Take a fresh look at your lifestyle.

పంట బకాయిల కోసం ఢిల్లీకి యుపి రైతుల ర్యాలీ

ఉత్తరప్రదేశ్‌కు చెందిన రైతులు ఢిల్లీ వైపుగా ర్యాలీ తీస్తున్నారు. భారతీయ కిసాన్‌ ‌సంఘటన ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతోంది. ఢిల్లీలోని కిసాన్‌ ‌ఘాట్‌ ‌దిశగా రైతులు వెళ్తున్నారు. చెరుకు పంట బకాయిలు చెల్లించాలని వాళ్లు డిమాండ్‌ ‌చేస్తున్నారు. ఇతర పంటలకు కూడా రుణమాఫీని ప్రకటించాలని కోరుతున్నారు. ఢిల్లీ-యూపీ బోర్డర్‌ ‌వద్ద ఉన్న ఘాజీపూర్‌లో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. కిసాన్‌ ‌ఘాట్‌ ‌వైపు వస్తున్న రైతులను అడ్డుకునేందుకు చర్యలు తీసుకున్నట్లు పోలీసులు చెప్పారు. తమ డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం తెలిపితే, తాము తిరిగి వెనక్కి వెళ్తామని భారతీయ కిసాన్‌ ‌సంఘ్‌ అధ్యక్షుడు పురన్‌ ‌సింగ్‌ ‌తెలిపారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy