Take a fresh look at your lifestyle.

పరాజితుల తో వాపే తప్ప బలు పు రాదు

తెలు గు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాయింపుల ను ప్రోత్సహించడం ద్వారా బల పడానుకుంటున్న బీజేపీ ఆశలు అడియాశలు కాక తప్పదు. ఇది శాపనార్థం కాదు. వాస్తవ పరిశీల న. బీజేపీలోకి క్యూ కడుతున్న వారంతా అసెంబ్లీ, సాధారణ ఎన్నికల్లో పరాజితులైన వారే. తెలు గు రాష్ట్రాల్లో బీజేపీని వ్యవస్థాపరంగా పటిష్టం చేసే విషయంలో కేంద్ర నాయకత్వం మొదటి నుంచి తాత్కాలిక చర్యలే తప్ప శాశ్వతప్రాతిపదికపై చర్యలు తీసుకోలేదు. మొదటి నుంచి తెలంగాణలోనే బీజేపీకి కాస్తోకూస్తో పట్టు ఉంది. వరంగల్‌ ఎంపీగా పని చేసిన జంగారెడ్డి కాలం నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. అయితే, అప్పట్లో తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో భాగమైనందున పార్టీ ఉమ్మడి రాష్ట్ర శాఖ అధ్యక్షుడుగా ఎవరున్నా తగిన శ్రద్ధ తీసుకోలేదన్నది కఠోర సత్యం. ఉమ్మడి రాష్ట్రంలో ఎక్కువ కాలం ఆంధ్ర ప్రాంతానికి చెందిన నాయకుడే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షునిగా వ్యవహరించారు. భావజాల పరంగా చూస్తే ఆంధ్ర కన్నా తెలంగాణ లోనే బీజేపీని ఆదరించేవారున్నారు. అభిమానులు ఉన్నారు. వారి మద్దతునూ, సహకారాన్ని తీసుకోకుండా ఉమ్మడి రాష్ట్ర బీజేపీ అధ్యక్షలు పార్టీని ఆంధ్రప్రాంతంలో బలం గా ఉన్న ప్రాంతీయ పార్టీకి అనుకూల మైన రీతిలో వ్యవహరించడం వ్లల్ల నే రెండు చోట్లా కూడా పార్టీ ఎదగలేదు.అయితే,ఉమ్మడి రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా పని చేసిన వారు ముందు అఖిల భారతస్థాయికీ, ఆ తర్వాత దేశానికి ఉపాధ్యక్ష పదవికి ఎదిగారు. అది పాత చరిత్ర అనుకున్నా, ప్రస్తుత నాయకత్వం కూడా పార్టీని నమ్ముకున్న వారిని ప్రోత్సహించకుండా, ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి అర్జెంట్‌గా పార్టీ తీర్థం ఇచ్చి, కండువాలు కప్పడం వ్ల పార్టీ బలోపేతం అయిందని స్వీయానందాన్ని పొందుతున్నారే తప్ప పునాదులోకి వెళ్ళలేకపోతున్నామన్న విషయాన్ని అగ్రనాయకత్వం గ్రహించడం లేదు. ఇప్పుడు బీజేపీలోకి ప్రవాహంలా వస్తున్న వారంతా ఎన్నికల్లో ఓటమి పాలైన వారే.ఆంధ్రప్రాంతానికి పార్టీ అధ్యక్షునిగా వ్యవహరిస్తున్న కన్నా ల క్ష్మీనారాయణ ఒక సామాజికవర్గానికి చెందిన బల మైన నాయకుడే. సందేహం లేదు.ఆయన సుదీర్ఘ కాం కాంగ్రెస్‌ నాయకునిగా గుర్తింపు పొందిన వారు. 2014లో ఎన్నికల్లో ఓటమి పాయ్యారు.అలాగే,ఇప్పుడు తెలంగాణ లో చేరుతున్న నాయకుల్లో చాలా మంది ఎన్నికల్లో పరాజయం పాలైన వారే. అటువంటి వారిని బీజేపీలో చేర్చుకోవడం వ్ల పార్టీ బలోపేతం అవుతుందని అనుకోవడం భ్రమే. ఇటీవల నలు గురు రాజ్య సభ సభ్యుల కు బీజేపీ తీర్థం ఇచ్చారు.వీరు ప్రజల్లోంచి వచ్చిన నాయకులు కారు. తెలు గుదేశం హయాంలో ఆనాయకునితో సన్నిహితంగా ఉండి ఈ పదవుల ను సంపాదించుకున్నారు. ఈ పదవీ కాలం, పూర్తి కాగానే మళ్ళీ అవే స్థానాల కు ఎన్నికవుతారన్న నమ్మకం వీరికీ లేదు. జనానికీ లేదు. పేర్లు వ్లెల్ల డిరచడం ఎందుకు అందరూ అలాంటి వారే. బీజేపీని తెలు గు రాష్ట్రాల్లో బలోపేతం చేయడానికి సంఫ్‌ు పరివార్‌ లో అంచెంచొగా పైకి వచ్చిన జాతీయ ప్రధాన కార్యదర్శి రామ్‌ మాధవ్‌ వంటివారు ఇక్కడ మకాం వేసి గ్రామస్థాయి నుంచి కార్యకర్తల ను, నాయకుల నూ, పార్టీ శ్రేణుల ను ప్రోత్సహించాలి. పార్టీ కోసం కష్టించి పని చేసిన వారికే పదవులు ఇవ్వాలి. గోడదూకిన వారికి పదవులు ఇవ్వడం వ్లల్ల పార్టీ మరింత నష్టపోతుంది. కేంద్రంలో అధికారం ఉందని వీరంతా వరసపెట్టి బీజేపీలో చేరుతున్నారు. బీజేపీని సిద్ధాంత పరంగా అభిమానించేవారే ఇప్పుడు పార్టీకి కావాలి. దేశానికి మోడీ నాయకత్వం ఎంత అవసరమో, రాష్ట్రాకు మోడీ వంటి నాయకులు అవసరం ఉంది. బండారు దత్తాత్రేయ వంటి సీనియర్‌ నాయకుల ను పక్కన పెట్టి ఫిరాయింపుదారుకు ప్రాధాన్యం ఇవ్వడం వాపు అవుతుందే తప్ప బలు పు కానేకాదు. విల క్షణమైన పార్టీ మాది అని చెప్పుకునే బీజేపీ కేంద్ర నాయకత్వమే కాంగ్రెస్‌ సంస్క ృతిని జీర్ణించుకున్న రీతిలో భావజాలం తో ఏమాత్రం సంబంధం లేని వారికి ఉన్నపళంగా, ఆదరాబాదరాగా పార్టీ తీర్థం ఇచ్చి కండువాలు కప్పేయడం వ్లల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. అంతేకాక, ఇప్పుడు పొలో మంటూ చేరుతున్న వారంతా కాంగ్రెస్‌లో పదవులు అనుభవించిన వారే. బీజేపీ అధికారంలో ఉంది కదా అని, ఏదో ఒక పదవి దొరకుతుందన్న ఆశతో వీరంతా వచ్చి చేరుతున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీకి ఇదంతా తెలు సు. ముఖ్యంగా పార్టీ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్‌ షా ఆధ్వర్యంలో జరుగుతున్న ఫిరాయింపున్నీ ఆయనకు తెలు సు. రాజ్యసభలో బలం పెంచుకోవడానికి ఆయన ఆశీస్సుల తోనే ఇదంతా జరుగుతోందన్న విషయం లోకానికి తెలు సు. అవసరానికి పార్టీ ఫిరాయింపును ప్రోత్సహిస్తే భవిష్యత్‌లో అవే పెద్ద కొరకరాని కొయ్యగా తయారవుతాయి. ఆనాడు పీవీ నరసింహారావు మైనారిటీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి ఫిరాయింపును అనుమతించిన మాట నిజమే. అది చారిత్రక అవసరం. ఇప్పుడు అలాంటిది లేకపోయినా, తమ కంచం నిండుగా అన్నం ఉన్నా ఎదుటి వారి కంచం లాక్కున్న రీతిలో పార్టీ ఫిరాయింపును ప్రోత్సహించడాన్ని ఎక్కడో కాదు ఇక్కడే చూస్తున్నాం. పార్టీ ఫిరాయింపును ప్రోత్సహించడం వ్లల్ల ఆశించిన ప్రయోజనం నెరవేరదు సరికదా, బెడిసి కొడుతుంది. పైగా, అధికారం , పదవులు ఆశించి వచ్చేవారంతా ప్రజల్లో పునాదులు లేని వారేనన్న విషయాన్ని బీజేపీ అధిష్ఠానం ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది. ఇప్పుడు చేరిన వారూ, ఇంకా చేరుతున్న వారంతా ప్రజల చేత తిరస్కరించబడిన వారేనన్న సంగతిని మరువరాదు. ఫిరాయింపు ప్రోత్సాహం వ్లల్ల మొదటికే మోసం వస్తుందన్న సంగతి బీజేపీ అగ్రనాయకు తెలు సుకోవాలి.
` చల్లా అనంతపద్మనాభ స్వామి

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy