- గృహ లక్ష్మి పథకం ద్వారా 4 లక్షల మంది పేదలకు రూ. 3 లక్షల చొప్పున గ్రాంట్
- రాష్ట్ర కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు…మీడియాకు వెల్లడించిన మంత్రి హరీష్ రావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చ్ 09 : రాష్ట్ర వ్యాప్తంగా లక్షా 30 వేల కుటుంబాలకు దళిత బంధు ఇవ్వాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. నియోజక వర్గానికి 1100 కుటుంబాల చొప్పున ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. దళిత బంధుపై దేశ వ్యాప్తంగా కూడా చర్చ జరుగుతుందని అన్నారు. గురువారం ప్రగతి భవన్‌లో సుమారు ఐదున్నర గంటల పాటు సాగిన రాష్ట్ర కేభినెట్ భేటీలో తీసుకున్న పలు కీలక నిర్నయాలను ఆయన మీడియాకు వెల్లడించారు. ఇక సొంత జాగా ఉన్న పేదలకు ఆర్థిక సాయం అందించే గృహ లక్ష్మి పథకం ద్వారా 4 లక్షల మందికి పేదలకు, నియోజక వర్గానికి 3 వేల చొప్పున ఇళ్లు కేటాయిస్తామన్నారు.
ఇందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. లబ్దిదారుడికి రూ 3 లక్షల గ్రాంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. 3 లక్షల మొత్తాన్ని లక్ష చొప్పున 3 దఫాలుగా ఇవ్వాలని నిర్ణయించారు. కాగా గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న కీలక బిల్లులపై న్యాయపోటానికి కేబినెట్ నిర్ణయించింది. ఈ అంశంపై సుప్రీమ్ కోర్టుకు వె•ళ్లాలని నిర్ణయించింది. ఇక బిఆర్‌ఎస్ ఎంఎల్‌సి కవితకు ఇడి నోటీసులపై భేటీలో చర్చించినట్లు సమాచారం. ఇడి విచారణ సందర్భంగా ఒకవేళ కవితను అరెస్ట్ చేసిన పక్షంలో ఎలా స్పందించాలనేది, కేంద్రం రాష్ట్రంపై కొనసాగిస్తున్న కక్ష సాధింపు చర్యలపై ఎలా ముందుకు సాగాలనే అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. కేబినెట్ భేటీలో మరికొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. గొర్రెల పంపిణీకి 4 వేల 430 కోట్లు కేటాయించామన్నారు. పొడు భూముల సమస్య పరిష్కారారిని నిర్ణయం తీసుకున్నామన్నారు. 4 లక్షల ఎకరాల పొడు భూములను అర్హులైన గిరిజనులకు పంపిణీ చేస్తామన్నారు. ఒక లక్షా 53 వేల మంది అర్హులు ఉన్నారన్నారు.
ఏప్రిల్ 14వ తేదీన హైదరాబాద్ లో నిర్మించిన డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని ఒక పండుగలా నిర్వహిస్తామన్నారు. గ్రామాలు, పట్టణాల నుంచి ప్రజల నుంచి తీసుకొచ్చి.. విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. విగ్రహావిష్కరణ తర్వాత బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. జీవో 58,59 కింద నిరుపేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. కాశీలో తెలంగాణ భక్తుల కోసం వసతి గృహం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం రూ. 25 కోట్ల నిధులు మంజూరు చేస్తామన్నారు. కేరళ శబరిమలలో తెలంగాణ భక్తుల కోసం వసతి గృహ సముదాయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్నారు.