Take a fresh look at your lifestyle.

నేడు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

దివ్యాంగుల హక్కులను కాపాడటం మన బాధ్యతఅన్ని అవకాశాలు, సౌకర్యాలు ఉన్న వ్యక్తి సాధించేది విజయం అయితే, ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొంటూ అవరోధాలను, సౌకర్యాలను సోపానాలుగా మార్చుకొని, ఒక వ్యక్తి సాధించే విజయం ‘చరిత్ర’ గా నిలుస్తుంది. బ్రెయిలీ, స్టీఫెన్‌ ‌హాకింగ్‌, ‌హెలెన్‌ ‌కిల్లర్‌, ‌సుధాచంద్రన్‌, ‌వంటి వారెందరో ఇలాంటి చరిత్ర సృష్టించిన వారే. వీరి విజయాలు దివ్యాంగులకే కాదు సామాన్యులకు సైతం ఆదర్శప్రాయం. ఈ విజయాలను ప్రపంచానికి మరింతగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం దివ్యాంగుల చట్టం-2016ను రూపొందించింది.
మన శరీరం లోని ప్రతి అవయవం దేనికదే ప్రత్యేకమైనది. మనిషి సంపూర్ణంగా జీవించాలంటే ప్రతి అవయము పనిచేయాల్సిందే. తన విధులు తప్పకుండా నిర్వహించాల్సిందే. కొంతమందిలో కొన్ని అవయవాలు పాక్షికంగా లేదా శాశ్వతంగా పని చేయక పోయే స్థితిని అంగవైకల్యం లేదా డిజెబిలిటి అంటారు. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 100 కోట్ల మంది దివ్యాంగులు(వికలాంగులు) ఉన్నారు.భారత దేశంలో వికలాంగులు 2.68 కోట్లకు పైగానే ఉన్నారు. దివ్యాంగులు తక్కువగా ఉన్న రాష్ట్రం తమిళనాడు. వివిధ రకాల వైకల్యాలతో ఉన్న దివ్యాంగుల సంఖ్య భారతదేశ జనాభాలో 2.21 శాతం ఉంది. దివ్యాంగులు రెండు రకాలు. శారీరక వైకల్యం కలిగిన వారు మానసిక వైకల్యం కలిగిన వారు. మొత్తం దివ్యంగులలో 20.3 శాతం మంది కదలికలకు, 18.9 శాతం మంది వినికిడి, 18.8 శాతం మంది దృష్టి లోపం, కలిగినవారు ఉన్నారు. తెలంగాణలో దివ్యాంగులు ఎక్కువగా హైదరబాద్‌ ‌లోనూ, అతి తక్కువగా నిజామాబాద్‌లోనూ ఉన్నారు. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 3‌ను వికలాంగుల అంతర్జాతీయ దినోత్సవంగా పాటించాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసింది. ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీ తీర్మానం సిఫారసుతో అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం (ఐడిపిడి) 1992లో మొదలైంది. 1998 నుండి సమాజం మరియు అభివృద్ధి యొక్క అన్ని రంగాలలో వికలాంగుల హక్కుల రక్షణ, సామాజిక భద్రత శ్రేయస్సును ప్రోత్సహించడం మరియు రాజకీయ, సామాజిక వంటి అన్ని అంశాలలో వికలాంగుల పరిస్థితిపై అవగాహన పెంచడం, ప్రజలను చైతన్యం చేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 3‌న దీనిని జరుపుకుంటారు. ఈ 2019 సంవత్సరాన్ని ‘ది ఫ్యూచర్‌ ఈజ్‌ ‌యాక్సెస్‌’’ అనే నినాదంతో జరుపుకుంటున్నాము. 1976లో ఐక్యరాజ్య సమితి 1981 సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ వికలాంగుల సంవత్సరం’ గా ప్రకటించింది. 1983 నుండి 1992 వరకు ఐక్యరాజ్య సమితి వికలాంగుల దశాబ్దంగా ప్రకటించింది. అంధత్వ నిర్మూలనకు ‘జాతీయ అంధత్వ నివారణా కార్యక్రమం’’ 1976లో ప్రారంభం అయింది.
అన్ని అవకాశాలు, సౌకర్యాలు ఉన్న వ్యక్తి సాధించేది విజయం అయితే, ప్రత్యేక పరిస్థితులను ఎదుర్కొంటూ అవరోధాలను, సౌకర్యాలను సోపానాలుగా మార్చుకొని, ఒక వ్యక్తి సాధించే విజయం ‘చరిత్ర’ గా నిలుస్తుంది. బ్రెయిలీ, స్టీఫెన్‌ ‌హాకింగ్‌, ‌హెలెన్‌ ‌కిల్లర్‌, ‌సుధాచంద్రన్‌, ‌వంటి వారెందరో ఇలాంటి చరిత్ర సృష్టించిన వారే. వీరి విజయాలు దివ్యాంగులకే కాదు సామాన్యులకు సైతం ఆదర్శప్రాయం. ఈ విజయాలను ప్రపంచానికి మరింతగా పరిచయం చేయాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం దివ్యాంగుల చట్టం-2016ను రూపొందించింది.ఈ అంగవైకల్యం పుట్టుకతో రావొచ్చు లేదా మధ్యలో రావొచ్చు. ప్రమాదాల వలన, హానికర సూక్ష్మజీవుల వలన జన్యులోపాల వలన ఎక్కువగా అంగవైకల్యం సంభవించే అవకాశం ఉన్నది. భారత దేశంలో ఎక్కువగా, ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో పోలియో వలన అవిటి వాళ్ళుగా చాలా మంది మిగిలిపోతున్నారు. కొన్ని లోపాలను పూర్తిగా నివారించడం సాధ్యం కాదు. ఆధునిక టెక్నాలజీ, అవగాహనతో అధిగమించవచ్చు.
దివ్యాంగుల చట్టం 2016 ప్రకారం 21 వైకల్యాలను గుర్తించారు. అంధత్వం, కుష్టు, దృష్టిలోపం, వినికిడి లోపం, చలన వైకల్యం, మరుగుజ్జుతనం, బుద్ధిహీనత, మానసిక సమస్య, ఆటిజం, సెరిబ్రల్‌ ‌ప్లాసీ, మస్కులర్‌ ‌డిస్ట్రోఫీ, నాడీ సంబంధిత సమస్యలు, స్పెసిఫిక్‌ ‌లెర్నింగ్‌ ‌డిజెబిలిటీ, మల్టిపుల్‌ ‌సిరోసిస్‌, ‌మాట్లాడలేకపోవడం, తలసేమియా, హిమోఫీలియా, సికిల్‌ ‌సెల్‌ ‌డిసీజ్‌, ‌మల్టిపుల్‌ ‌డిజెబిలిటీస్‌, ‌యాసిడ్‌ ‌దాడి బాధితులు, పార్కిన్సన్స్ ‌బాధితులు వీటి కిందికి వస్తాయి. దివ్యాంగుడిగా గుర్తించాలంటే కనీసం 40 శాతం వైకల్యం ఉండాలి. అలాగే సదరం సర్టిఫికేట్‌ ‌పొంది ఉండాలి. దివ్యాంగులపై ఎవరైనా వివక్షతో ప్రవర్తిస్తే వారికి జైలు శిక్ష లేదా జరిమానా విధించవచ్చు. ఆరు నెలల నుంచి రెండు సంవత్సరాల వరకు జైలుశిక్ష లేదా పది వేల నుంచి 5 లక్షల వరకు జరిమానా విధించవచ్చు. అంతేకాకుండా ఈ చట్టంలోని నియమాలను అతిక్రమించకూడదు. వివక్ష చూపడం ఇతర వివరాలను అతిక్రమిస్తే దాన్ని నేరంగా క్రిమినల్‌ ‌యాక్టివిటీగా పరిగణిస్తారు. 2016 చట్ట ప్రకారంగా ఏ రకమైన దివ్యాంగులు అయినప్పటికీ తమ పని తాము చేసుకోలేని వారు ప్రభుత్వ లావాదేవీలు నడిపించడానికి, ఇతరత్రా సౌకర్య సదుపాయాల కోసం ఇద్దరు సంరక్షకులను నిర్మించుకోవడానికి అనుమతిస్తుంది. ఈ చట్టం ప్రకారం విద్య, ఉద్యోగాల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్లు కేటాయించడం, గరిష్ట వయోపరిమితికి ఐదు సంవత్సరముల సడలింపు ఇవ్వడం జరిగింది. ఒకసారి వికలాంగునిగా గుర్తింపు పొందితే అది దేశవ్యాప్తంగా వర్తిస్తుంది. ఈ చట్టం ప్రకారం జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో దివ్యాంగుల ప్రయోజనం కొరకు నిధులు కేటాయించాలి.
దివ్యాంగులు ఎప్పటికీ ఇంటి వద్దనే ఉండకూడదు. బాహ్య ప్రపంచంలో మెదులుతూ ఉండాలి. లేదంటే వారికి మానసిక, శారీరక సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. చాలా మందికి దివ్యాంగుల సమస్యలపై అవగాహన లేదు. సమాజంలో దివ్యాంగులను మనతో సమానంగా చూసినప్పుడు మాత్రమే వారి ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం కాపాడినవారమౌతాము. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కార్యకర్తలు దివ్యాంగులలో ఆత్మస్థైర్యం నింపాలి. దివ్యాంగులకు అన్నీ విధాలా న్యాయం జరగాలి. చట్టాలు పటిష్టంగా అమలు పరచాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రత్యేక సలహా సంఘాలను ఏర్పాటు చేసి వారికి చేయూతనివ్వాలి. వికలాంగుల పట్ల దయాగుణం చూపేకన్నా వీలైతే వారికి సహాయం చేసి వారి ఎదుగుదలకు తోడ్పడాలి. వారిని మనతో సమానంగా మనుషులుగా గుర్తించి వారి హక్కులను కాపాడుదాం.
నెరుపటి ఆనంద్‌
ఉపాధాయులు
టేకుర్తి
9989048428

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy