Take a fresh look at your lifestyle.

నీతి అయోగ్‌ ‌చెప్పినా … నిధులివ్వని కేంద్రం

ఆర్థ్ధిక మంత్రి హరీష్‌ ‌రావుమిషన్‌ ‌కాకతీయ పథకానికి రాష్టాన్రికి రూ.5000 కోట్లు సాయం చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి నిటిఅయోగ్‌ ‌సూచించినప్పటికీ ఇవ్వలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్‌ ‌రావు తెలిపారు. శాసనసభలో బుధవారం స్పీకర్‌ ‌పోచారం శ్రీనివాస్‌ ‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు పెద్ది సుదర్శన్‌ ‌రెడ్డి, బాల్క సుమన్‌, ‌క్రాంతి కిరణ్‌ ‌మిషన్‌ ‌కాకతీయ పథకంపై అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ కార్యక్రమం కింద 21,275 చెరువులను పునరుద్ధరించి 14.15 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించామన్నారు. నిటిఅయోగ్‌ 2017 ఆగస్టులో నివేదికలో నీటి నిర్వహణలో ఎంపిక చేసిన ఉత్తమ విధానాలకు గాను మిషన్‌ ‌కాకతీయ ప్రయోజనాలను ప్రస్తావించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు, పలు రాష్టాల్రకు ఆదర్శంగా నిలిచినా కేంద్రం నిధులు ఇవ్వలేదన్నారు.
సచివాలయం డిజైన్‌ ‌ఫైనల్‌ ‌చేయలేదు – మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి
ఎంఐఎం సభ్యులు మహ్మద్‌ ‌మోజామ్‌ ‌ఖాన్‌ ‌తదితరులు, సచివాలయంలో ఉన్న మతసంబంధ కట్టడాలకు ఇబ్బంది కలగకుండా నూతన సచివాలయ భవన నిర్మాణం చేపడతామని హామి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ ‌చేశారు. దీనిపై రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ ‌రెడ్డి, సాంకేతిక కమిటీ సమర్పించిన నివేదికకు మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయలను జత చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించామని తెలిపారు. అయితే ప్రార్థనామందిరాలను కదల్చబోమని, నూతన సచివాలయం నిర్మాణం అయ్యేంత వరకు యధావిధిగా భక్తుల రాకకు అనుమతిస్తామని హా ఇవ్వాలని పలుమార్లు కోరగా మంత్రి బదులిస్తూ, సచివాలయం డిజైన్‌ ‌పూర్తి కాలేదని, అంచనా వ్యయం ఇప్పుడే చెప్పలేమని, సభ్యుల డిమాండ్‌ ‌ను పరిశీలించి న్యాయం చేస్తామన్నారు.
నిధుల కొరత ఉంటే ప్రయివేటు పాలిటెక్నిక్‌ ‌ల ఏర్పాటు….మంత్రి నిరంజన్‌ ‌రెడ్డి
రాష్ట్రంలో ప్రయివేటు పాలిటెక్నిక్‌ ‌కళాశాలల ఏర్పాటును పరిశీలిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌ ‌రెడ్డి తెలిపారు. సభ్యులు గండ్ర వెంకటరమణారెడ్డి,జాజుల సురేందర్‌, ‌దాసరి మనోహర్‌ ‌రెడ్డి వ్యవసాయ శాఖ బలోపేతంపై ప్రశ్నించారు. గండ్ర మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ కోర్సులకు డిమాండ్‌ ఉన్నప్పటికీ తగినన్ని కళాశాలలు లేకపోవడంతో విద్యార్థులు ఇతర రాష్టాల్రకు వెళుతున్నారన్నారు. అలాగే ఉద్యానవన శాఖలో సిబ్బంది కొరత ఉందన్నారు. మంత్రి సమాధానమిస్తూ ప్రభుత్వ వ్యవసాయ పాలిటెక్నిక్‌ ‌కళాశాలలు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తామని, నిధులు కొరత ఉంటే ప్రయివేటు పరిశీలిస్తామన్నారు. ఉద్యానవన శాఖలో సిబ్బందిని హేతుబద్దీకరి స్తున్నామని తెలిపారు.
చెట్లు ఆగమైతే జరిమానా గ్రామ సభలే నిర్ణయిస్తాయి – మంత్రి ఎర్రబెల్లి
గ్రామంలో ఎన్ని చెట్లు నాటాలనే లక్ష్యాలేవి నిర్దేశించలేదని, అయితే చెట్లు ఆగమైతే జరిమానాలు గ్రామసభలే నిర్ణయిస్తాయని పంచాయతీరాజ్‌ ‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ ‌రావు స్పష్టం చేశారు. గ్రామాల్లో 30 రోజుల కార్యక్రమం అమలుపై సభ్యులు సోలిపేట రామలింగారెడ్డి, బాజిరెడ్డి గోవర్థన్‌, ఆరూరి రమేష్‌ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, నాటిన చెట్లలో 85 శాతం బతికించుకోవాలన్నారు. మొక్కలు నాటే కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
సబ్‌ ‌కాంట్రాక్టర్లతో ఇబ్బందులు…ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌జిహెచ్‌ఎం‌సీ పరిధిలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ బల్బుల నిర్వహణ సంస్థ సబ్‌ ‌కాంట్రాక్టర్లకు అప్పగించిందని, దీంట్లో ఇబ్బందులున్నాయని సభ్యులు కాలేరు వెంకటేష్‌ ‌తెలిపారు. కాంట్రాక్టర్‌ ‌కు, సబ్‌ ‌కాంట్రాక్టర్‌ ‌కు మధ్య సమన్వయ లోపంతో వారాల తరబడి మరమ్మతులు జరగడం లేదన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ‌మాట్లాడుతూ, సమన్వయ సమస్యలను పరిష్కరిస్తామని హామి ఇచ్చారు. ,రాష్ట్రంలో 1,17,714 ఖాళీలు భర్తీ రాష్ట్రంలో 1,17,714 ఖాళీలను భర్తీ చేసినట్టు ఆర్థిక శాఖ మంత్రి
హరీష్‌ ‌రావు తెలిపారు. ప్రభుత్వ శాఖలలో ఖాళీల భర్తీపై సభ్యులు బాల్కసుమన్‌ అడిగిన ప్రశ్నకు, టీఎస్పీఎస్సీ 101 ప్రకటనలను, ఇతర నియామక ఏజెన్సీలు 41 ప్రకటనలను జారీ చేశాయని తెలిపారు. 31,668 ఖాళీల నియామక పక్రియ పురోగతిలో ఉందన్నారు. వివిధ నియామకాల పక్రియపై 900 వరకు కేసులు న్యాయస్థానాల్లో ఉన్నాయన్నారు. కొన్ని అప్పీల్‌ ‌దశలో ఉండగా, మరికొన్ని స్టేలో ఉన్నాయని తెలిపారు. వీటి పరిష్కారానికి గట్టి ప్రయత్నాలు జరుగుతున్నారు.

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!