Take a fresh look at your lifestyle.

నిఫా వైరస్‌పై ప్రజల్లో అవగాహన అవసరం

ప్రస్తుత ఆధునిక యుగంలో ఆరోగ్యంపై ప్రతి నిత్యము అవగాహన అవసరం. నిఫా వైరస్‌ అరుదైన, తీవ్రమైన ప్రాణాంతకమైన వైరస్‌ ‌వ్యాధి. గబ్బిలాలు, పందుల నుంచి ఎవరికైనా ఈ వైరస్‌ ‌సోకుతుంది. 1998లో మలేషియాలో మొదటిసారిగా ఈ వైరస్‌ ‌కనుగొనబడింది. అటు తర్వాత 2004లో బంగ్లాదేశ్‌ ‌లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వైరస్‌ ‌మనదేశంలోని కేరళ రాష్ట్రంలోకి ప్రవేశించింది. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వ్యాధులపై కొంత అవగాహనతో ఉండాలని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు.

నిఫా వైరస్‌ అం‌టువ్యాధి
మలేషియాలోని సుంగాయ్‌ ‌నిఫా అనే గ్రామంలోని రోగుల నుంచి తొలి సారిగా ఈ వైరస్‌ను కనుగొన్నారు కాబట్టి, దీనికి నిఫా వైరస్‌గా నామకరణం చేశారు. ఈ వ్యాధితో మలేషియాలో 105 మంది మృతి చెందగా, సింగపూర్‌లో పందులను పెంచే పశుపోషకులు మృతి చెందారు. ముఖ్యంగా నిఫా వైరస్‌ ‌ప్రభావం ఉన్న రాష్ట్రాల నుంచి మన రాష్ట్రానికి వచ్చిన వాళ్ళు గాని లేక మన రాష్ట్రం వాళ్ళు అక్కడికి వెళ్లి వచ్చిన తర్వాత గాని నిఫా లక్షణాలు కనబడినట్లైతే ముందే తగు జాగ్రత్తలలు తీసుకుని నిఫా వైరస్‌ ‌నుంచి కాపాడుకోవాలి.

లక్షణాలు
వైరస్‌ ‌సోకిన వ్యక్తుల్లో 5 నుంచి 14 రోజుల్లో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. తలనొప్పి, శ్వాసతీసుకోలేక పోవడం, తల తిరుగుడం, వాంతులు, జ్వరం, మత్తు, మతిస్థిమితం తప్పినట్టు అనిపిస్తుంది. వ్యాధి తీవ్రత ఎక్కువైతే 24 నుంచి 48 గంటల్లో కోమాలోకి వెళ్లి మృతి చెందే ప్రమాదం ఉంది. ఇది అప్పటికే వైరస్‌ ‌సోకిన జంతువు లేదా మనిషి నుండి వ్యాపిస్తుందని వైద్యనిపుణులు తెలియజేస్తున్నారు. ఫ్రూట్‌ ‌బ్యాట్‌గా చెప్పుకునే పెట్రో పొడిడే వర్గానికి చెందిన గబ్బిలాలు ఈ వ్యాధి వ్యాప్తికి తొలి వాహకాలు. ఇవి కొరికి పడేసిన పండ్లు, కాయలు తింటే వైరస్‌ ఇతరులకు సోకుతుంది. 2004లో బంగ్లాదేశ్‌లో ఈ వైరస్‌ ‌సోకిన గబ్బిలాలు ఎంగిలి చేసిన తాటి గుజ్జు తినడం మూలంగా మనుషులకు సోకిందని వైద్యులు తెలిపారు. కావున జాగ్రత్తగా ఉండాలి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు
నిపా వైరస్‌కు చికిత్సలేదు. దీనిని నియంత్రించే టీకాలు ఇంకా తయారుకాలేదు. వైరస్‌ ఉన్న ప్రాంతాల్లో పందులు, గబ్బిలాలు లేకుండా చూసుకోవడంతో పాటు నివారణ చర్యలు తీసుకోవాలి.పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. పళ్ళు, కూరగాయలను పరిశుభ్రపరిచిన తర్వాతే తినాలి. తినేముందు చేతులను ప్రతిసారీ సబ్బుతో కడుక్కోవాలి. గబ్బిలాలు ఆహారంగా మామిడి పండ్లు, జాక్‌ ‌ఫ్రూట్స్, ‌రోజ్‌ ఆపిల్స్‌లను తీసుకుంటాయి. వీటిని వినియోగించేప్పుడు తగు జాగ్రత్తలు పాటించి ఆరోగ్యాలను కాపాడుకోవాలి.

పి. మహమ్మద్‌ ‌రఫి.
సామాజిక కార్యకర్త

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy
error: Content is protected !!