Take a fresh look at your lifestyle.

నిత్యావసర సరుకులు పంపిణీ

మధిర పట్టణంలోని జ్యూయలరీ వర్కర్లుగా జీవనం సాగిస్తున్నమధ్యతరగతి కుటుంబాలకు అన్న ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఎంఇఓ వై.ప్రభాకర్‌, ‌బులియన్‌ ‌మర్చంట్స్ అధ్యక్షులు కోనా ధనికుమార్‌, ‌టిడిపి పట్టణ అధ్యక్షులు మల్లా హన్మంతరావు చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా అన్న ఫౌండేషన్‌ ‌చైర్మన్‌ ‌మేళం శ్రీనివాస్‌యాదవ్‌ ‌మాట్లాడుతూ పేద,మధ్య తరగతి వర్గాల ప్రజలను గుర్తించి వారికి అండగా ఉంటూ నిత్యావసర సరుకులను పంపిణీ చేయటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కోనా జగదీష్‌, ‌కంభంపాటి సర్వేశ్వరరావు, మైలవరపు భద్రం తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply