Take a fresh look at your lifestyle.

నేటి నుంచి గాంధీ హాస్పిటల్‌లో పూర్తి స్థాయి కోవిడ్‌ ‌వైద్య సేవలు

  • ఉత్తర్వులు జారీ చేసిన వైద్య ఆరోగ్య శాఖ
  • ప్రతీ 10 నిమిషాలకో కోవిడ్‌ ‌బాధితుడు
  • నాన్‌ ‌కోవిడ్‌ ‌విభాగాలను ఖాళీ చేయించిన అధికారులు

‌తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్‌ ‌కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్న దృష్ట్యా గాంధీ హాస్పిటల్‌ను పూర్తి స్థాయి కోవిడ్‌ ‌హాస్పిటల్‌గా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు శుక్రవారం వైద్య, ఆరోగ్య శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే రాష్ట్రంలో కోవిడ్‌ ‌వైద్య చికిత్సలు అందిస్తున్న గాంధీ హాస్పిటల్‌కు ప్రతీ 10 నిమిషాలకో బాధితుడు వైద్య సేవల కోసం వస్తున్నాడు. దీంతో శనివారం నుంచి ఓపి వైద్య సేవలు నిలిపివేయాలనీ, అత్యవసరమైనవి మినహా మిగతా శస్త్ర చికిత్సలను మాత్రమే గాంధీ హాస్పిటల్‌లో నిర్వహించనున్నారు. గాంధీలో ఇప్పటికే 450 మంది కోవిడ్‌ ‌బాధితుల చికిత్స పొందుతున్నారు. దీంతో ఈ హాస్పిటల్‌లో ఆక్సీజన్‌తో కూడి ఉన్న బెడ్స్ అన్నీ పూర్తిగా నిండినట్లయింది. దీనికి తోడు హాస్పిటల్‌లోని ఐపి బ్లాక్‌ ‌మొత్తం కోవిడ్‌ ‌పేషెంట్లతో నిండిపోయింది. గాంధీ హాస్పిటల్‌లో కోవిడ్‌ ‌చికిత్స కోసం గురువారం 150 మంది బాధితులు రాగా, శుక్రవారం ఆ సంఖ్య 250కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లోని ప్రధాన హాస్పిటల్స్ ‌గాంధీ,  కింగ్‌ ‌కోఠి, గచ్చిబౌలిలోని టిమ్స్ ‌హాస్పిటల్స్‌తో పాటు అన్ని జిల్లా కేంద్రాలలో కోవిడ్‌ ‌నిర్ధారణ పరీక్షలు, వైద్య చికిత్సలు అందిస్తున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ ఆయా హాస్పిటల్స్‌లో కోవిడ్‌ ‌బాధితులకు వైద్య చికిత్సలు అందేలా చర్యలు చేపట్టింది.

Leave a Reply