వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

పంద్రాగస్ట్ ‌వేడుకలకు కాశ్మీర్‌ ‌సిద్ధ్దం

August 13, 2019

స్వాతంత వేడుకలకు జమ్మూకశ్మీర్‌ ‌ముస్తాబవుతోంది. భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్వాతంత్రదినోత్సవ వేడుకల్లో జమ్మూకశ్మీర్‌ ‌సంస్కతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ కార్యక్రమాలను నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్దం చేశారు. స్వాతంత్య ్రదినోత్సవం సందర్భంగా శ్రీనగర్‌ ‌లోని శెర్‌ -ఐ-‌కశ్మీర్‌ ‌స్టేడియంలో కళాకారుల బృందాలు రిహార్సల్స్ ‌చేస్తున్నాయి. మరోవైపు సైనిక బలగాలు, జవాన్లు పరేడ్‌ ‌రిహార్సల్స్ ‌చేస్తున్నారు. కళాకారుల బృందాలతో జమ్మూకశ్మీర్‌ ‌లో సందడి వాతావరణం నెలకొంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం కేంద్ర హోం మంత్రి అమిత్‌ ‌షా ఈ నెల 15న శ్రీనగర్‌లోని లాల్‌ ‌చౌక్‌లో జాతీయ జెండాను ఎగురవేయబోతున్నట్లు తెలుస్తోంది. ఆయన ఈ నెల 16, 17 తేదీల్లో లడఖ్‌లో పర్యటిస్తారని కూడా సమాచారం అందుతోంది. 370 రద్దు తరవాత వస్తున్న తొలి స్వాతంత్య్ర వేడుకలు కావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. సాహసోపేతమైన చర్యలతో జమ్మూ-కశ్మీరును భారత దేశంలో పరిపూర్ణంగా అంతర్భాగం చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 15న స్వాతంత్య ్రదినోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. జమ్మూ-కశ్మీరు ప్రిన్సిపల్‌ ‌సెక్రటరీ రోహిత్‌ ‌కన్సల్‌ ‌మంగళవారం మాట్లాడుతూ జమ్మూ-కశ్మీరు, లడఖ్‌ ‌కేంద్ర పాలిత ప్రాంతాల్లో అన్ని జిల్లాల్లోనూ స్వాతంత్య ్రదినోత్సవాలను నిర్వహించేందుకు డ్రెస్‌ ‌రిహార్సల్స్ ‌జరుగుతున్నాయన్నారు. ఈద్‌ ‌పండుగ ప్రశాంతంగా ముగియడంతో నిషేధాజ్ఞలను సోమవారం మరింతగా సడలించినట్లు తెలిపారు. జమ్మూ ప్రాంతంలో దాదాపు ఆంక్షలు లేవన్నారు. కశ్మీరులో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఆంక్షలు ఉన్నట్లు తెలిపారు.