Take a fresh look at your lifestyle.

నేడు హరియాణా సీఎంగా.. ఖట్టర్‌ ‌ప్రమాణ స్వీకారం!

హరియాణా ముఖ్యమంత్రిగా వరుసగా రెండో సారి మనోహర్‌ ‌లాల్‌ ‌ఖట్టర్‌ ‌ప్రమాణస్వీకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు ఖట్టర్‌ ‌ప్రమాణ స్వీకార కార్యక్రమం ఉంటుందని భాజపా వర్గాలు తాజాగా వెల్లడించాయి. మరోవైపు భాజపా శాసనసభాపక్షం శనివారం భేటీ అయి ఖట్టర్‌ను సభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అనంతరం శనివారం సాయంత్రం ఖట్టర్‌ ‌గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. ఇదిలా ఉంటే ప్రమాణస్వీకారం తర్వాత సీఎం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు వివాదాస్పద నేత, ఎమ్మెల్యే గోపాల్‌ ‌కందా మద్దతు తీసుకునే ఆలోచనే లేదని భాజపా నేత అనిల్‌ ‌విజయ్‌ ‌తెలిపారు. ఎవరికైనా మద్దతిచ్చే స్వేచ్ఛ గోపాల్‌ ‌కందాకు ఉందని, కానీ మేం ఆయన మద్దతు తీసుకోవాలని అనుకోవట్లేదని స్పష్టం చేశారు. ఆయనను ప్రభుత్వంలోకి తీసుకుంటామనే ప్రశ్నే లేదని అనిల్‌ ‌విజయ్‌ ‌తెలిపారు. హరియాణాలో బీజేపీకి సరియైన పార్టీకి సరైన ఆధిక్యం రాని హరియాణాలో జన్‌నాయక్‌ ‌జనతా పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు భాజపా రంగం సిద్ధం చేసుకున్న విషయం తెలిసిందే. కొత్త ప్రభుత్వానికి మళ్లీ ఖట్టరే నేతృత్వం వహించనున్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy