వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

నేడు అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం

September 22, 2019

మదిలోని భావాలు కనిపిస్తాయి

జీవ ప్రపంచంలో మనిషి పొందిన గొప్ప వరం మాట్లాడడం. మాటలు రాని, శబ్దం వినబడని వారికి కొన్ని సంకేతాల రూపంలో భావాన్ని వ్యక్త పరచడానికి, వారికి కనపడే విధంగా అర్థం అయ్యే విధంగా సంకేతాల రూపంలో వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇలాంటి వారి కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్‌ 23‌న ప్రపంచ వ్యాప్తంగా ‘అంతర్జాతీయ సంకేత భాషల దినోత్సవం’’ జరుపుకుం టారు.. దీనిని (ఐ.డి.ఎస్‌.ఎల్‌) ‘ఇం‌టర్నేషనల్‌ ‌డెఫ్‌ ‌సైన్‌ ‌లాంగ్వేజెస్‌’’ అని పిలుస్తారు. దీనిని ‘అంతర్జాతీయ చెవిటి వారోత్సవాల’’ కార్యక్రమంతో కలిపి జరుపుకుంటారు. 2019 సంవత్సరానికి గాను ‘సంకేత భాష-అందరి హక్కు’’ అనే నినాదంతో జరుపుకుంటున్నాము. సహజమైన భాషలకు అనుగుణంగా ఈ సంకేత భాషలు ఉంటాయి. సంకేత భాషలు పూర్తిగా సహజమైన భాషలు, నిర్మాణాత్మకంగా మాట్లాడే భాషలకు భిన్నంగా ఉంటాయి. అంతర్జాతీయ సంకేత భాష కూడా ఉంది, ఇది చెవిటివారు అంతర్జాతీయ సమావేశాలలో మరియు అనధికారికంగా ప్రయాణించేటప్పుడు మరియు సాంఘికీకరించేటప్పుడు ఉపయోగిస్తారు. నిజానికి అనర్ఘళంగా మాట్లాడడం అనేది ఒక కళ. ఇది అందరికీ రాదు కొందరికే సాధ్యం. మూగ, చెవిటి వారికి అర్థమయ్యేలా ఈ సంకేత భాష మాట్లాడడం కూడా ఒక కళ. కొందరిలో వినికిడి లోపం ఉండడం వలన వారికి సంకేతాల రూపంలో భావాన్ని తెలియపరచ వలసి వుంటుంది. వరల్డ్ ‌ఫెడరేషన్‌ ఆఫ్‌ ‌ద డెఫ్‌ ‌ప్రకారంగా ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 72 మిలియన్ల చెవిటి వారు ఉన్నారు. వారిలో 80 శాతం కంటే ఎక్కువ మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో నివసిస్తున్నారు. దాదాపుగా 300 కంటే ఎక్కువ విభిన్న సంకేత భాషలను ఉపయోగిస్తున్నారు. అంతర్జాతీయ సంకేత భాష సహజమైన భావాలను నిర్మాణాత్మకంగా మాట్లాడే భాష. మొదట అంతర్జాతీయ సంకేత భాష దినోత్సవం 23 సెప్టెంబర్‌ 2018‌న జరుపుకున్నారు. ఈ సంకేత భాష నాణ్యమైన విద్య, ఉపాధి మరియు సమాజ జీవితంతో సహా అన్ని రంగాలపై పూర్తి అవగాహన మరియు సమానత్వాన్ని పెంపొందిస్తుంది. లోపాలతో పుట్టడం వారి తప్పు కాదు. వారి హక్కులను కాపాడడం మన బాధ్యత.

– నెరుపటి ఆనంద్‌,
ప్రభుత్వ ఉపాధ్యాయులు, టేకుర్తి,
9989048428