వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

న్యూయార్క్‌లో నీర‌వ్‌!

April 28, 2018

వజ్రాల వ్యాపారీ నీరవ్‌ మోదీ భారత దర్యాప్తు సంస్థలకు చుక్కలు చూపిస్తున్నాడు. నిన్న మొన్నటి వరకు హాంకాంగ్‌లో సేద తీరుతున్నట్టు భావించిన ఈ బడా కేటుగాటు ఇప్పుడు అమెరికా చేరినట్లు సమాచారం. ఆ దేశంలోని న్యూయార్క్‌లో మోదీ కనిపించినట్టు ఇండియా టుడే టీవీ చానల్‌ కథనం. న్యూయార్క్‌లోని లూయీస్‌ రీజెన్సీ హోటల్‌ పరిసరాల్లో మోదీ కనిపించినట్టు ఆ చానల్‌ తెలిపింది. తనను అప్పగించాలన్న భారత ప్రభుత్వ అభ్యర్థనని హాంకాంగ్‌ ప్రభుత్వం పరిశీలిస్తోందన్న వార్తలతో మోదీ న్యూయార్క్ వెళ్లిన‌ట్లు స‌మాచారం.