Take a fresh look at your lifestyle.

నియోజకవర్గ అభివృద్దే లక్ష్యం : గాదరి

సూర్యాపేట(తుంగతుర్తి), జూన్‌ 10, ‌ప్రజాతంత్ర ప్రతినిధి):నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేసేందుకు )క్ష్యంగా పనిచేస్తున్నామని స్థానిక శాసన సభ్యులు డాక్టర్‌ ‌గాదరి కిషోర్‌కుమార్‌ అన్నారు. బుధవారం తుంగతుర్తిమండల కేంద్రంలోని కోటి రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న అంబేద్కర్‌ ‌భవనానికి శంకుస్థాపన చేసి మాట్లాడారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని అభివృద్ది పథకంలో నడిపించేందుకు శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని పేర్కొన్నారు.

నియోజకవర్గానికి అందజేసిన కాళేశ్వరం నీటి వల్ల చెరువులు నిండి జలకళ సంతరించుకున్నాయని అన్నారు.అనంతరం మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పనులను పరిశీలించారు. వీలైనంత త్వరలో క్యాంప్‌ ‌కార్యాలయం భవనాన్ని పూర్తిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపడిఓ లక్ష్మి తహశీల్దార్‌ ‌పుష్ప భీమ్‌ ‌సింగ్‌, ఎం‌పిపి గుండగాని కవితరాములు గౌడ్‌, ‌సర్పంచ్‌ ‌స్వరూప రవీంద్రరావు, ఎంపిపి మట్టపల్లి శ్రీశైలం, వెంకన్న, నారాయణ గౌడ్‌ ‌తదితరులు  పాల్గొన్నారు.

Leave a Reply