Take a fresh look at your lifestyle.

నిత్యావసరాల పంపిణీ

కారేపల్లి, మే 1, (ప్రజాతంత్ర విలేకరి) : సింగరేణి మండల పరిధిలోని వివిధ గ్రామపంచాయతీల్లో శుక్రవారం బియ్యం, కూరగాయలు వితరణ చేసారు. మండల పరిధిలోని ఉసిరికాయలపల్లి గ్రామంలో సర్పంచ్‌ ‌బానోతు బన్సీలాల్‌ ‌మేడే సందర్బంగా కూరగాయలు ఎంఆర్‌ఓ ‌పుల్లయ్య, ఎంపిడివో మాచర్ల రమాదేవి, పర్సా ట్రస్ట్ ‌చైర్మన్‌ ‌పర్చా పట్టాబి రామారా వుల చేతుల మీదుగా పంపిణీ చేసారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ ‌చంద్రశేఖర్‌, ‌సిపిఎం నాయకులు కొండబోయిన నాగేశ్వరరావు, మూడు శోభన్‌, ‌మాజీ ఎంపిటిసి గడ్డం వెంకటేశ్వర్లు, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా హల్యాతండాలో 100 కుటుంబాలకు సింగరేణి మండల టిఆర్‌ఎస్‌ ‌ప్రధానకార్యదర్శి అజ్మీర వీరన్న, బోడ రవి, యుగంధర్‌ల సారధ్యంలో బొంబాయి ఇన్‌కంటాక్స్ అడిషనల్‌ ‌కమీషనర్‌ ‌జీవన్‌లాల్‌ ఆదేశానుసారం ఎంపిటిసి మూడు జ్యోతి,ఎస్‌ఐ ‌పొదిలి వెంకన్నల చేతులమీ దుగా పంపిణీ చేసారు.

గరిడేపల్లిలో…
గరిడేపల్లి, మే 1(ప్రజాతంత్ర విలేకరి) : మండలంలోని వెలిదండ గ్రామంలో పోటు శేషయ్య, పోటు సీతమ్మ, వెంకయ్య జ్ఞాపకార్థం వారి కుమారుడు రిటైర్డ్ ‌టీచర్‌ ‌పోటు రామారావు పేద కుటుంబాలకు శుక్రవారం 15 కిలోల సన్బబియ్యం, కందిపప్పు, నూనె, కూరగాయలను ఎస్సై నర్సింగ్‌ ‌వెంకన్నగౌడ్‌ ‌చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ‌పద్మ కోటయ్య, ఎంపిటిసి విజయ పాల్గొన్నారు.

మధిరలో..
మధిర, మే 1 (ప్రజాతంత్ర) : అన్నఫౌండేషన్‌ ‌చైర్మన్‌ ‌మేళం శ్రీనివాస్‌ ‌యాదవ్‌ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని స్థానిక టివిఎం హైస్కూల్‌ ‌నందు శుక్రవారం నిర్వహించారు. మే డే సందర్భంగా కార్మికులకు, ప్రైవేట్‌ ఎలక్ట్రికల్స్ ‌వర్కర్లకు, ఫొటో గ్రాఫర్లకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అదేవిధంగా స్థానిక ఫైర్‌స్టేషన్‌లోని అగ్ని మాపక సిబ్బందికి శానిటైజర్‌, ‌మాస్కులను పంపిణీ చేశారు.ఈకార్యక్రమాల్లో ఇఓఆర్‌డి రాజారావు, ఎంఇఓ వై.ప్రభాకర్‌, ‌కాంగ్రెస్‌ ‌మైనార్టీ సెల్‌ అధ్యక్షులు జహంగీర్‌,ఎలక్ట్రికల్‌ ‌వర్కర్స్ ‌యూనియన్‌ అధ్యక్షులు సింగు వెంకటేశ్వరరావు, పరమయ్య, కూరపాటి శ్రీను, అక్బర్‌అలీ, కోటయ్య, ఫొటో గ్రాఫర్లు గొకర్ల చంద్రం, శ్రీధర్‌, ‌లక్ష్మణ్‌, ‌శ్యామారావు తదితరులు పాల్గొన్నారు.

రామన్నపేటలో…
రామన్నపేట, మే1(ప్రజాతంత్ర విలేకరి) : చేనేత కుటుంబాలను దాతలు ముందుకొచ్చి ఆదుకోవాలని డిసిఎంఎస్‌ ‌మాజీ జిల్లా డైరెక్టర్‌ ‌జెల్లా వెంకటేశం కోరారు. శుక్రవారం మండల కేంద్రంలోని స్థానిక పద్మశాలి కలనిలోని నిరుపేద చేనేత కార్మిక కుటుంబాలకు ఆయన నిత్యావసర వస్తువులను పంపిణీ చేసి మాట్లాడారు. కార్యక్రమంలో రచ్చ యాదగిరి, బోడ సుదర్శన్‌, ‌సూరపల్లి యాదగిరి, పొట్టబత్తిని రమేష్‌, ‌గంగుల మురళి, లక్ష్మణ్‌ ‌తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply