వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

పజాధనాన్ని దుర్వినియోగం

August 30, 2019

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ‌కోదండరాంతెలంగాణ రాష్ట్రంలో ప్రజాధనాన్ని టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందని టిజెఎస్‌ అధ్యక్షుడు కోదండరాం అన్నారు.శుక్రవారం ఆయన వేములవాడలోని న్యాయవాదులతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన సాగునీరు,తాగునీరు ప్రాజెక్టుల్లో దుబారా ఖర్చు అధికంగా ఉందని,రీడిజైనింగ్‌ ‌పేరిట సాగునీటి ప్రాజెక్టుల్లో కోట్లాది రూపాయలు అధికంగా ఖర్చు చేశారని ఆరోపించారు.కాళేశ్వరం వద్ద నిర్మించిన ప్రాజెక్టు ద్వారా ఒక టిఎంసి నీటిని ఎత్తిపోయడానికి రూ 6 కోట్ల వ్యయం అవుతుందని,ఒక వేళ తుమ్మిడిహట్టి వద్ద పాజెక్టు నిర్మాణం చేపట్టినట్లైతే ఒక టిఎంసి నీటిని ఎత్తి పోయడానికి కేవలం కోటిన్నర ఖర్చు అవుతుందని అన్నారు.దీనిని బట్టి సాగు నీటి ప్రాజెక్టులను రీడిజైనింగ్‌ ‌చేయడం ద్వారా రాష్ట్ర ఖజానాపై ఎంత భారం పడుతుంద• ఊహించుకోవచ్చని ఆయన అన్నారు.తెలంగాణలో టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లక్ష ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని,ఒక సంవత్సరం తర్వాత ఖాళీలు రెండు లక్షలకు చేరుకున్నాయని,వాటన్నింటిని వెంటనే భర్తీ చేయాలని తాము కోరుతున్నప్పటికిని ప్రభుత్వాధినేత పట్టించుకోవడం లేదని విమర్శించారు