వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

నేడు సురవరం ప్రతాప్‌ ‌రెడ్డి వర్ధంతి తెలంగాణ వైతాళికులు సురవరం

August 24, 2019

తెలంగాణ ప్రాంతంలో సామాజిక, సాంస్క•తిక, రాజకీయ చైతన్యం కలిగించి, తెలంగాణ ప్రాంతంలో సామాజిక, సాంస్కతిక, రాజకీయ చైతన్యం కలిగించి, తెలంగాణ ప్రజలు ఆత్మాభిమాన కేతనం ఆవిష్కరించడానికి అంకితమయ్యాయి. 1934 మార్చి, ఏప్రిల్‌లో సురవరం సంపాదకత్వంలో ప్రచురితమైన గోలకొండ కవుల సంచిక తెలంగాణలో తెలుగు జీవించిలేదని ఆంధ్రులు కొందరు అహంకారంతో చేసిన అసమంజస వ్యాఖ్యకు చెంపపెట్టు సమాధానంగా సురవరం అహర్నిశల కృషితో ఆ సంచికను ప్రచురించారు. తెలంగాణ అస్తిత్వం కోసం గళమెత్తి, కలమెత్తిన మొట్టమొదటి తెలంగాణ ఉద్యమకారుడు సురవరం ప్రతాపరెడ్డి. ఆయన లేఖిని నుంచి పరవళ్లు తొక్కి వచ్చిన ప్రతి అక్షరంలో, శబ్దతతిలో తెలంగాణ తెలుగు భాషా నుడికారం, జనసత్తులు తొణికిసలాడినయ్‌. ‌తెలంగాణ తెలుగుపై 1948 ఏప్రిల్‌ 21‌వ తేదీన 1944 జూలై 7వ తేదీన దక్కన్‌ ‌రేడియో కేంద్రం నుంచి సురవరం ప్రసంగించారు. ఆయన రేడియో ప్రసంగాలు ఆణిముత్యాలు. మహబూబ్‌నగర్‌ ‌జిల్లా ఆలంపూర్‌ ‌తాలుకాలోని ఇటికెలపాడు గ్రామంలో 1896 మే 28న సురవరం ప్రతాపరెడ్డి జన్మించారు. నిజాం పాలనలో ఉర్దూ రాజ భాషగా నాడు చెలామణి అవుతుండేది తెలుగు పాఠశాలలు, పాఠకులు చాలా తక్కువగా ఉండేవారు. ఇలాంటి సందర్భాలలో తెలుగు భాష ప్రచారానికి గాను తెలంగాణ ప్రాంతాల్లో పాఠశాలల ఏర్పాటుకు, ప్రజల్ని జాగృతం చేయడానికి వీలుగా తెలంగాణ ప్రాంతంలో నిజా నిరంకుశ పాలనలో తెలుగువారి అణచివేతను వ్యతిరేకిస్తూ ఆయన ప్రజల్ని చైతన్యవంతుల్ని చేసేందుకు తెలుగుభాష సంస్క•తుల వికాసానికి ఎనలేని కృషి చేశారు. 1920లో సురవరం ప్రతాపరెడ్డి సంస్క•తం రెండవ భాషగా మద్రాసులో బిఎ డిగ్రీ పొందారు. 1922 ఎఫ్‌ఎల్‌, 1924‌లో బిఎల్‌ ‌డిగ్రీలు ఆయనకు లభించాయి. 30 ఏళ్లైనా నిండని యువ ప్రాయంలో ఆయన గోలకొండ పత్రిక సంపాదకుడై పేదరికం బాధలు అనుభవించాడు. 1925 మే 3వ తేదీన గోలకొండ పత్రిక ఒక ద్వైవారపత్రికగా స్థాపించారు. గోలకొండ పత్రిక స్థాపనలో రాజాబహద్దూర్‌ ‌వెంకట్రామరెడ్డి సహాయం సురవరం తీసుకున్నారు. గోలకొండ పత్రికలో తన సంపాదకీయాలు, ప్రత్యేక వ్యాసాలు రాసి తెలుగు భాషాభిమానులైన తెలుగువారందర్ని చైతన్యవంతుల్ని చేయడానికి పూనుకున్నారు. ఆయన నైజాం నిరంకుశ పాలనను విమర్శిస్తూ నిర్భయంగా ఎన్నో వ్యాసాలు రాశారు. ఆనాటి జమీందార్లు, దేశ్‌ముఖ్‌లు ప్రజల్ని ఎలా పీడిస్తున్నారు… తదితర విషయాలను గోలకొండ పత్రికలో నిక్కచ్చిగా వ్యాసాలు రాశారు. ని•జాం ప్రభుత్వ నిరంకుశ, ప్రజావ్యతిరేక చర్యలను ఎదుర్కోవడానికి గోలకొండ పత్రికను ఒక ఆయుధంలా సురవరం ఉపయోగించారు. 1939 ఆగస్టు నుంచి అధికారికంగా గోలకొండ పత్రికకు ఇరవై ఏళ్లు ఆయనే సంపాదకుడు ఆ 20 ఏళ్లలోనే రెండవ ప్రపంచయుద్ధం ముగిసింది. క్విట్‌ ఇం‌డియా ఉద్యమం నడిచింది. దేశం వాకిటిలోనికి స్వాతంత్య్రం వచ్చింది. నిజాం నిరంకుశ పాలనలో హైదరాబాద్‌ ‌సంస్థానం ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం అగ్నిగుండమైంది. ఆంక్షలు, నిర్బంధాలు, అరాచకత్వం బుసలు కొడుతున్న పరిస్థితిలో పౌరహక్కులు మృగ్యమైన గడ్డురోజుల్లో గోలకొండ పత్రికకు సంపాదకత్వం వహించడం చెప్పకోదగింది. సురవరం బహుభాషలలో ఉద్దండుడయిన సాహిత్యవేత్త, పరిశోధకుడు. ఆయన తమ కలానికి ఎన్నడూ విశ్రాంతి ఇవ్వలేదు. ఎక్కువ కాలం జీవించకపోవడం తెలంగాణ దురదృష్టం. ఆయన 1953 ఆగస్టు 25వ తేదీన దివంగతులయ్యారు. తెలంగాణ వైతాళికులు సురవరం ప్రతాప్‌రెడ్డి తెలుగు ప్రజల సామాజిక జీవనాన్ని ‘ఆంధ్రుల సాంఘిక చరిత్ర’ గ్రంథంలో అత్యాధునిక దృక్కోణంలో వివరించారు. తెలుగులో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన మొదటి గ్రంథం ఇది.

– కొలనుపాక కుమారస్వామి
వరంగల్‌,
‌ఫోన్‌ : 9963720669