హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16 : సీఎం కేసీఆర్ పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్ మహానగరంలో ఘనంగా నిర్వహించేందుకు బిఆర్‌ఎస్ పార్టీ భారీగా ఏర్పాట్లు చేసింది. నగర వ్యాప్తంగా పుట్టినరోజు వేడుకలను నిర్వహించనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. నెక్లెస్ రోడ్‌లోని సంజీవయ్య పార్ పక్కన ఉన్న థ్రిల్ సిటీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో కళాకారులతో సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. సంక్షేమ పథకాలపై జబర్ధస్త్ కళాకారులతో ప్రత్యేక కార్యక్రమం ఉంటుంది. భారీ కేక్ కటింగ్, భోజన ఏర్పాట్లు. వికలాంగులకు ట్రై సైకిళ్లు పంపిణీ జరుగుతంది. అలాగే సికింద్రాబాద్ శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆయుష్షు హోమం చేపట్టనున్నారు.
బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో మృత్యుంజయ హోమం, రాజశ్యామల యాగం నిర్వహించనున్నారు. సికింద్రాబాద్ గణెశ్ ఆలయంలో చండీయాగం, జూబ్లీహిల్స్ పెద్దమ్మ ఆలయంలో మేయర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో అభిషేకం చేపట్టనున్నారు. సికింద్రాబాద్ గణెశ్ దేవాలయంలో డిఫ్యూటీ మేయర్ మోతె శ్రీలత రెడ్డి ఆధ్వర్యంలో చండీయాగం నిర్వహిస్తారు. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో సీఎం కేసీఆర్ గోత్రనామాలతో అర్చన చేస్తారు. లాల్ దర్వాజ సింహవాహిని ఆలయంలో లక్ష పుష్పార్చన నిర్వహిస్తారు. కింద్రాబాద్ క్లాక్ టవర్ వద్ద ఉన్న వెస్లీ చర్చిలో, అబిడ్స్‌లోని వెస్లీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. నాంపల్లి దర్గాలో, నల్లగుట్ట మసీదులో చాదర్ సమర్పణ జరుగనుంది. వి•ర్ పేట గురుద్వార్‌లో హర్దాస్, గౌలిగూడ గురుద్వార్‌లో హర్దాస్ ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. గాంధీ హాస్పిటల్‌లో బీఆర్‌ఎస్ నాయకులు గుర్రం పవన్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పండ్లు, బ్రెడ్ పంపిణీ చేస్తారు.
మాజీ కార్పొరేటర్ శేషుకుమారి ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ చేస్తామని తెలిపారు. అన్ని నియోజకవర్గాలు, డివిజన్‌లలో రక్తదానం, పండ్లు పంపిణీ, కేక్ కటింగ్ కార్యక్రమాల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. మొక్కలు నాటడం..పలు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు నాయకులు, పార్టీ శ్రేణులు సమాయత్త మవుతున్నారు. వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్ నగరంలోని ప్రధాన కూడళ్లు, వీధులు గులాబీరంగును పులుముకున్నాయి. ’దేశ్ కీ నేత కేసీఆర్’ వంటి నినాదాలతో ఎటుచూసినా హోర్డింగ్‌లు, ప్లెక్సీలే దర్శనమిస్తున్నాయి. దేశ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సీఎం కేసీఆర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ బిఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు, నేతలు రహదారుల వెంట భారీ ప్లెక్సీలను ఏర్పాటు చేశారు.