వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

పండుగలకు 78 ప్రత్యేక రైళ్ళుః రైల్వే అధికారులు

September 10, 2019

దసరా, దీపావళి, క్రిస్మస్‌, ‌న్యూ ఇయర్‌ ‌సందర్భంగా పలు మార్గాల్లో 78 ప్రత్యేక రైళ్లు నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. నల్లగొండ, గుంటూరు, విజయనగరం, భువనేశ్వర్‌ ‌మార్గంలో కాచిగూడ – టాటానగర్‌, ‌టాటానగర్‌ – ‌కాచిగూడ మధ్య 26 సర్వీసులు, ఖమ్మం, రయనపాడు, దువ్వాడ, శ్రీకాకుళం, ఖుర్దారోడ్డు మార్గంలో సికింద్రాబాద్‌ – ‌భువనేశ్వర్‌, ‌భువనేశ్వర్‌ – ‌సికింద్రాబాద్‌ ‌మధ్య 36 సర్వీసులు, నల్లగొండ, గుంటూరు, పాలకొల్లు మార్గంలో నర్సాపూర్‌ – ‌హైదరాబాద్‌, ‌మధ్య 4 ప్రత్యేక సర్వీసులు నడిపించనున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌ – ‌విజయవాడ మధ్య 4 సర్వీసులు, మచిలీపట్నం – సికింద్రాబాద్‌, ‌సికింద్రాబాద్‌ – ‌మచిలీపట్నం మధ్య 8 సర్వీసులు రాకపోకలు కొనసాగుతాయని పేర్కొన్నారు.