వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

పడిపోయిన ద్రవ్య చలామణితో… దివాలా..!

August 23, 2019

దేశ ఆర్థిక పరిస్థితి గంభీరంగా ఉందన్న నీతి అయోగ్‌ ఉపాధ్యక్షుడు
మెరుగ్గానే ఉందన్న కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌గడిచిన ఏడు దశాబ్దాల్లో కనీవినీ ఎరుగని రీతిలో ద్రవ్య చలామణి పడిపోయిందని నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు వ్యాఖ్యానించారు. దేశం గడిచిన ఐదు సంవత్సరాలుగా వృద్ధిలో అతి క్లిష్ట దశ లో ఉన్న సమయంలో దేశంలో అగ్రశ్రేణి ఆర్థిక శాస్త్రవేత్త ద్రవ్య చలామణి గురించి వ్యాఖ్యానించడం విశేషమే. నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ ‌కుమార్‌ ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం గుర్తించిందని అన్నారు. ఆర్థిక రంగం తిరోగమన దిశ పై వ్యాఖ్యానిస్తూ, దేశంలో ఇప్పుడు ఎన్నడూ కనీవినీ ఎరగని పరిస్థితి నెలకొందని అన్నారు. ద్రవ్య చలామణి విషయంలో ఇప్పుడున్న పరిస్థితి గడిచిన 70 సంవత్సరాల్లో ఎన్నడూ లేదని ఆయన ఒక వార్తా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితిపై ప్రజల్లో ఉన్న అనుమానాలూ,అపోహలూ తొలగించడానికి ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలని ఆయన అన్నారు. మొత్తం ఆర్థిక రంగం అస్తవ్యస్తంగా ఉందన్న భయ సందేహాలు వ్యాప్తమవుతున్నాయనీ, వాటిని తొలగించాలని అన్నారు. అలాగే, ప్రైవేటు రంగంలో ఉన్న భయ సందేహాలను తొలగించాలని అన్నారు. గడిచిన ఐదు సంవత్సరాల్లో దేశ ఆర్థికాభివృద్ధి అత్యంత క్లిష్ట దశలో ఉన్న సమయంలో అగ్రశ్రేణి ఆర్థిక శాస్త్రవేత్త ఈ వ్యాఖ్య చేశారు. ద్రవ్య చలామణిలో సమస్యలు దివాలాకు దారి తీయవచ్చని ఆయన అన్నారు. అందువల్ల అటువంటి పరిస్థితి రాకుండా అడ్డుకట్ట వేయాలని అన్నారు. ద్రవ్య చలామణిలో ఇబ్బందుల గురించి మాట్లాడుతూ, ఎవరూ ఎవరినీ నమ్మడం లేదని అన్నారు. ప్రభుత్వమే కాదు, ప్రైవేటు రంగం కూడా ప్రైవేటు రంగంలో వారు కూడా ఎవరికీ రుణాలు ఇవ్వడానికి ఇష్టపడటం లేదని అన్నారు.
ఇప్పుడు రెండు అంశాలున్నాయి. సాధారణ పరిధిని మించి చర్యలు తీసుకోవడం మొదటిది. ప్రైవేటు రంగంలో ఉన్న భయ సందేహాలను తొలగించేందుకు ప్రభుత్వం తాను చేయగలిగింది చేయాలి అని అన్నారు. మన దేశంలో స్థూల జాతీయోత్పత్తి (జిడిపి) జనవరి-మార్చి మాసాల మధ్య 5.8 శాతం ఉంది. మార్చి 31వ తేదీతో అంతమైన ఆర్థిక సంవత్సరంలో ఆర్థికాభివృద్ధి 6.9 ఉంది. జిడిపి మరింత గా మందగించవచ్చు.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి అది 5.7 శాతానికి చేరుకోవచ్చు. వినియోగం బాగా తక్కువగా ఉండటం, పెట్టుబడులు అంతగా లేకపోవడం, సేవారంగంలో జరగాల్సినంత అభివృద్ధి జరగకపోవడం. వంటి అంశాలే ఇందుకు కారణమని నౌమూరా నివేదికలో పేర్కొనడం జరిగింది . జూలై- సెప్టెంబర్‌ ‌మాసాల్లో ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడవచ్చు. ఆర్థిక మందకొడితనం ప్రభావం బ్యాంకులపై పడవచ్చు. సెప్టెంబర్‌ ‌నెలాఖరుకు ద్రవ్య సంక్షోభం ఏర్పడకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.