కి ఎంచుకోవడంలో తెలుగుదేశం నాయకుల ఎత్తుగడలో బాగం. వైసీపీ ప్రభుత్వం విశాఖలో తెలుగుదేశం హాయంలో జరిగిన భూ కుంభకోణంపై విచారణ జరిపిస్తోంది. రోజూ బాధితులు వచ్చి విచారణ సంఘం అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలా ఫిర్యాదు చేసే వారి సంఖ్య బాగాపెరుగుతోంది. తెలుగు దేశం ప్రభుత్వం తూతూ మంత్రంగా విచారణ జరిపించేసి కుంభకోణం ఏమీ జరగలేదని తేల్చేసింది.ఇప్పుడు జగన్‌ ఆదేశాలతో ఈ కుంభకోణాన్ని కూకటి వేళ్ళతో పెల్లగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే తెలుగుదేశం అధినాయకుల పునాదులు కదులుతాయి. ఈ కుంభకోణంలో తెలుగుదేశం నాయకుల్లో పై నుంచి కిందవరకూ అందరికీ ముడుపులు అందాయని అప్పట్లో రోజూ పత్రికల్లో వార్తలు వచ్చాయి. వారిలో వారే విమర్శించుకునే వారు.అదే జిల్లాకు చెందిన అప్పటి మంత్రులు పరస్పరం చేసుకున్న ఆరోపణలు పత్రికల్లో , మీడియాలోనూ వచ్చాయి. అవన్నీ జనానికి తెలుసు. గతంలో విచారణ అంతా గోప్యంగా జరిగింది.ఇప్పుడు బహిరంగంగా జరుగుతోంది. సాక్షులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నారు. అందువల్ల తమ గుట్టుమట్లు ఎక్కడ బయటపడతాయోనని ఈ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు,నాయకులే ఈ కుంభకోణం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు విశాఖలో జనసేన లాంగ్‌ ‌మార్చ్ ఏర్పాటు చేయించినట్టు వచ్చిన ఆరోపణలు సహేతు కంగానే ఉన్నాయి. తెలుగుదేశం పన్నిన వలలో పవన్‌ ‌కల్యాణ్‌ ‌పడ్డారు. నిజానికి ఈ ఇసుక దోపిడి పూర్వాపరాలు ఆయనకు తెలియవు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టు చదివేస్తున్నారు అంతే. ఆయన ఏదో విధంగా ప్రజల్లోకి తిరిగి రావాలి.అందుకు ఇది ఉపయోగపడుతుందని భావించి ఉండవచ్చు. తీరా వచ్చి ఇందులో ఇరుక్కుపోయారు. దీని వల్ల ఆయనకున్న ఇమేజ్‌ ‌దెబ్బతింది. తెలుగుదేశం హయాంలో జరిగిన ఇసుక కుంభకోణాన్ని కూడా జగన్‌ ‌తవ్వి తీయిస్తున్నారు. తమ పాత్ర ఎక్కడ బయటపడుతుందోనని తెలుగుదేశం నాయకులు ఎదురుదాడి చేస్తున్నారు. ఎదురుదాడిలో చంద్రబాబునాయుణ్ణి మించిన రాజకీయ నాయకుడు దేశంలో ఎవరూ లేరు. ఇదంతా ఆయన ఆడిస్తున్న నాటకం.

– ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy