Take a fresh look at your lifestyle.

నేలకొండపల్లి వద్ద ఘోర ప్రమాదం

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

నేలకొండపల్లి చెరువుకట్ట నక్కల తూము దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తు తెలియని వాహనం.. బైక్‌ ‌ను వేగంగా ఢీ కొట్టడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు చనిపోయారు. మృతులు నేలకొండపల్లికి చెందిన వెంకటేశ్వర్లు, పిచ్చమ్మ, కోదండరాం, ప్రణయ్‌గా గుర్తించారు. మృతదేహాలను ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నరు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం పాలైన సంఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి సపంలో మంగళవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానిక పోలీసుల కథనం ప్రకారం.. నేలకొండపల్లి శివారులోని ప్రభుత్వ రెండుపడకల ఇళ్ల కాలనీకి చెందిన పాలపాటి వెంకటేశ్వర్లు (40), అతని ఇద్దరు కుమారులు కొదండరాం (8), ప్రణయ్‌ (6), ‌తల్లి పిచ్చమ్మ (60) ముదిగొండలో శుభకార్యానికి ద్విచక్రవాహనంపై వెళ్లి వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతిచెందారు. సంఘటనా స్థలాన్ని ఖమ్మం ఏసీపీ వెంకట్రావు, కూసుమంచి సీఐ మురళి పరిశీలించారు. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy