Take a fresh look at your lifestyle.

నేటి ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి సీఈవో రజత్‌ ‌కుమార్‌

‌రాష్ట్రంలో గురువారం జరగబోయే లోక్‌సభ ఎన్నికల కోసం అన్ని ఏర్పాటు పూర్తి చేశామని సీఈవో రజత్‌ ‌కుమార్‌ అన్నారు. డియాతో మాట్లాడిన రజత్‌.. ఉదయం 5.30కే పోలింగ్‌ ఏజెంట్లు పోలింగ్‌ ‌కేంద్రాల్లో ఉండాలన్నారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ ‌జరుగుతుంది. నిజామాబాద్‌ ‌నియోజక వర్గంలో మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్‌ ‌జరుగుతుంది. ఓటర్లు పోల్‌ ‌స్లిప్‌తో పాటు ఏదో ఒక గుర్తింపు కార్డు తీసుకెళ్లాలని సూచించారు. దాదాపు అందరికీ ఓటరు గుర్తింపు కార్డులు అందాయి. ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఓటు వేయొచ్చు. ఎన్నికల కోసం 145 కంపెనీల కేంద్ర బలగాలు మోహరి స్తున్నాయి. రేపు 3 లక్షల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారు. 55 వేల మంది రాష్ట్ర పోలీసులు ఎన్నికల విధుల్లో ఉంటారు. నిజామాబాద్‌లో ఒక్కో పోలింగ్‌ ‌కేంద్రంలో 12 ఈవీఎంల యూనిట్‌ను ఏర్పాటు చేశామని రజత్‌ ‌కుమార్‌ ‌వెల్లడించారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy