Take a fresh look at your lifestyle.

నిర్లక్ష్యమే వైరస్‌ ‌వ్యాప్తికి రారణం

  • ప్రజలు జాగ్రత్తలు పాటించకపోవడంతోనే ఉధృతంగా సెకండ్‌వేవ్‌
  • ‌మతపరమైన కార్యకలాపాలు, ఎన్నికలలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలి
  • ఎయిమ్స్ ‌చీఫ్‌ ‌డాక్టర్‌ ‌రణ్‌దీప్‌ ‌గులేరియా

దేశంలో కోవిడ్‌ ‌వైరస్‌ ‌వేగంగా వ్యాప్తి చెందడానికి ప్రధానంగా రెండు కారణాలున్నాయని ఎయిమ్స్ ‌చీఫ్‌ ‌డాక్టర్‌ ‌రణ్‌దీప్‌ ‌గులేరియా శనివారం తెలిపారు. కోవిడ్‌ ‌జాగ్రత్తలను ప్రజలు నిర్లక్ష్యం చేయడం ఒక ప్రధాన కారణమని, వ్యాక్సినేషన్‌ ‌మొదలై, కేసులు తగ్గడంతో ప్రజలు ఈ తరహా ప్రవర్తనకు అలవాటు పడ్డారని అన్నారు. ఇదే సమయంలో వైరస్‌ ‌రూపాంతరం చెంది వేగంగా వ్యాపిస్తుండటం మరో కారణమని అన్నారు. కొరోనా ఇన్‌ఫెక్షన్‌ ‌విస్తరిస్తున్న సమయంలో మత సంబంధిత, రాజకీయ కార్యకలాపాలు జరుగుతుండటంపై కూడా గులేరియా ఆందోళన వ్యక్తం చేశారు. ఆయా కార్యక్రమాలను ఆంక్షలు తప్పనిసరిగా పాటిస్తూ జరుపుకోవాల్సి ఉంటుందన్నారు. అనేక మతపరమైన కార్యకలాపాలు, ఎన్నికలు జరుగుతున్న తరుణమిది. ప్రాణాలు కూడా చాలా విలువైనవనే విషయాన్ని మనం గుర్తెరిగి, ఆంక్షలు పాటిస్తూ వీటిని జరుపుకోవాలన్నారు. అందువల్ల మతపరమైన మనోభావాలకు ఇబ్బంది కలగదు. అదే విధంగా కోవిడ్‌ ‌సమయంలో పాటించాల్సిన నిబంధనలను కూడా తప్పనిసరిగా పాటించాలని డాక్టర్‌ ‌గులేరియా అన్నారు. ఉత్తరాఖండ్‌లో జరుగుతున్న కుంభమేళాలో దేశవ్యాప్తంగా భక్తులు పాల్గొంటున్న నేపథ్యంలో ఎయిమ్స్ ‌చీఫ్‌ ‌సూచనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. క్రమంగా వ్యాక్సినేషన్‌ ‌వయోపరిమితిపై ఉన్న నిషేధాన్ని సడలిస్తూ వెళ్లాలనీ, ఇందువల్ల పవిత్ర స్నానాలు చేసే వాళ్లలో ఎక్కువ మంది వ్యాక్సినేషన్‌ ‌వేయించుకున్న వారే ఉంటారని ఆయన అన్నారు. దేశంలో మరిన్ని వాక్సిన్లు కూడా వొచ్చి చేరే అవకాశాలు ఉన్నాయని, ఇందువవల్ల ఎక్కువ మంది జనాభాకు వ్యాక్సినేషన్‌ అం‌దుబాటులోకి వొస్తుందని ఆయన పేర్కొన్నారు.

Leave a Reply