Take a fresh look at your lifestyle.

నిధులు విడుదల చేయండి

ఫోటో: శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సీఎం కేసీఆర్‌ ‌సమావేశమయిన దృశ్యం.
ఫోటో: శుక్రవారం న్యూఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీతో సీఎం కేసీఆర్‌ ‌సమావేశమయిన దృశ్యం.

ప్రధానమంత్రి మోడీని కలిసిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ ‌రావు
50 ని।।లు కొనసాగిన సమావేశం

దాదాపు తొమ్మిది నెలల తరువాత ప్రధాని నరేంద్రమోడీతో సీఎం కేసీఆర్‌ ‌సమావేశమయ్యారు. అంతకు ముందు ఉదయం ఆయన బీజేపీ సీనియర్‌ ‌నేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌ ‌షాతో సమావేశమయ్యారు..గురువారం సాయంత్రం హైదరాబాద్‌ ‌నుండి డిల్లీకి చేరిన సీఎం వెంట పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు ఉన్నారు. ఇక శుక్రవారం ఉదయం అమిత్‌ ‌షాతో జరిగిన భేటిలో రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ములుగు, నారయణపేట్‌, ‌జిల్లాలను నోటిఫై చేయాలని కోరారు. దీంతో పాటు, రాష్ట్రంలో ఉన్న పెండింగ్‌ ‌సమస్యలను కూడ పరిష్కరించాలని సీఎం కోరినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చినట్టు సమాచారం. ముఖ్యంగా షెడ్యుల్‌ 9,10‌లో విభజన అంశాలతో పాటు రాష్ట్రానికి రావాల్సిన ఇతర ప్రాజెక్టులపై కూడ ఆయనతో చర్చించారు. దీంట్లో చాలా వాటిపై అమిత్‌ ‌షా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.
ఇక సాయంత్రం ప్రధాని మోదీని కలిసిన సీఎం కేసీఆర్‌ ‌ప్రధానంగా కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే నిధులను పెంచాలని కోరారు..గతంలో కేంద్ర మంత్రులు సైతం తమ పధకాలను అభినందించారనే విషయం పీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.. దీంతో పాటు రాష్ట్రంలో ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రధానిని కేసీఆర్‌ ‌కోరారని సమాచారం..ఇకరాష్ట్రంలో గొలుసుకట్టు చెరువులకు పునర్వైభవం తీసుకొస్తున్న ‘మిషన్‌ ‌కాకతీయ’ కార్యక్రమాన్ని నీతి ఆయోగ్‌ ‌ప్రశంసించిందని ఈ పథకంతో తెలంగాణలో భూగర్భ జలాలు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయని ఇక ఇంటింటికి స్వచ్ఛమైన తాగునీటిని అందించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం మిషన్‌ ‌భగీరథ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని ఈ పథకాన్ని స్వయంగా ప్రధానే ప్రారంభించారు కాబట్టి ఈ పథకానికి కూడా ఆర్థిక సాయం అందించాలని నీతి ఆయోగ్‌ ‌కేంద్రానికి సిఫారసు చేసిందని గుర్తుచేశారు. మిషన్‌ ‌భగీరదకు ఆర్థిక సహాయం చేయాలని ప్రధానిని కేసీఆర్‌ ‌కోరారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌ ‌రావు సమర్పించిన మెమెరాండంలో అంశాలు..
ప్రధాని నరేంద్రమోదీ తో ఒక గంటకు పైగా కెసిఆర్‌ ‌భేటీ జరిగింది ఇందులో మొత్తం ఇరవై మూడు సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు ఇందులో వరుసగా…
1. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలో వెనుకబడిన జిల్లాలకు 450 కోట్లు – 5 వ విడత సహాయంగా విడుదలచేయాలనికోరారు. 2. నేషనల్‌ ‌హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇం‌డియా సహాయంతో ఆదిలాబాద్‌ ‌జిల్లా సిమెంట్‌ ‌కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇం‌డియా పునరుద్ధరణ చేయాలి. 3. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుండి 42 వరకు పెంచాలి. 4. తెలంగాణ
