వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

నేడు నగరంలో భారీ మారథాన్‌

August 24, 2019

‌దాదాపు 42కి.మేర పరుగు పలుమార్గాల్లో ట్రాఫిక్‌ ఆం‌క్షలు
హైదరాబాద్‌ ‌రన్నర్స్ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో 42 కి.ల మేర మారథాన్‌ ‌నిర్వహిస్తున్నారు. నెక్లెస్‌ ‌రోడ్డులో ప్రారంభం అయ్యే మారథాన్వివిధ మార్గాల ద్వారా గచ్చిబౌలి బాలయోగి స్టేడయం వరకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా సైబరాబాద్‌లో ట్రాఫిక్‌ ‌మళ్లింపులు ఉంటాయని సైబరాబాద్‌ ‌సీపీ సజ్జనార్‌ ‌తెలిపారు. ఈ మారథాన్‌లో సుమారు 20వేల మందికి పైగా పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 5గంటలకు నెక్లెస్‌ ‌రోడ్డులోని పీపుల్స్ ‌ప్లాజా వద్ద పరుగు ప్రారంభమై వివిధ ప్రాంతాలను కలుపుతూ.. సాగుతుందన్నారు. ఆయా ప్రాంతాల్లో ప్రజలు, వాహనదారులు ట్రాఫిక్‌ ‌మళ్లింపులను పరిగణలోకి తీసుకొని పోలీసులకు సహకరించాలని సైబరాబాద్‌ ‌ట్రాఫిక్‌ ‌డీసీపీ విజయ్‌కుమార్‌ ‌కోరారు. నెక్లెస్‌ ‌రోడ్డు పీపుల్స్ ‌ప్లాజా నుంచి ప్రారంభమై వివిధ మార్గాల ద్వారా గచ్చిబౌలి స్టేడియానికి మారథాన్‌ ‌చేరుకుంటుందన్నారు. 42 కిలోటర్ల ఫుల్‌ ‌మారథాన్‌, ‌హాఫ్‌ ‌మారథాన్‌తోపాటు మాదాపూర్‌ ‌హైటెక్స్ ‌నుంచి గచ్చిబౌలి స్టేడియం వరకు 10 కిలోటర్ల పరుగు ఉంటుందని డీసీపీ తెలిపారు. ఎయిర్‌టెల్‌ ‌హైదరాబాద్‌ ‌మారథాన్‌ 2019 ‌పోటీలు జరగనున్నాయి. పరుగులో పాల్గొనేందుకు ప్రస్తుతం వేల సంఖ్యలో వస్తున్నారు. పౌరాణిక, జానపద, కామిక్‌ ‌వేషధారణలతో క్రీడాకారులు కనువిందు చేయనున్నారు. 2011లో 1247 మందితో ప్రారంభమైన మారథాన్‌ ఈ ఏడాది 27,000 మంది ఇప్పటికే రిజిస్టేష్రన్‌ ‌చేసుకున్నారు. వీరిలో ఇతర రాష్టాల్రు, దేశాల నుంచి 3500 మంది ఉన్నారు. నెక్లెస్‌ ‌రోడ్డులో ప్రారంభం అయి ఖైరతాబాద్‌ ‌ఫ్లై ఓవర్‌, ‌రాజ్‌భవన్‌ ‌రోడ్డు, రాజీవ్‌గాంధీ స్టాచ్యూ, సీఎం క్యాంపు ఆఫీసు, పంజాగుట్ట ఫ్లై ఓవర్‌, శ్రీ‌నగర్‌ ‌కాలనీ, టీ జంక్షన్‌, ‌సాగర్‌ ‌సొసైటీ, ఎన్టీఆర్‌ ‌భవన్‌, ‌జూబ్లీహిల్స్ ‌చెక్‌పోస్టు, పెద్దమ్మ టెంపుల్‌, ‌కావూరి హిల్స్ ఎక్స్‌రోడ్‌, అక్కడ నుంచి లెప్ట్ ‌టర్న్ ‌తీసుకొని మాదాపూర్‌ ‌పోలీస్‌స్టేషన్‌ ‌నుంచి ఇమేజ్‌ ‌హాస్పిటల్‌, ‌సైబర్‌ ‌టవర్స్, అక్కడి నుంచి లెప్ట్ ‌టర్న్ ‌తీసుకొని కేఫ్‌సీ, ట్రిడెంట్‌ఈ ‌హోటల్‌, ‌లెమన్‌‌ట్రీ, మైండ్‌స్పేస్‌ అం‌డర్‌ ‌పాస్‌ ‌ద్వారా ఐకియా, మై హోం , బయోడైవర్సీటీ ఎక్స్‌రోడ్‌, అక్కడి నుంచి రైట్‌ ‌టర్న్ ‌తీసుకుని సైబారాబాద్‌ ‌పోలీస్‌ ‌కమిషనర్‌ ‌కార్యాలయం, గచ్చిబౌలి ఫ్లై ఓవర్‌ ‌రైట్‌ ‌సైడ్‌ ‌నుంచి ఇందిరానగర్‌, ‌హిమగిరి హాస్పిటల్‌, ఐఐటీ జంక్షన్‌, ‌విప్రో వద్ద రైట్‌ ‌టర్న్ ‌తీపుకొని క్యూ సిటీ, గౌలిదొడ్డి, గోపన్నపల్లి ఎక్స్‌రోడ్‌, అక్కడ రైట్‌ ‌టర్న్ ‌తీసుకొని హెచ్‌సీయూ వెస్ట్ర ‌గేట్‌, ‌యూనివర్సిటీ రెండవగేట్‌ ‌వద్ద రైట్‌ ‌టర్న్ ‌తీసుకొని గచ్చిబౌలి స్టేడియం గేట్‌ ‌నెంబర్‌-2 ‌నుంచి హెచ్‌సీయూ రైట్‌ ‌టర్న్ ‌తీసుకున్న రన్నర్‌లు చివరకు మధ్యాహ్నం 12:00గంటలకు గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంకు చేరుకోవడంతో పరుగు ముగుస్తుందని తెలిపారు. కావూరి హిల్స్ ‌జంక్షన్‌ ‌నుంచి కొత్తగూడ జంక్షన్‌ ‌వయా సైబర్‌ ‌టవర్స్ ‌ఫ అల్విన్‌ ‌జంక్షన్‌ ‌టూ గచ్చిబౌలి వయా కొత్తగూడ ఫజేఎన్‌టీయూ కూకట్‌పల్లి నుంచి బయోడైవర్సిటీ జంక్షన్‌ ‌ఫగుల్మార్‌ ‌పార్కు జంక్షన్‌ ‌టూ బయోడైవర్సిటీ జంక్షన్‌ ‌గోపన్‌పల్లి గచ్చిబౌలి విప్రో నుంచి ట్రిపుల్‌ ఐటీ జంక్షన్‌ ‌మార్గాల్లో ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు ట్రాఫిక్‌ ఆం‌క్షలు అమల్లో ఉంటాయని డీసీపీ విజయ్‌కుమార్‌ ‌తెలిపారు.