Take a fresh look at your lifestyle.

నివురుగప్పిన నిప్పులా కాశ్మీర్‌

‌కాశ్మీర్‌లో నిజనిర్ధారణ జరిపిన కమిటీ నివేదిక ఇటీవల విడుదల అయింది. 370వ అధికరణం రద్దు తర్వాత కాశ్మీర్‌ ‌లోయలో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దాంతో వాస్తవాలు బయటకు రావడం లేదు. లోయలో జర్నలిస్టుల పరిస్థితి కత్తుల వంతెన మీద నడకలా తయారైంది. ఆత్మను చంపుకోలేక, ప్రభుత్వ ఒత్తిళ్ళను తట్టుకోలేక జర్నలిస్టులు సతమతమవుతున్నారు. ముళ్ళ కంచెలతో రోడ్లను దిగ్బంధించడమే కాదు, ఆంక్షలతో పత్రికలనూ, మీడియా వర్గాల నోళ్ళను నొక్కుతున్నారు.కాశ్మీర్‌లో తిరిగి మామూలు పరిస్థితులు నెలకొంటున్నట్టు ప్రభుత్వ ప్రచార సాధనాలు హోరెత్తిస్తున్నప్పటికీ, అక్కడ పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉందని నిజనిర్ధారణ కమిటీ నివేదిక వెల్లడిస్తోంది. ఈ కమిటీ నివేదిక ప్రకారం కాశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితి అత్యంత భయానకంగా ఉంది. ప్రజల్లో ఎల్లెడలా నిరాశానిస్పృహలు అలుముకున్నాయి. భద్రతాదళాల పదఘట్టనలతో ప్రజల గుండెలు అదురుతున్నాయి. ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నా, మధ్యలో మూడో వ్యక్తి తొంగి చూస్తాడు. అంత నిఘా ఉందన్న మాట, ప్రభుత్వానికి అనుకూలంగా లేని సమాచారం అందించే జర్నలిస్టులు అరెస్టు అవుతున్నారు. జర్నలిస్టులను ఏంరాస్తున్నారంటూ గర్జించే స్వరంతో పోలీసు అధికారులు ప్రశ్నిస్తున్నారు.
కాశ్మీర్‌లో నిజనిర్ధారణ జరిపిన కమిటీ నివేదిక ఇటీవల విడుదల అయింది. 370వ అధికరణం రద్దు తర్వాత కాశ్మీర్‌ ‌లోయలో ప్రభుత్వం ఆంక్షలు విధించింది. దాంతో వాస్తవాలు బయటకు రావడం లేదు. లోయలో జర్నలిస్టుల పరిస్థితి కత్తుల వంతెన మీద నడకలా తయారైంది. ఆత్మను చంపుకోలేక, ప్రభుత్వ ఒత్తిళ్ళను తట్టుకోలేక జర్నలిస్టులు సతమతమవుతున్నారు. ముళ్ళ కంచెలతో రోడ్లను దిగ్బంధించడమే కాదు, ఆంక్షలతో పత్రికలనూ, మీడియా వర్గాల నోళ్ళను నొక్కుతున్నారు. ఈ నిజనిర్ధారణ బృందంలో ఇద్దరు మహిళలు ఉన్నారు. వీరు నెట్‌ ‌వర్క్ ఆఫ్‌ ఉమన్‌ ఇన్‌ ‌మీడియాకు చెందిన వారు. ఆగస్టు 30వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 3‌వ తేదీ వరకూ ఈ బృందం కాశ్మీర్‌ ‌లోయలో పర్యటించింది. జర్నలిస్టులు లక్ష్మీ మూర్తి, గీతా శేషులు ఈ బృందలో ఉన్న మహిళా సభ్యులు. ఈ బృందం సభ్యులు 70 మంది జర్నలిస్టుల, కరస్పాండెంట్లు, వార్తా పత్రికల సంపాదకులతో సమాచార సేకరణ జరిపింది. వీరిని శ్రీనగర్‌లోనూ, దక్షిణ కాశ్మీర్‌లోనూ కలుసుకుంది. స్థానికుల నుంచి కూడా సమాచార సేకరణ చేసింది. ఎవరు ఎవరిని కలుసుకున్నా నిఘా, పబ్లిక్‌ ‌ప్రదేశాల్లో అయితే వేరే చెప్పనవసరం లేదు. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు కలుసుకుంటే భద్రతాదళాల సభ్యులు వచ్చి వాల్తారు. ప్రచురణ సంస్థలపై గట్టి నిఘా ఉంది. వార్తా పత్రికలపై నిఘా ఎంతుందో మాటల్లో చెప్పలేం. ప్రజలకు, పత్రికల వారికీ సంబంధాలు లేవు. అధికారికంగా కర్ఫ్యూ అమలులో లేకపోయినా దుకాణాలు, వ్యాపార సంస్థలను మూసివేశారు. స్వతంత్రంగా పని చేసే ప్రచురణ సంస్థలు మూత బడ్డాయి. మిగిలిన సంస్థలపై ప్రభుత్వ పెత్తనం కొనసాగుతోంది. తుపాను ముందు ప్రశాంతత మాదిరిగా అంతటా నిర్మానుష్యం. నిశ్శబ్దం. సమాచార పంపిణీపై ఆంక్షలు ప్రజాస్వామ్య విరుద్ధమని నిజనిర్ధారణ కమిటీ పేర్కొంది. ప్రజలు ఒకరికొకరు కలుసుకోవడం, అభిప్రాయాలను మార్పిడి చేసుకోవడం అనేది లేనేలేదు.
స్థానికుల పరిస్థితి అలా ఉంటే జర్నలిస్టుల పరిస్థితి మరింత దుర్భరంగా ఉందని ఆ నివేదిక పేర్కొంది. కర్ఫ్యూ విధించిన తర్వాత కూడా వివిధ ప్రాంతాల్లో సంఘటనలు చోటు చేసుకున్నాయనీ, వాటికి సంబంధించిన సమాచారం బయటకు రావడం లేదని సీనియర్‌ ‌జర్నలిస్టులు పలువురు పేర్కొన్నారు. సీనియర్‌ ‌జర్నలిస్టులు ఫయాజ్‌ ‌బుఖారీ, అయిజాజ్‌ ‌హుస్సేన్‌, ‌నజీర్‌ ‌మసూదీలను ప్రభుత్వం కేటాయించిన భవనాలనుంచి నోటి మాట ద్వారా ఖాళీ చేయమని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. కాశ్మీర్‌ అం‌తటా ల్యాండ్‌ ‌లైన్‌ ‌టెలిఫోన్‌లు పని చేస్తున్నాయని అధికారులు ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ, వాస్తవ పరిస్థితి వేరు. ప్రభుత్వ లెక్కల ప్రకారం జమ్ము,కాశ్మీర్‌లో 95 ఎక్స్చేంజిలకు చెందిన 26 వేల ల్యాండ్‌లైన్‌ ‌కనెక్షన్లు పునరుద్ధరించబడ్డాయి. జర్నలిస్టుల కోసం శ్రీనగర్‌ ‌లోని ఒక ప్రైవేటు హోటల్‌లో మీడియా సౌకర్యాల కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ ఐదు కంప్యూటర్లు మాత్రమే ఉన్నాయి. బిఎస్‌ఎన్‌ఎల్‌ ఇం‌టర్నెట్‌ ‌కనెక్షన్‌ ఉం‌ది. ఒక ఫోన్‌ ‌లైన్‌ను ప్రభుత్వ అధికారులు తమ అధీనంలో ఉంచుకున్నారు. జర్నలిస్టులు తమ వార్తా సంస్థలకు కథనాలు పంపడానికి క్యూలు కడితే కానీ లాభం లేదు. ప్రభుత్వ అధికారులు ప్రెస్‌ ‌బ్రీఫింగ్స్ ‌పేరిట విలేఖరుల సమావేశాలను ఏర్పాటు చేస్తుంటారు. అక్కడ అధికారులు చెప్పింది రాసుకోవడమే తప్ప ప్రశ్నలు అడగడానికి వీలు లేదు. సున్నితమైన కథనాలను పంపినందుకు జర్నలిస్టులను ఇరుకున పెట్టే ప్రశ్నలతో అధికారులు వేధిస్తున్నట్టు నిజనిర్ధారణ కమిటీ నివేదికలో పేర్కొనడం జరిగింది. అంతేకాక, జర్నలిస్టులు ఏయే కథనాలు పంపాలో అనధికారికంగా అధికారులు సూచనలు చేస్తుంటారు. సంపాదకీయాలు, ఎడిట్‌ ‌పేజి ఎదురు పేజీలో ప్రచురించే వ్యాసాలు ఏమేమి ఉండాలో వారే సూచిస్తుంటారు. బీజేపీ సభ్యులు రోజుకు ఏడో ఎనిమిదో కథనాలు తెచ్చి పంపిణీ చేస్తున్నట్టు మూర్తి, శేషుల దృష్టికి వచ్చింది. అంతర్జాతీయ మీడియాకు కాశ్మీర్‌లో పరిస్థితి అందుబాటులో ఉండనివ్వడం లేదు. ఫయీజ్‌ ‌బుఖారీ, రియాజ్‌ ‌మస్రూర్‌ ‌వంటి జర్నలిస్టుల జాబితాను తయారు చేసి వారికి కాశ్మీర్‌లో అభివృద్దికి సంబంధించిన బుక్‌ ‌లెట్‌లు అందిస్తూ వ్యాసాలు రాయమని కోరుతున్నారు. మహిళా జర్నలిస్టుల పరిస్థితి వర్ణనాతీతం. వారు ఎదుర్కొంటున్న ఆంక్షలు అన్నీ, ఇన్నీ కావు. ఏమైనా కాశ్మీర్‌లో పరిస్థితి కుదుటుపడుతోందని ప్రభుత్వం ఎంత ఘనంగా ప్రచారం చేస్తున్నా, అక్కడి పరిస్థితి అందుకు భిన్నంగా ఉందనేది వాస్తవం. స్థానిక పరిస్థితుల గురించి జాతీయ, అంతర్జాతీయ మీడియా సమాచారం అందుబాటులో ఉండనివ్వడం లేదు. పారదర్శకమైన, జవాబుదారీ ఏర్పాట్లు లేవు.

– ‘ద వైర్‌’ ‌సౌజన్యంతో..

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy