వ్యవస్థాపక సంపాదకులు

దేవులపల్లి అమర్

ఎడిటర్

దేవులపల్లి అజయ్

నెల రోజుల్లో.. ‘అయోధ్య’ పరిష్కారం..!

September 18, 2019

మధ్యవర్తిత్వంపై అభ్యంతరం లేదు..
కమిటీ సంప్రదింపులకు సమాంతరంగా విచారణ జరుగుతుందన్న సుప్రీమ్‌కోర్టుఎన్నో ఏళ్లుగా అపరిష్కతంగా ఉన్న అయోధ్య కేసులో గత కొన్నిరోజులుగా సుప్రీం కోర్టులో విచారణ సాగుతోంది. అయోధ్య అంశంపై 26వ రోజు విచారణ జరగ్గా, సుప్రీం కోర్టు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అక్టోబరు 18లోపు విచారణ పూర్తిచేస్తామని పేర్కొంది. బుధవారం కూడా సుప్రీంకోర్టులో ఆయోధ్య కేసుపై విచారణ జరిగింది. అక్టోబరు 18తో వాదనలు ముగుస్తాయని ధర్మాసనం, అదేరోజున విచారణ కూడా పూర్తి చేస్తామని వెల్లడించింది. ఈ విషయాన్ని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం బుధవారం స్పష్టం చేసింది. అక్టోబరు 18నాటికి ఈ కేసు విచారణ పూర్తిచేయనివ్వాలంటూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ ‌గొగొయ్‌ ‌కోరారు. అదే రోజున కోర్టు తీర్పును రిజర్వ్ ‌చేసే అవకాశం ఉంది. నవంబర్‌ 17‌న సీజే రంజన్‌ ‌గొగొయ్‌ ‌పదవీకాలం ముగియనుండటంతో ఈ లోపు అయోధ్య వివాదంపై తీర్పు వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కేసులోని పార్టీలు మధ్యవర్తిత్వాన్ని కొనసాగించాలని కోరుకుంటే తమకెలాంటి అభ్యంతరం లేదని సుప్రీం తెలిపింది. సమస్య పరిష్కారం కోసం మధ్యవర్తిత్వ కమిటీ ప్రయత్నాలు చేయవచ్చని వెల్లడించింది. కమిటీకి పరిష్కారం దొరికినట్లయితే దాన్ని కోర్టు ముందుకు తీసుకురావచ్చని అభిప్రాయపడింది. ఎప్పటిలాగే మధ్యవర్తిత్వ కమిటీ సంప్రదింపులను గోప్యంగా కొనసాగించాలని సూచించింది. ఈ కమిటీతో పాటు కోర్టులో విచారణ సాగుతుందని సుప్రింకోర్టు తెలిపింది.