వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

న్యాయశాఖలో శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం :కలెక్టర్‌

August 2, 2019

పెద్దపల్లి టౌన్‌, : ‌జిల్లాలో వెనుకబడిన వర్గాలకు చెందిన న్యాయశాస్త్ర పట్టభద్రులు అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫ్‌ ‌జస్టిస్‌ ‌శిక్షణ పొందుటకు ఆసక్తి గలవారు ఆగస్టు16 లోపు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ‌శ్రీ దేవసేన గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాకు 2019-20 సం.కు అడ్మినిస్ట్రేటివ్‌ ‌జస్టిస్‌ ‌శిక్షణ పొందుటకు 3సీట్లు బిసిలకు కేటాయించినట్లు తెలిపారు. జూన్‌ 1 ‌నాటికి అభ్యర్థుల వయస్సు 23 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. బార్‌ ‌కౌన్సిల్‌లో సభ్యత్వం పొంది ఉండాలి. అభ్యర్థి కుటుంబ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాలలో రూ.1.50లక్ష లోపు, పట్టణ ప్రాంతాలలో రూ.2లక్షల లోపు ఉండాలి. ఎంపికైన అభ్యర్థులకు 3 సం. పాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో ప్రతి నెలకు రూ.1000 స్టైఫండ్‌, ఎన్‌రోల్‌మెంట్‌ ‌కింద రూ.585, లైబ్రరీ కింద రూ.3వేలు ఇవ్వనున్నారు. ఎంపికైన అభ్యర్థులను శిక్షణ కోసం జిల్లాలో పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్‌ ‌లేదా ప్రభుత్వ ఫ్లీడర్‌ ‌లేదా అసిస్టెంట్‌ ‌పబ్లిక్‌ ‌ప్రాసిక్యూటర్లను అనుబంధంగా పని చేయాలి. అర్హులైన అభ్యర్థులు నిర్ణీత నమూనాలో దరఖాస్తు చేసుకోని, ఆగస్టు 16 సాయంత్రం 5గంటల లోపు సర్టిఫికెట్స్, ‌పాస్‌పోర్ట్ ‌సైజ్‌ ‌ఫోటోను జతపరిచి జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి కార్యాలయం, పెద్దపల్లిలో సమర్పించాలని కలెక్టర్‌ ‌తెలిపారు.