లో ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌మేనేజ్‌మెంట్‌ (ఐఐఎం) ఏర్పాటు చేయాలి. 5. ఇండియన్‌ ఇన్స్టిట్యూట్‌ ఆఫ్‌ ‌సైన్స్ ఎడ్యుకేషన్‌ అం‌డ్‌ ‌రీసెర్చ్ యొక్క అనుమతి ఇవ్వాలి. 6. కొత్త జిల్లాల్లో 23 జవహర్‌ ‌నవోదయ విద్యాలయాల (జెఎన్‌వి) మంజూరు చేయాలి. 7. తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులు: పనులు పూర్తి చేయడానికి మరియు వేగవంతం చేయడానికి నిధుల అవసరం ఉందని
కోరారు. 8. ఎన్‌ఐటిఐ ఆయోగ్‌ ‌సిఫారసు చేసిన మిషన్‌ ‌కాకతీయ, మిషన్‌ ‌భగీరథాలకు ఆర్థిక సహాయం (రూ .5000 కోట్లు, రూ. 19205 కోట్లు) సహాయం
చేయాలి. 9. ఖమ్మం జిల్లాలోని బయ్యారాం వద్ద స్టీల్‌ ‌ప్లాంట్‌ ఏర్పాటు – దాని కోసం పునర్వ్యవస్థీకరణ చట్టం అమలుచేయడం. 10. మేడక్‌ ‌జిల్లా జహీరాబాద్‌ ‌వద్ద జాతీయ పెట్టుబడి మరియు తయారీ జోన్‌ (‌నిమ్జెడ్‌) ‌కోసం నిధుల విడుదల చేయాలి. 11. హైదరాబాద్‌లో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ‌డిజైన్‌ (ఎన్‌ఐడి) ఏర్పాటు చేయాలి (దీని స్థానం విభజన తరువాత విశాఖపట్నంకు మార్చబడింది). 12. తెలంగాణా రాష్ట్రంలో ఎస్సీల ఉప వర్గీకరణ జరపాలి (అసెంబ్లీ తీర్మానం). 13. కరీంనగర్‌లో పిపిపి మోడల్‌ ‌కింద ఐఐఐటి మంజూరు చేయడం. 14. ఉపాధి మరియు విద్యలో దీ• లకు రిజర్వేషన్ల పెంపు (బిసి 37%, ఎస్సీ 15%, ఎస్టీ 10%). పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభలలో మహిళలకు 33% రిజర్వేషన్‌: అసెంబ్లీ తీర్మానం అమలు అయేలా చూడటం. 16. హైదరాబాద్‌ అభివృద్ధి – నాగ్‌పూర్‌ ‌మరియు వరంగల్‌-‌హైదరాబాద్‌ ‌పారిశ్రామిక కారిడార్లు ఏర్పాటుచేయడం. 17. పిఎమ్‌జిఎస్‌వై (ప్రధాన మంత్రి గ్రామ సడక్‌ ‌యోజన) వెనుకబడిన ప్రాంతాల్లో మెరుగైన కనెక్టివిటీ కోసం 4000 కిలోమీటర్ల మేర అప్‌‌గ్రేడ్‌
‌చేయడానికి నిధుల కేటాయింపు చేయాలి. 18. లెఫ్ట్ ‌వింగ్‌ ఉ‌గ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్‌ ‌వర్కస్: 60:40 ‌నిష్పత్తికి బదులుగా పూర్తి ఖర్చును కేంద్రం భరించాలి
19. గిరిజన విశ్వవిద్యాలయానికి వరంగల్‌లోని సెంట్రల్‌ ‌యూనివర్శిటీగా పూర్తి కేంద్ర నిధులు కేటాయించాలి. 20. వరంగల్‌ ‌టెక్స్‌టైల్‌ ‌పార్కుకు ఒక సారి గ్రాంట్‌-ఇన్‌-ఎయిడ్‌ ‌రూ .1000 కోట్లు ఇవ్వాలి. 21. రామప్ప ఆలయం- ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటన వచ్చేలా చేయాలి. 22. వరద ప్రవాహ కాలువ – సవరించిన వ్యయం అందించాలి
23. కంటోన్మెంట్‌ ‌ప్రాంతంలో సెక్రటేరియట్‌ ‌భవనం మరియు రహదారుల వెడల్పు కోసం రాష్ట్ర ప్రభుత్వ భూములతో రక్షణ భూముల మార్పిడికి అనుమతి ఇవ్వాలి. ఇక తరువాత కేంద్ర రక్షణశాఖమంత్రి రాజ్నాథ్‌ ‌సింగ్‌ ‌ని కలిసిన కేసీఆర్‌ ‌ప్రధానంగా కంటోన్మెంట్‌ ‌భూములకు సంబంధించిన అంశాన్ని ప్రస్తావించి వీలయినంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు..

Leave a Reply

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

Privacy & Cookies Policy