Take a fresh look at your lifestyle.

నేటి నుండి పాఠశాలలో ఆన్‌లైన్‌ ‌విద్యా బోధన ప్రారంభం

రాష్ట్ర వ్యాప్తంగా 2020 – 21 విద్యా సంవత్సరానికి గాను ఒకటి నుండి పదో తరగతి వరకు విద్యార్థులకు ఆన్‌లైన్‌ ‌తరగతులు బోధన సెప్టెంబర్‌ 27 ‌నుండి ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఇందుకుగాను ఆన్‌లైన్‌ ‌బోధనకు కావలసిన మౌలిక వసతులు ఆయా పాఠశాలల్లో సమకూర్చుకోవాలని ఇప్పటికే అన్ని పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ‌పాఠశాలలో కెజి నుండి ఆన్‌లైన్‌ ‌బోధన ప్రారంభించాలని ప్రాథమిక విద్య శాఖ అధికారులు పేర్కొన్నారు. అయితే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆన్‌లైన్‌ ‌సేవలను విస్తరించడానికి రాష్ట్ర ప్రభుత్వం కరోనా కారణంగా ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రైవేట్‌, ‌ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే అధ్యాపకులు 27 నుండి గురువారం విధులకు హాజరు కావాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్‌ ‌మంగళవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆన్‌లైన్‌ ‌బోధన అనుసరించాల్సిన మార్గదర్శకాలను కూడా విడుదల చేశారు. తేదీ నుండి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌ ‌ద్వారా పాఠాలు బోధించాల్సి ఉంటుంది సంబంధించి పాఠ్యాంశాల రూపొందించుకుని గురువారం నుంచి ఉపాధ్యాయులు హాజరుకావాలని విద్యాశాఖ సూచించారు. డిషాట్‌, ‌యాదగిరి చానల్‌ ‌ద్వారా టీవీలో ప్రతిరోజు పాఠ్యాంశాలు ప్రసారమవుతాయని విద్యార్థులు సన్నంద అయ్యేలా ఉపాధ్యాయులు తగిన ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యాశాఖ పేర్కొంది. ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులకు గంటన్నర, ఆరు నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు 9 నుంచి 10 వ తరగతి విద్యార్థులకు మూడు గంటల పాటు ఆన్‌లైన్‌లో పాటాలు బోధిస్తారని, ఇందుకు అనుగుణంగా విద్యార్థులు ఆయా సమయాలలో టీవీల ముందు కూర్చొవాలని, ఇందుకుగాను ఉపాధ్యాయులు విద్యార్థులకు తగిన సూచనలు చేయాలని విద్యాశాఖ పేర్కొంది. యాదగిరి టీవీ ఛానల్‌ ‌నుండి ప్రసారం చేస్తారని 71 శాతం మంది విద్యార్థులకు టివిలు అందుబాటులో ఉన్నాయని జిల్లా విద్యాశాఖ అధికారులు ఇటీవల జరిపిన సర్వేలో వెల్లడైంది. అలాగే స్మార్ట్ ‌ఫోన్లు, ఇంటర్నెట్‌ ‌కలిగిన తల్లిదండ్రులు 8 శాతం మంది ఉన్నారని గుర్తించారు. జిల్లాలో 470 ప్రభుత్వ పాఠశాలకు గాను 34800 ఎనిమిది మంది విద్యార్థులు ఉండగా ఇందులో 7,208ల మంది విద్యార్థులకు టీవీ, స్మార్ట్ ‌ఫోన్‌ ఇం‌టర్నెట్‌ ‌సౌకర్యం అందుబాటులో లేదని సర్వే ద్వారా తెలుస్తోంది.

కాబట్టి వీరికి పాఠాలు ఎలా చేరుతాయి అన్నది ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. ఇదిలా ఉండగా జిల్లా ప్రైవేట్‌ ‌పాఠశాలల్లో వీటిలో 60 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇప్పటికే ప్రైవేట్‌ ‌పాఠశాలలో ఆన్‌లైన్‌ ‌తరగతులు నిర్వహిస్తుండగా, ప్రైవేట్‌ ‌లోను ప్రభుత్వపు మార్గదర్శకాలను అమలు చేయుటకు విద్యాశాఖ అన్ని జిల్లా కేంద్రాలలోని జిల్లా విద్యాధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు స్థానిక పాఠశాలలో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించే విధంగా జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది, దీంతో పాటు ఇంటర్‌, ‌డిగ్రీ అధ్యాపకులు కూడా గత తొమ్మిది నెలలుగా మూతబడిన జూనియర్‌, ‌డిగ్రీ కళాశాలలు కూడా 27 నుండి తెరవాలని రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అయితే సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి ఆన్‌లైన్‌ ‌తరగతుల బోధనకు ఏర్పాటు చేసుకోవాలని ఇందుకు అధ్యా పకులు సద్ధం కావాల్సిన అవసరం ఉందని విద్యాశాఖ పేర్కొంది. డిగ్రీ ఇంటర్‌ ‌కళాశాలలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకులను రెన్యువల్‌ ‌చేయకపోవడంతో ఉమ్మడి జిల్లాలో 353 మంది ఆందోళన చెందు తున్నారు. 27  నుంచి కళాశాల ప్రారంభం కానున్న దృష్ట్యా రెన్యువల్‌ ‌చేయలేదని, అధ్యాపకులనందరికీ వెంటనే రెన్యువల్‌ ‌చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఒప్పంద అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో  అధ్యాపకులు కూడా వారం నుంచి విధులకు హాజరు కావాల్సి ఉంటుందని సమాచారం ఉన్నప్పటికీ. విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయ అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం రిజిస్టార్‌ ‌నుంచి ఇలాంటి ఉత్తర్వులు రాలేదని విశ్వవిద్యాలయ అధ్యాపకులు అంటున్నారు. ఏమైనప్పటికీ ఆన్‌లైన్‌ ‌బోధన విధానం నూటికి నూరు శాతం సక్సెస్‌ ‌కావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఇందుకు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో బోధన సక్రమంగా వినియోగించుకోవాలని, ఇందుకు విద్యార్థులను తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. టీవీలు, స్మార్ట్ ‌ఫోన్‌లేని విద్యార్థిని విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలలో కమ్యూనిటీ ఉండే గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉండే టీవీలను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. ఆన్‌లైన్‌ ‌బోధన విధానం విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావడానికి ప్రభుత్వం చేస్తున్న చర్యలు ఏ మేరకు విజయవంతం అవు•యని చాలామంది అంటున్నారు. 70 శాతం ఆన్‌లైన్‌ ‌తరగతులు బోధనకు అనుగుణంగా ఉన్నప్పటికీ మిగిలిన 30 శాతం మంది విద్యార్థులు నష్టపోయే అవకాశం లేకపోలేదని పలువురు అధ్యాపకులు వాపోతున్నారు.

Get real time updates directly on you device, subscribe now.

Leave a Reply