Take a fresh look at your lifestyle.

నీళ్ల పంచాయతీ వస్తే చంద్రబాబు మనకు న్యాయం చేస్తాడా…

భీమ్ గల్ రోడ్ షో లో ఎంపీ కవిత

భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ కు మన తెలంగాణ కు మధ్య నీళ్ల పంచాయతీ వస్తే చంద్రబాబు నాయుడు మనకు న్యాయం చేస్తాడా.. ఈ విషయంపై ఆలోచన చేయాలని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రజలను కోరారు. శుక్రవారం రాత్రి బాల్కొండ నియోజకవర్గం లోని భీమ్ గల్ టౌన్ లో మూడు చోట్ల నిర్వహించిన రోడ్డు షోలలో కవిత ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంపీ కవిత కు మహిళలు మంగళ హారతులుతో ఘన స్వాగతం పలికారు. బోనాలను ఎత్తుకున్న మహిళలు ర్యాలీగా ముందుకు సాగారు. రోడ్ షో లలో ఎంపి కవిత మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మన దగ్గర చక్రం తిప్పాలని కాంగ్రెస్ కూటమి పెట్టారని అన్నారు. మనం ఆంధ్రాలో పోటీ చేయడం లేదు.. అక్కడ చక్రం తిప్పాలను కోవడం లేదు కానీ ఆయన మాత్రం ఇక్కడే చక్రం తిప్పాలని ఉంది.. 60 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలు ఎంత కష్టపడ్డారో తెలుసునన్నారు. మీ ఊరు కోస్తా నీ నెత్తి కొడకా మీ పొట్ట కొడతా అన్నాడు ఓటమికి పార్టీలకు ఎట్లా ఓట్లు వేస్తాము మనమంతా ఆలోచించుకోవాలసిన సమయం ఇదన్నారు. కాలేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 21 ద్వారా భీం గల్ ప్రాంతానికి నీళ్లు ఇచ్చే ప్రయత్నం ముఖ్యమంత్రి కెసిఆర్ చేస్తున్నారని ఈ ప్రాజెక్టు అడ్డుకునేందుకు చంద్రబాబు లేఖ రాశారన్నారు. మన ప్రాజెక్టులను అడ్డుకునేందుకు కేంద్రానికి 35 లేఖలు రాశారని ఎంపీ కవిత ప్రజలకు వివరించారు. భీం గల్ అభివృద్ధికి నాలుగున్నర ఏళ్లు గా ప్రశాంత్ రెడ్డి పడిన శ్రమ అంతా ఇంతా కాదు అన్నారు. ఆయన వల్లే భీం గల్ మున్సిపాలిటీ అయిందన్నారు. రూ. 25 5 కోట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ మీ మున్సిపాలిటీ అభివృద్ధికి మంజూరు చేశారని తెలిపారు. ప్రజల కష్టసుఖాలు తెలిసిన కేసీఆర్ అడక్కుండానే అన్నీ చేస్తున్నారని ఆయన మనసున్న మారాజు అన్నారు. 68 ఏళ్ల పెన్షన్ అర్హత వయస్సును 58 ఏళ్లకు కేసీఆర్ కుదించారు అని చెప్పారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడగానే 58 ఏళ్ల పైబడిన వారందరికీ కూడా పెన్షన్లు వస్తాయని కవిత తెలిపారు. నిరుద్యోగులకు భ్రుతిగా ప్రతి నెలా మూడువేల రూపాయలను ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు. రైతు బంధు పథకం ద్వారా రైతులకు పెట్టుబడి సాయం గా ఎకరాకు రూ. 5వేలు, ఏడాదికి పది వేలు చొప్పున ఇస్తుందని కవిత వివరించారు. భీంగల్ లో 100 పడకల ఆసుపత్రి కోసం ప్రశాంత్ అన్న కృషి చేస్తున్నారనీ తెలిపారు. సొంత ఇల్లు లేని వారు ఇబ్బంది పడొద్దు..జాగా ఉండి ఇల్లు కట్టుకో లేని వారికి డబుల్ బెడ్ రూము నిర్మాణానికి అయ్యే ఖర్చును ప్రభుత్వం మీ అకౌంట్ల లో వేస్తుందని చెప్పారు. కేసీఆర్ ను మన ఇంటి మనిషి అని అందరూ అనుకుంటున్నారు అని కవిత తెలిపారు. కెసిఆర్ బంగారు తెలంగాణ నిర్మాణం కలలను సాకారం చేసేందుకు కారు గుర్తుకు ఓటేసి మళ్లీ కెసిఆర్ ను సీఎం గా చేయాలని ఎంపీ కవిత ప్రజలకు పిలుపునిచ్చారు. రోడ్డు షోలలో ఎంపీ కవిత తో పాటు టిఆర్ఎస్ అభ్యర్థి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy