వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

నెహ్రూ, గాంధీలను వీడలేకపోతున్న కాంగ్రెస్‌

August 13, 2019

‌శతాధిక వయోవృద్ధ పార్టీగా కాంగ్రెస్‌కు పేరుంది. దానికి తగినట్లుగా వయస్సు మీరి, అనుభవజ్ఞులనేకులున్న పార్టీ కూడా కాంగ్రెసే. ఇంత సుదీర్ఘ చరిత్ర కలిగిన పార్టీని నడిపించగలిగిన సమర్థుడైన నాయకుడి కరువేర్పడిందిప్పుడా పార్టీకి. అంటే సమర్థులెవరూ ఆ పార్టీలోలేరని కాదు. కాంగ్రెస్‌ ‌పార్టీకి జాతీయ నాయకుడనేవాడు ఖచ్చితంగా నెహ్రూ లేదా గాంధీ కుటుంబానికి చెందినవాడే అయి ఉండాలన్న ఆలోచనే ఆ పార్టీని వెనక్కులాగుతోంది. స్వాతంత్య్రం వచ్చినప్పటినుండి ఒకరిద్దరు ఇతరులు పార్టీ సారథ్యాన్ని చేపట్టినా వారంతా ఈ రెండు కుటుంబాలకు చెందినవారి కనుసన్నల్లోనే కార్యక్రమాలను కొనసాగించడ మన్నది ఓ ఆనవాయితీగా మారింది. ఆ పార్టీ పగ్గాలు చేపట్టి దిశానిర్దేశం చేస్తాడని ఆ పార్టీ వర్గాలు చాలాకాలంగా రాహుల్‌గాంధీపైన ఆశలు పెట్టుకున్నాయి. కాని, రాహుల్‌ ‌మొదటి నుండీ పార్టీ పగ్గాలు చేపట్టే విషయంలో తన ఆనాసక్తతను కనబరుస్తూనే ఉన్నాడు. అయినా బలవంతంగానైనా ఆయన్ను కాంగ్రెస్‌ ‌పార్టీ జాతీయ అధ్యక్షుడి సింహాసనంపై కూర్చోబెట్టింది. ఆ పదవి చేపట్టిన తర్వాతైనా ఆయనలో మార్పు వస్తుందని ఆశించారు. కాని, ఆయన ధోరణిలో ఏమాత్రం మార్పురాలేదు సరికదా వేరే దిక్కుచూసుకోం డంటూ నైతికబాధ్యత వహిస్తూ అధ్యక్ష పదవినుంచి వైదొలగాడు. కాంగ్రెస్‌కు ఎప్పుడు కష్టకాలం వచ్చినా పైనచెప్పిన రెండు కుటుంబాలకు చెందిన వ్యక్తిని ముందుపెట్టి నడిపించడమన్నది దశాబ్ధాలుగా కొనసాగుతున్న తంతు. కాని, అసలే కష్టాల్లో ఉన్న కాంగ్రెస్‌పార్టీకి ఇప్పుడా అవకాశం లేకుండా పోయింది. రాహుల్‌గాంధీ ఆరునూరైనా కాంగ్రెస్‌ ‌సారథ్యాన్ని చేపట్టేదేలేదని ఘంటాపథంగా చెబుతూవస్తున్నాడు. వయోవృద్ధ నాయకులు మొదలు యువనాయకులు పలువురు ఆయన్ను బ్రతిమిలాడినంత పనిచేసినా తనమాటకు తిరుగులేదని భీష్మించుకుని కూర్చున్నాడు రాహుల్‌. ఈ ‌పరిస్థితిలోనైనా శతాధిక కాంగ్రెస్‌ ‌నెహ్రూ, గాంధీ కుటుంబాలకు అతీతంగా మరో వ్యక్తిని ఎంపికచేసుకుంటుందేమో అనుకుంటే ఆ జాడలు ఎక్కడా కనిపించడం లేదు. సమావేశాల మీద సమావేశాలు నిర్వహించి చివరకు తేల్చిందేమంటే ఆ కుటుంబానికే సారథ్యం అప్పగించడం కన్నా ప్రత్యమ్నాయం లేదన్నది. తాత్కాలికంగానైనా రాహుల్‌ ‌తల్లి సోనియాగాంధీయే ఇందుకు సరైన వ్యక్తిగా కాంగ్రెస్‌ ‌మేధావివర్గం చేసిన మేథో మథనమది. ఆరోగ్య పరిస్థితి బాగులేక దశాబ్ధం కిందే రాహుల్‌కు బాధ్యతలను అప్పగించి విశ్రాంతి తీసుకోవాలనుకుంది సోనియాగాంధి. కాని, తానింకా రాజకీయాల్లో పరిణతి చెందాల్సి ఉందని సున్నితంగా ఆనాడాపదవిని తిరస్కరించిన రాహుల్‌, ‌నేటి రాజకీయాలను జీర్ణించుకోలేక పోవడంతో మరోసారి సోనియాగాంధీకి ఆ భారాన్ని మోయక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో కాంగ్రెస్‌కు గాంధీ, నెహ్రూ కుటుంబాలుతప్ప మరో దిక్కు లేదన్న సంకేతాన్ని ఆ పార్టీ ప్రపంచానికి మరోసారి తెలియజేసినట్లు అయింది. ఒక పక్క జాతీయస్థాయి పార్టీలు కాంగ్రెస్‌ ‌వారసత్వ రాజకీయాలను గురించి అనేక వేదికలపైన ఆరోపిస్తున్న క్రమంలో దాని నుండి బయటపడే ప్రయత్నాలు చేయాల్సి ందిపోయి, ఇంకా అవే రాజకీయా) సుడిగుం డంలో చుట్టుకుపోతుండడం ఆ పార్టీ వర్గాలకు ఇబ్బందికరంగా పరిణమిస్తోంది. వాస్తవంగా తల్లి కొడుకులిద్దరు కూడా ఈసారి కాంగ్రెస్‌ ‌సారథ్య బాధ్యతలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్నారు. సారథి ఎంపిక సమావేశాలకు కూడా తాము రామని ముందుగానే ప్రకటించారు. దానివల్ల పార్టీలో అంతర్ఘతంగా స్వేచ్ఛాయుత వాతావరణంలో చర్చలు జరిపి, ఓ సమర్థ నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఉంటుందని వారు భావించారు. కాని, గాంధీ, నెహ్రూ కుటుంబ వ్యక్తులను కాదని మరో వ్యక్తిని తమ నాయకుడిగా ఎన్నుకునే సాహసం ఆ పార్టీవర్గాలు చేయలేక పోతున్నాయి. ఇది భవిష్యత్‌ ‌కాంగ్రెస్‌కు ఇబ్బందికర విషయమని తెలిసినప్పటికీ ఆ ధోరణి నుండి బయటికి రాలేకపోవడం దురదృష్టకరం. పార్టీ సారథి ఎంపిక విషయంలో గత కొద్దికాలంలో జరుగుతున్న తర్జనబర్జనల అనంతరం తాత్కాలికం పేరుతో చివరకు సోనియాగాంధీకే బాధ్యతలను అప్పగిం చింది పార్టీ. తమ కుటుంబ వ్యక్తి కాకుండా మరో వ్యక్తికి బాధ్యతలను అప్పగించాలంటూ చాలాకాలంగా పట్టుపడుతున్న రాహుల్‌గాంధీ కోరిక దీంతో నెరవేరకుండా పోయింది. ఈ తాత్కాలికం ఎంతకాలం కొనసాగుతుందోకూడా ఎవరికీ తెలియదు. తాజాగా జరిగిన లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ‌పార్టీ ఘోర పరాజయాన్ని మూటకట్టుకోవడంతో అందుకు బాధ్యత వహిస్తూ రాహుల్‌గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాహుల్‌ ‌పార్టీలో అనేక సంస్కరణలు ప్రవేశపెట్టాలని కలలు కన్నాడు. ముఖ్యంగా వృద్ధ నాయకులు కేవలం పార్టీకి సలహాదారులుగా ఉండాలని, యువకులను ప్రోత్సహించాలంటూ ఆనేక సూచనలు చేశాడు. కాని, అవేవీ కార్యరూపం దాల్చలేదు. దానికి తగినట్లుగా అధ్యక్షుడిగా మొదటి సారిగా ఎదుర్కున్న లోకసభ ఎన్నికల్లో పార్టీ ఘోరంగా విఫలమవడంతో ఇక పార్టీకి నూతన సారథి ఆవశ్యకత అవసరమన్న నిర్ణయానికి వచ్చాడు రాహుల్‌. అం‌దుకే అధ్యక్ష పదవిలో గాంథీ కుటుం బమే ఉండాలన్న రూలేమీలేదంటూ వాదించాడు. కాని, పార్టీ మాత్రం మళ్ళీ గాంధీ కుటుంబం చేతికే పార్టీ పగ్గాలను అప్పగించింది