Take a fresh look at your lifestyle.

పత్తి కొనుగోలుకు ఏర్పాట్లు చేయాలి చేయాలి జిల్లా పాలనాధికారి సందీప్‌ ‌కుమార్‌ ‌ఝూ

రెబ్బెన, సెప్టెంబర్‌ 22, (‌ప్రజాతంత్ర విలేకరి) : ఖరీఫ్‌ ‌సీజన్‌ 2020-21 ‌పత్తి కొనుగోలు ముందస్తు సమావేశాన్ని జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో మంగళవారం రోజున జిల్లా పాలనాధికారి సందీప్‌ ‌కుమార్‌ ‌ఝూ మార్కెటింగ్‌, ‌వ్యవసాయం,ట్రన్స్ ‌కో ,పైర్‌ ,‌లీగల్‌ ‌మెట్రాలజి, ట్రాన్స్ ‌పోర్ట్,  ‌జిన్నింగ్‌ ‌మిల్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ  సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పత్తి కొనుగోలు చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో 14 జిన్నింగ్‌ ‌మిల్స్ ఉన్నాయని పత్తి కొనుగోలు నవంబర్‌ 20 ‌నుండి ప్రారంభమవుతుందని, అప్పటిలోగా రైతుల డేటా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ ‌చేయాలని అవసరం ఉన్న చోట మరి కొన్ని గోదాములు ఏర్పాటు చేసుకోవాలని అన్నారు.

లీగల్‌ ‌మెట్రాలజీ  అధికారులు అన్ని మార్కెట్‌ ‌యార్డ్, ‌జిన్నింగ్‌ ‌మిల్లులను సందర్శించి ఎలక్ట్రానిక్‌ ‌వెయిట్‌ ‌బ్రిడ్జ్ ‌లను దృవీకరించి పది రోజుల లోగ నివేదిక సమర్పించాలని, అగ్నిమాపక పరికరాలు అన్ని జిన్నింగ్‌ ‌మిల్లులలో అందుబాటులో ఉండేలా చూడాలని అగ్ని మాపక అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ, మార్కెట్‌ ‌కమిటీ, సి• •ఐ అధికారుల ఆధ్వర్యంలో క్షేత్ర స్థాయిలో గ్రామాల వారిగా  రైతుల వద్ద నిల్వ ఉన్న పత్తి నాణ్యత పరిశీ లించి రైతులకు టోకెన్లు జూరి చేసి, టోకెన్లు కలిగి ఆన్లైన్‌ ‌డేటా ప్రకారమే సిసిఐ వారి నిబంధనల ప్రకారంగా పత్తి ని రైతుల నుండి కొనుగోలు  చేయబడుతుందన్నారు.ఈ సమావేశంలో జిల్లా అదనపు పాలనాధికారి రాంబాబు, మార్కెట్‌ ‌కమిటి ఎండి గజానంద్‌, ‌వ్యవసాయశా ఖాధికారి రవీందర్‌, ‌ట్రాన్స్ ‌పోర్ట్ అధికారి ఉమా మహేశ్వర్‌ ‌రావ్‌, ‌లీగల్‌ ‌మెట్రాలజి, అగ్ని మాపక అధికారి, జిన్నింగ్‌ ‌మిల్లు యజమానులు పాల్గొన్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply