Take a fresh look at your lifestyle.

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

ప్రపంచ ఆరోగ్య సంస్థల తాజా సర్వేల ప్రకారం వాతావరణ కాలుష్యం వలన ప్రపంచ వ్యాప్తంగా చిన్న పిల్లల మరణాలకు పర్యావరణ కాలుష్యమే కారణమవుతున్నది. వాయు, జల కాలుష్య పారిశుద్ధ్య లేమి వంటి కారణాలతో శ్వాస కోశ వ్యాధులు, డయేరియా, మలేరియా, నిమోనియా వంటి వ్యాధులు వ్యాపిస్తూ చిన్నారులు మృత్యువాత పడుతున్నారని కొన్ని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఈ కాలుష్యం మానవాళి అనారోగ్యానికి కారణభూతమౌతున్నది. ఈ భూమిపై స్వేచ్ఛగా జీవించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. అయితే ప్రకృతికి హాని తలపెట్టకుండా ఉండటం మన ధర్మం. ప్రకృతికి హాని కలిగించకుండా ఉండేందుకు పర్యావరణ పరిరక్షణ విషయమై మనమందరం పూర్తి అవగాహన కలిగిఉండాలి. పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరు బాధ్యతగా గుర్తించి తగిన చర్యలు తీసుకోని మన ఆరోగ్యాలతో పాటు రేపటి తరాల వారికి హాని కలగకుండా చూడాలి. కాలుష్యాన్ని నివారించేందుకు ప్రతి ఒక్కరూ తమ విధులను మర్కొసారి గుర్తు చేసుకుని తదనుగుణంగా నడుచుకోవాలి. ఈ విషయంలో మన కనీస కర్తవ్యాలను నిర్వహించాలి. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకు మనం చెత్తను ఎక్కడ పడితే అక్కడ పడవేయకుండా కుండీలను ఉపయోగించాలి. ప్లాస్టిక్‌ ‌వినియోగం తగ్గించి భూకాలుష్యాన్ని తగ్గించడమేకాకుండా తద్వారా భూగర్భ జలాలు పెరుగడానికి సహకరించాలి. చెట్లను రక్షించడంతో పాటు చెట్లను పెంచేందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి.
తీసుకోవలసిన జాగ్రత్తలు..
వాయు కాలుష్యాన్ని తగ్గించే అతి సులభమైన మార్గం పచ్చదనమే. అందుకోసం అడవుల్ని కాపాడుకోవడమే కాదు, ఇంటి చుట్టూ వీలైనన్ని ఎక్కువ మొక్కలు పెంచాలి. మన దేశంలో వంద కోట్ల మంది తలా ఒక్క మొక్క పెంచినా వంద కోట్ల చెట్లవుతాయి. ప్రతి మనిషి ఒకమొక్క నాటే విధంగా అవగాహన గాని, లేక చట్టం తీసుకొని రావాలి. మనల్నీ, మనదేశాన్నీ పదికాలాల పాటు పచ్చగా బతికేలా చేస్తాయి వృక్షాలు. మొక్కలు జీవకోటి ప్రాణ దాతలవుతాయి.
ఈ విషయంలో కొన్ని చిన్న చిన్న విషయాలను మనం ఆచరణలో పెట్టాలి. చాలామంది ప్రతి చిన్న అవసరానికి బైక్‌ను ఉపయోగిస్తూంటారు. దానికి బదులు నడుచుకుంటూనో సైకిల్‌ ‌మీదో వెళ్తే కాలుష్యాన్ని కొంత మేర తగ్గించడమే కాకుండా అన్నివిధాలా ఆరోగ్యకరం. ట్రాఫిక్‌ ‌సిగ్నళ్ల వద్ద పావుగంట సిగ్నల్‌ ‌పడినా కొంతమందికి మోటారు వాహనాల ఇంజన్‌ ఆపే అలవాటుండదు. కానీ అలా ఆపడం వల్ల కాలుష్యాన్ని తగ్గించుకోవచ్చు, ఇంధనమూ ఆదా అవుతుంది. ఇంధనం వాడకాన్ని సాధ్యమైనంత తగ్గించాలి. పర్యావరణాన్ని పాడు చేసే పాత వాహనాలను వాడకుండా జాగ్రత్త పడాలి. వాహశ్రీదారులందరు వారంలో ఒక రోజైనా సొంత వాహనాలు వాడకుండా ప్రజా రవాణా సౌకర్యాలను వినియోగింకోవాలి. ప్రభుత్వాలతో పాటు ప్రజలూ విద్యుత్‌ ‌వినియోగాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నించాలి. ఫ్యాన్లూ, లైట్లతో పాటు ఇంట్లోని ఎలక్ట్రానిక్‌ ‌వస్తువులతో పని పూర్తవగానే ఆఫ్‌ ‌చేయడం మంచి పద్ధతి. ఎంత విద్యుత్తును ఆదా చేస్తే వాతావరణ కాలుష్యం అంత తగ్గుతుంది. ఒక్క విద్యుత్తు వృథా కారణంగానే ప్రపంచవ్యాప్తంగా యాభై మెట్రిక్‌ ‌టన్నుల కార్బన్‌డయాక్సైడ్‌ ‌గాల్లోకి విడుదలవుతోంది. మరోవ్కెపు ఏసీలూ, రెఫ్రిజిరేటర్లు, కూలర్లు విడుదల చేసే క్లోరోఫ్లోరో కార్బన్లు ఓజోన్‌ ‌పొరకు చిల్లు పెడుతున్నాయని కొన్ని సర్వేల ద్వార తెలుస్తున్నది. విద్యుత్తును తక్కువ ఉపయోగించుకునే పరికరాలూ, యంత్రాలను కొనడం కూడా మంచి ప్రత్యామ్నాయం. శుభకార్యాలకు, కొన్ని కార్యక్రమాలకు .. గాల్లో పేలే టపాసులు పెరుగుతున్నాయి. ఒక్క టపాసుని పేల్చితే వచ్చే పొగ అయిదువందల సిగరెట్లకు సమానం అన్నది పూణె పరిశోధకుల మాట. అందుకేటపాసుల వాడకాన్ని తగ్గించాలి.పేపర్‌ ‌వాడకాన్ని తగ్గించాలి. పేపర్‌ ‌తయారీకి రోజు కొన్ని లక్షల చెట్లను నరుకుతున్నారు. అందుకే అవసరమైతే తప్ప పేపర్‌ ‌వాడరాదు. ప్లాస్టిక్‌ ‌వాడకాన్ని పూర్తి స్థాయిలో తగ్గించాలి. ప్లాస్టిక్‌ ఉత్పత్తులను నిలిపి వేసి నప్పుడె అది సాధ్యమవుతుంది. ప్రభుత్వాలు కూడా వీటిని అమలు చేసేవిధంగా కఠినమైన చట్టాలను రూపొందించాలి. వాటిని అమలు చేసె విధంగా చర్యలు తీసుకోవాలి. ప్లాస్టిక్‌ ‌కవర్స్ ‌బదులు బట్టతో గాని, పర్యవరణానికి హాని చెయ్యని వస్తువులనే వాడాలి. జలాన్ని వృథా చెయ్యకుండ ప్రతి నీటి బొట్టును జాగ్రత్తగా వాడుకోవాలి. లేక పోతే భవిష్యత్తులో ప్రకృతి వినాశనానికి దారి తీయవచ్చును. పరిశ్రమల నుండి వెలువడే కాలుష్యం విష పదార్థాల వాయువుల వల్ల గాలి, నీరు, నేల కలుషితం అవుతున్నాయి. అందువల్ల పరిశ్రమల నుండి వచ్చే కాలుష్య కారకాలను బహిరంగంగా కాకుండా వేరె పద్దతిలో బయటకు పంపేవిధంగా ఏర్పాటు చేసుకోవడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. తద్వారా వాతవరణ కాలుష్యం వల్ల కలిగే దుష్పరిణామాలను, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు.
పైన తెలిపిన వేవీ కూడా మనకు అసాధ్యమైన విషయాలు, ఆచరణకు సాధ్యంకాని విషయాలు కావు. అందుకే పర్యావరణం విశనమై ప్రమాదగంటికలు మోగుతున్న ప్రస్తు తరుణంలో మానవాళి మొత్తం మరొకసారి పర్యావరణ పరిరక్షణకు కృషిచేయాలి.


పి. మహమ్మద్‌ ‌రఫి.
సామాజిక కార్యకర్త

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy