Take a fresh look at your lifestyle.

నేడు దాశరథి రంగాచార్య జయంతి

చిన్నతనం నుంచే అన్యాయాన్ని ఎదిరించే తత్వం
ఆయనకు విద్యార్థి దశ నుండే అన్యాయాలను ఎదిరించే తత్వం అలవడింది. రంగాచార్య 6వ తరగతి చదువుతున్నప్పటి దశలోనే స్కూలు విద్యార్థులను కూడగట్టి సమ్మెకు దిగారు. దీనికి నాయకత్వం వహించినందుకు ఆయనను పాఠశాల నుండి బహిష్కరించారు. అంతేగాకుండా నిజాం రాష్ట్రంలోని ఏ పాఠశాలలోను, విద్యా సంస్థల్లోనూ చేర్చుకోకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి కాలంలో జరిగిన, అనేకానేక నిజాం వ్యతిరేక పోరాటాలలో రంగాచార్య పాల్గొన్నారు. దీంతో పోలీసులు ఆయనకు 16 సంవత్సరాల జైలు శిక్ష విధించారు.
తెలంగాణ సాయుధ పోరాటం ఒక మహోజ్వల ఘట్టం.. తెలంగాణ అనగానే అనేక పోరాటాలు, ఉద్యమాలు గుర్తుకు వస్తాయి. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటం గురించి ప్రస్థావించకుండా తెలంగాణ చరిత్ర సమస్తం కాదు. తెలంగాణ చరిత్రలో ఇక్కడి కవులు సాయుధ పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని జైలు శిక్షలను అనుభవించారు. రచనలలో ఏదైతే నాడు రాశారో దాని ప్రకారమే జీవితం గడిపిన నిబద్ధతను చాటుకున్నారు. ప్రజాకవి కాళోజీ, హిరాలాల్‌ ‌మోరియా, వట్టికోట ఆళ్వార్‌ ‌స్వామి, మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు ఇలా అనేక మంది నిర్బంధాలను ఎదుర్కొన్నారు. ఇదే కోవకు చెందినవారు దాశరథి రంగాచార్య. ఆయనకు విద్యార్థి దశ నుండే అన్యాయాలను ఎదిరించే తత్వం అలవడింది. రంగాచార్య 6వ తరగతి చదువుతున్నప్పటి దశలోనే స్కూలు విద్యార్థులను కూడగట్టి సమ్మెకు దిగారు. దీనికి నాయకత్వం వహించినందుకు ఆయనను పాఠశాల నుండి బహిష్కరించారు. అంతేగాకుండా నిజాం రాష్ట్రంలోని ఏ పాఠశాలలోను, విద్యా సంస్థల్లోనూ చేర్చుకోకూడదని ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి కాలంలో జరిగిన, అనేకానేక నిజాం వ్యతిరేక పోరాటాలలో రంగాచార్య పాల్గొన్నారు. దీంతో పోలీసులు ఆయనకు 16 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. అయితే ఆయనకు మైనారిటీ తీరనందు వల్ల జైలు శిక్ష నుంచి తప్పించబడ్డారు. తెలంగాణ పోరాటం నాటి పరిస్థితులను గురించి, నిజాం ఆకృత్యాల గురించి, నాటి బానిస పద్దతుల గురించి, ఆయన నాడు చూసినవి, అనుభవించినవి ఆయన రచనల్లో, ఆయన నవలల్లో కళ్లకు కట్టినట్లు కనిపిస్తాయి. రంగాచార్య జీవితానుభవం బహు విస్తారమైనది. ఆ అనుభవ సారమే ఆయన నవలలు. ఆళ్వార్‌ ‌స్వామి ప్రజల మనిషి. తర్వాత కూడా ఎక్కువగా తెలంగాణకు సంబంధించిన రచనలు రాలేదు. ఈ లోటును భర్తీ చేసే క్రమంలో తెలంగాణ వెతల్ని రంగాచార్య తన నవలల్లో చిత్రించారు. రంగాచార్య ది.13-10-1964న ప్రారంభించిన రచన 10-11-1964న ముగించారు. నవలకు ‘రాతి మనుషులు’ అని పేరు పెట్టారు. ఒక వార పత్రికకు నవలల పోటీకి పంపాడు కానీ ‘రాతి మనుషులు’ టపాలో తిరిగి వచ్చింది. కనీసం సాధారణ ప్రచురణకూ నోచుకోలేదు. అలా ఉండగా రంగాచార్యకు నార్ల చిరంజీవితో పరిచయం అయింది. 1966లో ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో ‘భాగ్యనగరం’ అనే నాటకం సీరియల్‌గా వచ్చింది. ఆ పరిచయంతో మరుసటి రోజు ‘రాతి మనుషులు’ నవల వ్రాశానని అది చూడాలని రంగాచార్య నార్ల చిరంజీవికి అందించారు. గొప్ప నవల వ్రాశాడు రంగాచార్య అని వచ్చిన వాళ్లందరికీ వివరించి చెప్పారు నార్ల. అదే విధంగా దేవులపల్లి రామానుజరావుకు నవలను చూపించారు రంగాచార్య. తరువాత నీవు నిస్సందేహంగా గొప్ప నవల వ్రాసినావు. ఇది తెలంగాణమునకే కాదు,. ఆంధ్రజాతికే తలమానికమని అత్యంత ఉత్సాహం కనబరిచారు రామానుజరావు. ఆ ఊపులో చిరంజీవి అనేక పేర్లు సూచించారు. ‘చిల్లర దేవుళ్లు’గా పేరును దేవులపల్లి సహితంగా ఆమోదించారు. ‘చిల్లర దేవుళ్లు’ రెండు కాపీలు విశాలాంధ్ర ప్రచురణలకు పంపించారు దాశరథి. 1969లో వారిద్దరి నుంచి ఉత్తరాలు వచ్చాయి. విశాలాంధ్ర విజ్ఞాన సమితి ‘ప్రగతి’ అనే ప్రగతి శీల వారపత్రిక ప్రచురించ తలపెట్టారు. ‘చిల్లర దేవుళ్లు’ ప్రగతి వారపత్రికలో 21-3-1969 నుంచి 13-6-1969 వరకు వరుసగా పదమూడు వారాలు సీరియల్‌గా వచ్చింది. ‘చిల్లర దేవుళ్లు’ నవలను నిజాం నిరంకువ పాలనలో ఊరు పేరూ మాసిన ఆంధ్రజాతికి ఒక తీరూ తెన్నూ కల్పించిన ఆంధ్ర పితామహ, పద్మభూషణ మాడపాటి హనుమంతరావు పంతులుకు అంకితంగా సమర్పించారు దాశరథి. అప్పటికీ మాడపాటి ‘జీవించి ఉన్నారు’. ‘చిల్లర దేవుళ్లు’ 1938కి పూర్వపు తెలంగాణ ప్రజా జీవిత చిత్రణ. ‘చిల్లర దేవుళ్లు’ ప్రేమ కథ కాదు పెళ్లి. ‘చిల్లర దేవుళ్లు’ నవల ప్రధానాంశం కాదు. హైదరాబాద్‌ ‌విశ్వవిద్యాలయం హిందీ శాఖ నుంచి యూసుఫ్‌పాషా చిల్లర దేవుళ్లు – మైలా ఆంచల్‌ -‌తులనాత్మక పరిశీలన చేసి ఎమ్‌ఫిల్‌ ‌పొందారు. శ్రీ వెంకటేశ్వర, కాకతీయ, ఉస్మానియ విశ్వవిద్యాలయాల్లో చిల్లర దేవుళ్లుపై పరిశోధనలు జరిగియి. డిగ్రీలు లభించాయి. కాకతీయ విశ్వవిద్యాలయం ఎమ్‌ఏకు బెంగళూరు విశ్వవిద్యాలయం బీఏకు కొంతకాలం ‘చిల్లర దేవుళ్లు’ పాఠ్యాంశంగా ఉండింది. ఉస్మానియా విద్యార్థులు ఉద్యమం నిర్వహించి ‘చిల్లర దేవుళ్లు’ ఎమ్‌ఏకు పాఠ్యాంశంగా పెట్టించుకున్నారు. దాశరథి రంగాచార్య అర్థశతాబ్దంగా సాహిత్యంలో కృషి చేసి 1998 వరకు ఎనిమిది వేల పేజీలపైగా ముప్పయి పుస్తకాలు ప్రచురణ జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి ఇసుమంత సాయం కాని, ఆదరణకాని అభించలేదు. అందుకు దాశరథి రంగాచార్య అవగింజంత బాధపడ లేదు. ప్రభుత్వం ప్రతిభను కాక పైరవీని మాత్రమే గుర్తిస్తుందని దాశరథి అభిప్రాయం.
జయన్తి తే సుకృతి నోర ససిద్ధా: కవీశ్వరా:
నాస్తి తేషాయంశ: కాయే జరామరణజం భయం : భర్తృహరి
కవులు పుణ్య పురుషులు. వారు మంచి రచనలు చేస్తారు. వారు రసములను పండించగలరు. బంగారం చేసే అససిద్ధి వారికి ఉంది. కవుల కీర్తికాయానికి జరామరణ భయం లేనే లేదు. దాశరథి తెలంగాణలోని వరంగల్‌ ‌జిల్లా, మహబూబాబాద్‌ ‌తాలుకా చిన్న గూడురు గ్రామంలో తేదీ 24 ఆగస్టు 1928లో జన్మించారు. దాశరథి సోదరులు ఖమ్మం హైస్కూల్‌లో చదివారు. చిన్నతనంలో ఈ సమస్త సృష్టి సకల ప్రకృతి సొంతం.. సత్యం శివం సుందరం.. సమస్త ప్రాణి జాలం. ’లెక్కలేనన్ని జీవరాసుల్లో మానవుడు ఉత్తముడు, మహోత్తముడు, మహిన్వితుడు.. మానవుని మించిన మరో ప్రాణి ఈ విశ్వంలో విశ్వాంతరాళంలో ఎక్కడా లేడు..’ అని దాశరథి తన జీవన యానంలో పొందుపరిచాడు. ఆయన 87ఏళ్ల వయస్సులో ఇక సెలవంటూ… 8 జూన్‌ 2015‌న దివికేగారు.

– కొలనుపాక కుమారస్వామి
సెల్‌ : 9963720669

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!