Take a fresh look at your lifestyle.

నేటి నుంచి.. బ్రహ్మాండనాయకుని బ్మ్రత్సవాలు

సర్వాంగసుందరంగా తిరుమల ముస్తాబు
నేడు అంకురార్పణతో ప్రారంభంతిరుమల, సెప్టెంబర్‌ 28 : ‌
బ్రహ్మాండనాయకుని బ్మ్రత్సవాలకు తిరుమల క్షేత్రం అంగరంగ వైభవంగా ముస్తాబయ్యింది. కళ్లు మిరుమిట్లు గొలిపేలా సర్వాంగ సుందరంగా సిద్దమైంది. టీటీడి చేసిన ఏర్పాట్లతో తిరుమల సౌందర్యవంతంగా మారింది. జీఎన్సీ టోల్‌ ‌గేటు దగ్గర నుండి మాడా వీధుల వరకు విద్యత్‌ ‌దీపాలంకరణతో వెంకన్న కొండ కనువిందు చేస్తోంది. మిరుమెట్లు గొలిపే విద్యుత్‌ ‌దీపాలంకరణల నడుమ తిరుమల క్షేత్రం శోభాయమానంగా మారింది. పార్కులు, వాటర్‌ ‌ఫౌంటెన్లు విద్యుత్‌ ‌కాంతుల నడుమ ప్రత్యేక అందాలను సంతరించుకున్నాయి. ప్రధాన కూడళ్ళలో భారీ కటౌట్‌లు, రోడ్లకు రెండు వైపులా ఎల్‌ఈడీ దీపాలంకరణ భక్తులను ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. వీటితో పాటు మాడా వీధుల్లో కూడా ఏర్పాట్లన్ని పూర్తయ్యాయి. గ్యాలరీలు, బారికేడ్లను సిద్దం చేశారు. వాహన సేవలను తిలకించేందుకు భారీ స్క్రీన్‌ ‌లను ఏర్పాటు చేశారు. మరోవైపు భక్తులను కనువిందు చేసేలా ఫలపుష్ప ప్రదర్శన శాల సిద్దమవుతోంది. నాలుగు యుగాలకు సంబందించిన కొన్ని ఘట్టాలను తెలిపేల కొన్ని సెట్టింగులను ఏర్పాటు చేసారు. ఇదిలావుంటే శ్రీవారి బ్మ్రత్సవాల్లో ఆగమోక్తంగా నిర్వహించే ధ్వజారోహణం కార్యక్రమం కోసం టిటిడి అటవీ విభాగం ఆధ్వర్యంలో పవిత్రమైన దర్భను సిద్ధం చేశారు. దర్భతో తయారుచేసిన చాప, తాడును టిటిడి డిఎఫ్‌వో శ్రీ డి.ఫణికుమార్‌నాయుడు ఆధ్వర్యంలో అటవీ విభాగం అధికారులు, సిబ్బంది ఊరేగింపుగా తీసుకొచ్చి శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్‌కు అందించారు. శ్రీవారి ఆలయంలో శాస్తోక్త్రగా నిర్వహించే కైంకర్యాలు, సేవలు, •మాల్లో దర్భను వినియోగిస్తారు. ఈ దర్భను తిరుమలలోని కల్యాణవేదిక ఎదురుగా గల టిటిడి అటవీ విభాగం నర్సరీల్లో పండిస్తారు. బ్మ్రత్సవాల కోసం బాగా పెరిగిన దర్భ అవసరమవుతుంది. ఈ దర్భను తిరుపతి సపంలోని వడమలపేట వ్యవసాయ పొలాల గట్ల నుండి సేకరించారు. ఈ దర్భను సేకరించిన తరువాత 15 రోజుల పాటు నీడలో ఆరబెడతారు. ఈ దర్భతో 22 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు చాపను, 200 అడుగుల తాడును తయారుచేస్తారు. దీనికోసం 10 రోజుల సమయం పడుతుంది. ధ్వజారోహణం సందర్భంగా ధ్వజస్తంభానికి ఈ చాపను, తాడును చుడతారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy