Take a fresh look at your lifestyle.

నిరుపయోగంగా 50 బెడ్స్ హాస్పిటల్ ..!

  • సందర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
  • 100 బెడ్స్ ఏర్పాటు చేయాలని డిమాండ్

హైదరాబాద్ ,మే 22: ఇది గత ఏడు సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న ఖైరతాబాద్ పట్టణ 50 పడకల ప్రాధమిక ఆరోగ్య కేంద్రాన్ని 100 పడకల హాస్పిటల్ గా మార్చాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఏఐసిసి ప్రతినిధి డాక్టర్ శ్రావన్ దాసోజు మరియు మాజీ ఎంపి శ్రీ అంజన్ కుమార్ యాదవ్ శనివారం ఈ హాస్పిటల్ ను సందర్శించారు, హాస్పిటల్ దయనీయ స్థితి టిఆర్ఎస్ ప్రభుత్వం మరియు స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ నిర్లక్ష్యాన్ని స్పష్టంగా ప్రతిబింబిస్తుందని వారు ఆరోపించారు. కోవిడ్ సంక్షోభ సమయంలో పడకలు, వెంటిలేటర్లకు సదుపాయాలు, ఆక్సిజన్‌తో సహా అన్ని మౌలిక సదుపాయాలు ఉన్న ఈ హాస్పిటల్ ను కోవిడ్ చికిత్స కోసం ప్రత్యేకంగా ఉపయోగించుకోవాలని కాంగ్రెస్ పార్టీ కోరుతుందన్నారు..

ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర జైళ్లను కూల్చివేసి, హాస్పిటల్స్ నిర్మిస్తామని తప్పుడు వాగ్దానాలు చేయడానికి బదులుగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే మౌలిక సదుపాయాలలో నిర్మించిన వాటిని ఉపయోగించుకోవాలి అని వారు సూచించారు. ప్రభుత్వ దవాఖానాలలో పడకలు దొరకక ప్రజలు చనిపోతున్నారు. మరియు ప్రైవేట్ హాస్పిటల్స్ భారీ రుసుము వసూలు చేసి కోవిడ్ రోగుల రక్తాన్ని పీలుస్తున్నాయి అని ఆందోళన వ్యక్తం చేశారు.ప్రభుత్వం తక్షణమే గత ఏడు సంవత్సరాలుగా నిరుపయోగంగా ఉన్న ఈ హాస్పిటల్ ను వంద పడకల హాస్పిటల్ గా మార్చాలని మరియు పేదలకు ఉచిత చికిత్స అందించాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోందని … మంత్రి కెటిఆర్ ఆధ్వర్యంలో కోవిడ్ టాస్క్ ఫోర్స్ దీని పై దృష్టి పెట్టాలని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు డిమాండ్ చేసారు .

Leave a Reply